ఆ టైం రానే వచ్చింది.. నేడే 2025 ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్.. రేసులో ఏ వెహికల్స్ ఉన్నాయంటే ?

భారతదేశంలోని వాహన ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఏసర్ ఫాస్టర్ అవార్డుల (acer faster awards) నాల్గవ ఎడిషన్ విజేతలను ఈరోజు ప్రకటించనున్నారు. గత ఏడాది (2024)లో ఎంతో ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ ఈ సారి మరింత ఘనంగా నిర్వహించనున్నారు. గతేడాది మార్కెట్లో విడుదలైన కార్లు, బైక్స్‌లలో ఉత్తమమైన వాటిని గుర్తించి బహుమతులతో సత్కరిస్తారు.

నాల్గవ ఎడిషన్ కోసం అవార్డులకు వాహనాలను ఎంపిక చేయడానికి గత నెల రెండు రోజుల పాటు జ్యూరీ సమావేశం జరిగింది. ఇది చెన్నైలోని ప్రసిద్ధ మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్‌లో నిర్వహించారు. ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ జ్యూరీలో మొత్తం ఆరుగులు సభ్యులు ఉంటారు. 2024లో విడుదలైన కార్స్, బైక్స్‌ ఈ జ్యూరీలో ఎంట్రీకి అర్హత కలిగి ఉంటాయి.ఫెడరేషన్ ఆఫ్ ఆటో స్క్రీబ్స్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ రియల్మ్ (ఫాస్టర్) అందిస్తుంది.

Acer Faster Awards 2025 News

గత ఏడాది భారత మార్కెట్లో విడుదలైన ఉత్తమ కార్లు, బైక్‌లకు గుర్తింపుగా దీనిని అందిస్తారు. FASTER అని ప్రసిద్ధి చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఆటో స్క్రైబ్స్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ రియల్మ్, భారతీయ ఆటో మీడియాలో అత్యంత ప్రభావవంతమైన సంస్థలలో ఒకటి, ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం అనే ఆరు వేర్వేరు భాషలలో 250 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది.

మునుపటి ఎడిషన్ల మాదిరిగానే డ్రైవ్‌స్పార్క్, కార్‌బ్లాగ్‌ఇండియా, గాడివాడి, గేర్‌ఫ్లిక్, మోటరాయిడ్స్,పైలట్ ఆన్ వీల్స్ వంటి ప్రముఖ సంస్థల నుంచి నిపుణులు పాల్గొంటారు. ఈ ఎడిషన్ అవార్డుల జ్యూరీలో డ్రైవ్‌స్పార్క్ రివ్యూస్ ఎడిటర్ ప్రోమిత్ ఘోష్, అమిత్ చంగాని (ఎడిటర్, మోటరాయిడ్స్), నరేంద్ర శర్మ (ఎడిటర్, గేర్‌ఫ్లిక్), రోహిత్ ఖురానా (ఎడిటర్, కార్‌బ్లాగ్ ఇండియా), గౌరవ్ యాదవ్ (ఎడిటర్, గాడివాడి), రోషన్ జోసెఫ్ (ఎడిటర్, పైలట్ ఆన్ వీల్స్) ఉన్నారు.

Acer Faster Awards

ఫాస్టర్ అవార్డ్స్ ఎంచుకున్న కీలక విభాగాలపై దృష్టి పెడతాయి. అనవసరమైన సమస్యలు లేకుండా ఉత్తమ వాహనాలను సులభంగా గుర్తించడంలో ఇది కస్టమర్లకు సాయపడుతుంది. పాయింట్స్ బేస్డ్ సిస్టమ్, డిజైన్, పర్ఫామెన్స్, టెక్నాలజీ, సేఫ్టీ, డబ్బుకు విలువ వంటి కీలక అంశాలలో అస్సెస్ మెంట్ చేస్తుంది.

కార్ ఆఫ్ ది ఇయర్, బైక్ ఆఫ్ ది ఇయర్, ప్రీమియం కార్ ఆఫ్ ది ఇయర్, ప్రీమియం బైక్ ఆఫ్ ది ఇయర్, స్కూటర్ ఆఫ్ ది ఇయర్, ఈవీ ఫోర్ వీలర్ ఆఫ్ ది ఇయర్, ఈవీ టు వీలర్ ఆఫ్ ది ఇయర్, అప్‌డేట్ ఆఫ్ ది ఇయర్, అల్టిమేట్ ఐకాన్ అవార్డు వంటి తొమ్మిది ప్రధాన విభాగాల్లో అవార్డులు అందించనున్నారు.

Acer Faster Awards 2025

ఆటోమోటివ్ డేటా టెస్టింగ్‌లో దేశంలోని ప్రముఖ నిపుణులలో ఒకరైన జెన్ మైక్రోసిస్టమ్స్, 2025 ఏసర్ ఫాస్టర్ అవార్డులతో డేటా అండ్ టెస్టింగ్ భాగస్వామిగా ఉంది. ఈ పర్యవేక్షణను మార్కెట్స్ & మార్కెట్స్ ఒక స్వతంత్ర ధ్రువీకరణ ఏజెన్సీగా నిర్వహించింది. 2025 ఏసర్ ఫాస్టర్ అవార్డుల వేడుకలో ప్రముఖ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రముఖులు, ఎగ్జిక్యూటివ్‌లు, వాహన ప్రియులు కూడా పాల్గొంటారు.

కొన్ని అత్యుత్తమ కార్లు, బైక్‌లు విడుదలై ఒక సంవత్సరం అయింది. అందువల్ల, వారిలో ది బెస్ట్ ఎవరో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. అవేంటో తెలుసుకునేందుకు మరికొన్ని గంటలు వెయిట్ చేస్తే సరిపోతుంది. డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్, సోషల్ మీడియా పేజీలు ఫాస్టర్ అవార్డులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటాయి.

Acer Faster

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 26, 2025, 9:44 [IST]
English summary
Acer faster awards 2025 winners announced for best cars and bikes in india
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+