2025 ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్: 4వ ఎడిషన్ కోసం సిద్దమైన మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్..
భారతీయ వాహన ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏసర్ ఫాస్టర్ అవార్డుల (acer faster awards) నాల్గవ ఎడిషన్ కోసం జ్యూరీ రౌండ్ 26 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గత ఏడాది (2024)లో ఎంతో ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ ఈ సారి మరింత ఘనంగా జరగడానికి సిద్దమవుతుంది. 2025 ఎడిషన్ కోసం చెన్నైలోని ప్రసిద్ధ మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్‌లో జ్యూరీ రౌండ్‌ను ఫిబ్రవరి 26,27 తేదీలలో నిర్వహించనున్నారు. గత ఏడాది మార్కెట్లోకి విడుదలైన కార్లు, బైక్స్‌లలో ఉత్తమమైన వాటిని గుర్తించి బహుమతులతో సత్కరిస్తారు. నాల్గవ ఎడిషన్ కోసం అవార్డులకు వాహనాలను ఎంపిక చేయడానికి 26 నుంచి రెండు రోజుల పాటు జ్యూరీ సమావేశం జరుగుతుంది. ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ జ్యూరీలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారు. 2024లో విడుదలైన కార్స్, బైక్స్ ఈ జ్యూరీలో ఎంట్రీకి అర్హత కలిగి ఉంటాయి.
దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతుంది. అమ్మకాలు గతంలో కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి. తయారీదారులను, పరిశ్రమను ప్రోత్సహించడానికి ఇలాంటి అవార్డు వేడుకలను నిర్వహించడం చాలా అవసరం. అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏసర్ ఫోస్టర్ అవార్డుల ప్రదానోత్సవం వేడుక గత 3 ఏళ్లుగా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్ నాలుగోది.

2025 ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ జ్యూరీ సభ్యులు ఎవరనేది తెలుసుకుందాం: గౌరవ్ యాదవ్ (ఎడిటర్, గడివాడి), అమిత్ చంగాని (ఎడిటర్, మోటరాయిడ్స్), ప్రోమీత్ ఘోష్ - (రివ్యూస్ ఎడిటర్, డ్రైవ్‌స్పార్క్), రోహిత్ ఖురానా (ఎడిటర్, కార్‌బ్లాగ్ ఇండియా) , నరేంద్ర శర్మ (ఎడిటర్, గేర్‌ఫ్లిక్), రోషన్ జోసెఫ్ (ఎడిటర్, పైలట్ ఆన్ వీల్స్). వీరంతా కూడా అవార్డుల కోసం కార్స్, బైక్స్‌లను నిర్ణయించే న్యాయనిర్ణేత ప్యానెల్‌లో భాగం అవుతారు.
డ్రైవ్‌స్పార్క్ బృందం నుండి ఎడిటర్ అయిన ప్రోమీత్ ఘోష్ కూడా ఈ బృందంలో భాగంగా ఉన్నారు. FASTER (ఫెడరేషన్ ఆఫ్ ఆటో స్క్రైబ్స్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ రియల్మ్) లో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో 250 మిలియన్లకు పైగా నెలవారీ యూజర్లను కలిగి ఉన్న వివిధ మీడియా సంస్థలకు చెందిన అనుభవం కలిగిన ఆటోమోటివ్ జర్నలిస్టులు సంస్థలో భాగంగా ఉంటారు. FASTER అనేది ఆటోమోటివ్ రంగంలో శక్తివంతమైన మీడియా సంస్థ.

ఫాస్టర్ అవార్డ్స్‌లో వివిధ విభాగాలలో అవార్డులను ప్రధానం చేస్తారు. బైక్ ఆఫ్ ది ఇయర్, కార్ ఆఫ్ ది ఇయర్, ప్రీమియం కార్ ఆఫ్ ది ఇయర్, ప్రీమియం బైక్ ఆఫ్ ది ఇయర్ ఇతర పేర్లతో సత్కారం చేస్తారు. 2025 ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ కోసం డేటాను విశ్లేషించడానికి జెన్ మైక్రోసిస్టమ్స్ టెస్టింగ్ పార్టనర్‌గా చేతులు కలిపింది. జ్యూరీ రౌండ్‌ను మార్కెట్స్ & మార్కెట్స్ స్వతంత్ర ఏజెన్సీగా పర్యవేక్షిస్తుంది
మా 'డ్రైవ్‌స్పార్క్' కూడా 2025 ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ భాగం కావడం గర్వకారణం. ఇక మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్ విషయానికి వస్తే, ఇది ఇండియాలో ప్రసిద్ధ మోటార్ స్పోర్ట్స్ హబ్‌లలో ఒకటి. 1990లో దీన్ని ప్రారంభించారు. దీనిలో 2 రకాల రేసింగ్ సర్క్యూట్‌లు ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








