Acer Faster Awards 2025: ముగిసిన ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం.. పూర్తి వివరాలు ఇవే
ఏసర్ ఫాస్టర్ అవార్డుల (acer faster awards) నాలుగో ఎడిషన్ కోసం దేశంలో వాహన ప్రేమికులు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా దీనికి సంబంధించిన జ్యూరీ సమావేశం ఫిబ్రవరి 26,27 తేదీలలో చెన్నైలోని మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్ (MMRT)లో విజయవంతంగా ముగిసింది. గతంలో ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకను ఈసారి కూడా అదే విధంగా నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. తాజాగా ముగిసిన జ్యూరీ సమావేశంలో న్యాయనిర్ణేతలు గత ఏడాదిలో మార్కెట్లోకి వచ్చిన బెస్ట్ కార్స్, బైక్స్‌లను ఎంపిక చేశారు. తుది నామినేషన్‌లో భాగంగా టెక్నాలజీ, ఆకట్టుకునే డిజైన్, సేఫ్టీతో పాటు ఇతర కీలక అంశాలకు సంబంధించి కఠిన పరీక్షలు నిర్వహించిన తర్వాత వాటిలో నుంచి అత్యుత్తమమైనవాటిని చివరి రౌండ్‌కు నామినేట్ చేశారు. విజేతలను కూడా ప్రకటించనున్నారు.
ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ జ్యూరీలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారు. వారు, ప్రోమీత్ ఘోష్ (డ్రైవ్‌స్పార్క్), రోహిత్ ఖురానా (కార్‌బ్లాగ్‌ఇండియా), రోషన్ జోసెఫ్ (ఎడిటర్, పైలట్ ఆన్ వీల్స్), అమిత్ ఛంగాని ( ఎడిటర్, మోటరాయిడ్స్) - ఛైర్మన్, ఫాస్టర్, నరేంద్ర శర్మ (ఎడిటర్, గేర్‌ఫ్లిక్) - కార్యదర్శి, ఫాస్టర్, గౌరవ్ యాదవ్ ( ఎడిటర్, గాడివాడి). ఏసర్ ఫోస్టర్ అవార్డుల ప్రదానోత్సవం వేడుక గత 3 ఏళ్లుగా జరుగుతుంది.

ప్రస్తుతం జరుగుతున్న ఈ వేడుక నాలుగోది. దీనిలో మా డ్రైవ్‌స్పార్క్ నుంచి ఎడిటర్ అయిన ప్రోమీత్ ఘోష్ కూడా ఉండటం మాకు గర్వించదగ్గ విషయం. ఇక ఫాస్టర్ విషయానికి వస్తే, దీని పూర్తి పేరు ఫెడరేషన్ ఆఫ్ ఆటో స్క్రైబ్స్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ రియల్మ్ (FASTER). దీనిలో వివిధ భాషలలో 250 మిలియన్లకు పైగా నెలవారీ యూజర్లను కలిగిన మీడియా సంస్థలకు చెందిన ఆటోమోటివ్ జర్నలిస్టులు సభ్యులుగా ఉంటారు.
ఆటోమొబైల్ పరిశ్రమను ప్రోత్సహించడానికి ఇలాంటి అవార్డు వేడుకలను నిర్వహిస్తున్నారు. తయారీదారులకు, పరిశ్రమకు ఇది ఎంతో ఉత్సాహాన్ని కలిగించే ఈవెంట్. దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతున్న తరుణంలో ఇలాంటి వేడుకలు అవసరం ఉంది. ఆటోమోటివ్ రంగంలో శక్తివంతమైన మీడియా సంస్థలో ఫాస్టర్ ప్రధానమైనది. ఈ వేడుకను గత మూడేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 2025 ఎడిషన్ ఏసర్ ఫాస్టర్ అవార్డు మరింత ఘనంగా జరుగుతుంది.

ఈ సంస్థ ప్రతి ఏడాది బైక్ ఆఫ్ ది ఇయర్, కార్ ఆఫ్ ది ఇయర్, ప్రీమియం బైక్ ఆఫ్ ది ఇయర్, ప్రీమియం కార్ ఆఫ్ ది ఇయర్ వంటి పలు విభాగాల్లో అవార్డులను ప్రదానం చేస్తుంది. 2025 ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్‌లో డేటాను విశ్లేషించడానికి జెన్ మైక్రోసిస్టమ్స్ టెస్టింగ్ పార్టనర్‌గా నిలిచింది. అలాగే, ఈ జ్యూరీ రౌండ్‌ను మార్కెట్స్ & మార్కెట్స్ స్వతంత్ర ఏజెన్సీగా పర్యవేక్షించింది.
ఇక జ్యూరీ సమావేశం నిర్వహించిన చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ విషయానికి వస్తే, ఇండియాలో ప్రసిద్ధ మోటార్ స్పోర్ట్స్ హబ్‌లలో ఇది ఒకటి. 1990లో దీన్ని ప్రారంభించారు. ఇది 3.71 కిలోమీటర్ల పొడవున్న ఒక పెద్ద ట్రాక్‌తో పాటు 2.06 కిలోమీటర్ల పొడవు మరొక చిన్న ట్రాక్‌ను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








