చైనా నుంచి వచ్చి ఇండియాలో దుమ్మురేపుతున్న కారు.. రోజుకు ఏకంగా 700మంది కొంటున్నారు

కార్ల ప్రపంచంలో ఒక కొత్త సెన్సేషన్ BYD కంపెనీకి చెందిన అట్టో 3 కారు. ఇది ఇప్పటి వరకు ఏకంగా 10 లక్షల యూనిట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. అది కూడా చాలా తక్కువ సమయంలోనే ఈ ఘనత సాధించింది. ప్రజలు ఈ కారును ఎందుకు ఇంతలా ఇష్టపడుతున్నారు? అసలు ఈ కారులో ఏముంది? వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

చైనాకు చెందిన BYD కంపెనీ ఇండియాలో Atto 3 పేరుతో ఒక ఎస్‌యూవీ కారును అమ్ముతోంది. 2022లో ఈ కారు చైనాలో యువాన్ ప్లస్ అనే పేరుతో రిలీజ్ అయ్యింది. ఈ కారు రిలీజ్ అయిన కేవలం 31 నెలల్లోనే 10 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది.

BYD Atto 3

ఈ కారు రిలీజ్ అయిన మొదటి 14 నెలల్లోనే 3 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును చేరుకుంది. ఆ తర్వాత 6 నెలల్లో ఇంకో 2 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత 25 నెలల్లో 5 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. ఇది కేవలం చైనాలోనే కాదు, ఇండియా సహా 100 దేశాలకు ఎగుమతి అవుతోంది.

ఈ లెక్కన చూస్తే ఈ కారు మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి 1391 రోజుల్లోనే 10 లక్షల యూనిట్ల అమ్మకాలను చేరుకుంది. అంటే, సరిగ్గా లెక్క పెడితే రోజుకు దాదాపు 719 కార్లను ఈ కంపెనీ తయారు చేసి అమ్మకానికి పంపుతోందన్నమాట. ఏ దేశంలో ఎన్ని కార్లు అమ్ముడయ్యాయి అనే వివరాలను కంపెనీ ఇంకా బయటపెట్టలేదు.

BYD Atto 3

చైనాలో యువాన్ ప్లస్ పేరుతో రిలీజ్ అయిన ఈ కారు, ఇండియన్ కరెన్సీలో రూ.13.97 లక్షల ధరతో అమ్ముడవుతోంది. ఇండియాలో ఈ కారు 2022 నవంబర్‌లో విడుదలైంది. అయితే, మన దేశంలో ఈ కారు రూ.24.99 లక్షల ప్రారంభ ధరతో అమ్ముడవుతోంది. ప్రస్తుతం ఈ కారు చైనా నుంచే ఇండియాకు దిగుమతి అవుతోంది. ఒకవేళ ఇండియాలోనే ఈ కారును తయారు చేస్తే, ధర ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఇండియాలో BYD Atto 3 కారు వేరియంట్ల ధరలను పరిశీలిస్తే.. అట్టో 3 డైనమిక్ వేరియంట్ ప్రారంభ ధర. 24.99 లక్షలు, అట్టో 3 ప్రీమియం వేరియంట్ ప్రారంభ ధర రూ.29.85 లక్షలు, అట్టో 3 సుపీరియర్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 33.99 లక్షలు (టాప్ వేరియంట్) ఉంటుంది.

BYD Atto 3

ఈ BYD Atto 3 కారు రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. 49.92 kWh, 60.48 kWh. ఈ బ్యాటరీలు లిథియం అయాన్ ఫాస్ఫేట్ రకానికి చెందినవి. చిన్న బ్యాటరీ ప్యాక్‌తో కారు ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 468 కి.మీ. దూరం ప్రయాణించగలదని చెబుతున్నారు. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో అయితే 521 కి.మీ. దూరం వరకు వెళ్లగలదు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: BYDకంపెనీ ఈ కారును ప్రపంచవ్యాప్తంగా అమ్ముతోంది. ఈ కారు డిజైన్, ఫీచర్లతో పాపులారిటీ తెచ్చుకుంది. ఈ కారు ఇండియాకు దిగుమతి అవుతోంది కాబట్టి ధర ఎక్కువగా ఉంది. ఈ కారు ఇండియాలోనే తయారైతే ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది. అయితే, కంపెనీ దీని గురించి సమాచారం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఒకవేళ ఇండియాలో తయారై ధర తగ్గితే ఈ కారు అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 25, 2025, 14:22 [IST]
English summary
700 cars a day why are people rushing to buy the byd atto 3
Read more on: #byd #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+