పొలిటీషియన్లకు, సెలబ్రిటీలకు బాగా నచ్చే కారు.. దీని కోసం షోరూంల ముందు పడిగాపులు కాస్తున్నారు
టయోటా ఇన్నోవా (Toyota Innova) అనేది ఒక సూపర్ పాపులర్ ఎమ్‌పీవీ. మన దేశంలో ఇది హైక్రాస్, క్రిస్టా అనే రెండు రకాల్లో దొరుకుతుంది. రెండూ కూడా చాలా ఆకర్షణీయంగా ఉండటంతో జనం ఇష్టపడి కొనేస్తున్నారు. ఈ మే నెలలో కూడా టయోటా కంపెనీ ఈ 'ఇన్నోవా' ఎమ్‌పీవీని భారీ సంఖ్యలో అమ్మింది. మరి, ఆ వివరాలు ఏంటి? వివరంతగా ఈ వార్తలో తెలుసుకుందాం.
మే నెలలో టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) మొత్తం 8,882 యూనిట్ల 'ఇన్నోవా'లను విక్రయించింది. 2024 మే నెలలో 8,548 యూనిట్లు అమ్మింది. గతేడాదితో పోలిస్తే అమ్మకాల వృద్ధి 4శాతం పెరిగింది. అలాగే, ఏప్రిల్ నెలలో 7,699 యూనిట్లను విక్రయించారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే, నెలవారీ (MoM)గా కూడా అమ్మకాల్లో మంచి పెరుగుదల కనిపిస్తోంది.

ఈ ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పీవీ ధర రూ.20 లక్షల నుండి రూ.32 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది వీఎక్స్ (VX), వీఎక్స్ (O), జెడ్ఎక్స్ (ZX) అనే వేరియంట్లలో లభిస్తుంది. బయట నుండి చూస్తే చాలా లేటెస్ట్ డిజైన్ ఉంటుంది. ప్లాటినం వైట్ పర్ల్, ఆటిట్యూడ్ బ్లాక్ మైకా, సిల్వర్ మెటాలిక్, సూపర్ వైట్ అనే రంగుల ఆప్షన్లలో కూడా దొరుకుతుంది.
ఇది పవర్ ఫుల్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. 2.0-లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 2.0-లీటర్ 4 సిలిండర్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) ఇంజిన్ ఆప్షన్లను కలిగి ఉంది. సీవీటీ (CVT) గేర్‌బాక్స్‌ను పొందింది. లీటరుకు 21 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది.

కొత్త ఎమ్‌పీవీ 7/8 సీటర్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి వీలుగా 300 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్, ఫోన్ ఛార్జింగ్ తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఏడీఏఎస్, 360-డిగ్రీ కెమెరాను పొందింది.
ఈ ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీ (Toyota Innova Crysta) ధర రూ.20 లక్షల నుండి రూ.27 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది బయట నుండి చాలా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ప్లాటినం వైట్ పర్ల్, సూపర్‌వైట్, సిల్వర్ మెటాలిక్, ఆటిట్యూడ్ బ్లాక్ మైకా అనే రంగులలో దొరుకుతుంది.

ఇది కూడా పటిష్టమైన పవర్‌ట్రెయిన్‌ను పొందింది. కేవలం 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. వేరియంట్లను బట్టి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను పొందింది. లీటరుకు 8 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ కారులో 7/8 సీటర్ ఆప్షన్ ఉంది. ప్రయాణీకులు హాయిగా కూర్చుని ప్రయాణం చేయవచ్చు.
కొత్త ఎమ్‌పీవీ అనేక ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ (Dual Zone Climate Control) ను కలిగి ఉంది. ప్రయాణీకుల రక్షణ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ముందు వెనుక పార్కింగ్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: టయోటా ఇన్నోవా, దాని హైక్రాస్ క్రిస్టా మోడల్‌లతో భారతదేశంలో ఎమ్‌పీవీ సెగ్మెంట్‌కు రాజుగా నిలుస్తోంది. మైలేజ్, ఫీచర్లు, సౌకర్యం, విశ్వసనీయత వంటి అంశాలు దీని అమ్మకాలకు ప్రధాన కారణాలు. పెద్ద కుటుంబాలకు లేదా వాణిజ్య అవసరాలకు ఇది ఒక అద్భుతమైన ఆప్షన్.


Click it and Unblock the Notifications








