Acer Faster Awards: ఇండియాలో బెస్ట్ కార్, బెస్ట్ బైక్ అవార్డులు గెలుచుకున్న వాహనాలు ఇవే!
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమ అలాగే, ఆటో ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏసర్ ఫాస్టర్ (acer faster awards 2025) అవార్డుల నాలుగో ఎడిషన్ విజేతలను ప్రకటించే ఈవెంట్ గురుగ్రామ్‌లో అత్యంత అట్టహాసంగా ముగిసింది. 2024 ఏడాదిలో విడుదలైన ఉత్తమ వాహనాలకు ఈ కార్యక్రమంలో అవార్డులను ప్రధానం చేశారు. మరో ముఖ్యవిషయం ఏమిటంటే ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియలో డ్రైవ్‌స్పార్క్ సహా మొత్తం 6 ప్రముఖ ఆటోమొబైల్ మీడియా సంస్థలు కీలక పాత్ర పోషించాయి. మా డ్రైవ్‌స్పార్క్ బృందానికి చెందిన ప్రోమిత్ ఘోష్ కూడా జ్యూరీ సభ్యుడిగా ఈ అవార్డుల ఎంపికలో భాగం కావడం విశేషం.
గత ఏడాదిలో దేశీయ మార్కెట్‌ను ఒక రేంజ్‌లో అల్లాడించిన శక్తివంతమైన ఆఫ్-రోడర్ SUV మహీంద్రా థార్ రాక్స్(Mahindra Thar Roxx) 'కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును (Car of the Year)' గెలుచుకుంది. టూవీలర్ విభాగంలో బజాజ్ నుంచి వచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్ ఫ్రీడమ్ 125 (freedom 125), ఫాస్టర్ అవార్డ్స్ జ్యూరీలో 2024 సంవత్సరం ఉత్తమ బైక్ (Bike of the Year)గా ఎంపికైంది.

అత్యున్నత అవార్డులు థార్ రాక్స్, బజాజ్ ఫ్రీడమ్ 125లకు దక్కాయి. అలాగే, స్కూటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును TVS జూపిటర్ స్కూటర్ దక్కించుకోవడం విశేషం. ఎలక్ట్రిక్ విభాగంలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన MG విండ్సర్ EVకి బెస్ట్ ఎలక్ట్రిక్ కారు అవార్డును ఇచ్చారు. బెస్ట్ ఎలక్ట్రిక్ టూవీలర్ అవార్డును ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ గెలుచుకుంది. మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్ 2024లో అత్యంత ఖరీదైన కారుగా అవార్డును సాధించింది.
అత్యంత ఖరీదైన బైక్ అవార్డును లగ్జరీ వాహన తయరీ కంపెనీ BMWకి చెందిన R1300 GS బైక్ దక్కించుకుంది. టూవీలర్ విభాగంలో అప్‌డేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును TVS అపాచీ RR310 గెలుచుకుంది. అలాగే, ఫోర్ వీలర్ విభాగంలో హ్యుందాయ్ అల్కాజార్ అప్‌డేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించింది. ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ 2025లో ఈసారి ప్రత్యేక "టైమ్‌లెస్ అవార్డులు" ప్రవేశపెట్టబడ్డాయి.

ఈ కేటగిరీలో, దశాబ్దాలుగా భారతీయుల ప్రేమను అందుకున్న మారుతి సుజుకీ స్విఫ్ట్ ఫోర్ విభాగంలో అవార్డు గెలుచుకోగా, టూవీలర్ విభాగంలో దేశీయ మధ్యతరగతి యువత, కుటుంబాలకు దశాబ్దాలుగా ఇష్టమైన బైక్ హీరో స్ప్లెండర్ ఎంపిక అయింది. ఉత్తమ ప్రకటనల ప్రచారంగా ఫాస్టర్ అవార్డ్స్ జ్యూరీ మహీంద్రా XEV 9e, BE 6 ఎలక్ట్రిక్ కార్లను ఎంచుకుంది. పబ్లిక్ కమ్యూనికేషన్‌లో అత్యుత్తమ ప్రతిభకు అవార్డును మహీంద్రా & మహీంద్రా సాధించింది.
ఇంకా, 2024లో వాహనాలలో అత్యుత్తమ టెక్నాలజీ అందించినందుకు బజాజ్ ఆటో అవార్డును అందుకుంది. అలాగే, గత సంవత్సరం మిండా కార్పొరేషన్ ఉత్తమ విడిభాగాల తయారీదారుగా ఎంపికైంది. CSR విభాగంలో మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ అవార్డును గెలుచుకుంది. ఇతర అవార్డులను చూసినట్టయితే PR టీమ్ ఆఫ్ ది ఇయర్: ఎడెల్మాన్ (నిస్సాన్) , కమ్యూనికేషన్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్: మహీంద్రా PR అందుకున్నారు.

పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్: నీరజ్ అత్రి కమ్యూనికేషన్స్, పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్: శక్తి ఉపాధ్యాయ (కియా) ఆనర్ అవార్డు: రవి శర్మ (మీడియా రిలేషన్స్), మోటార్‌స్పోర్ట్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్: సంజయ్ టకాలే, ఇండస్ట్రీ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్: సంతోష్ అయ్యర్ (మెర్సిడెస్). చివరగా, డ్రైవ్‌స్పార్క్ తరపున, ముందుగా 2024 కి ఉత్తమ వాహనాలుగా ఎంపికైన వాహనాలను రూపొందించిన కంపెనీలను మేము అభినందిస్తున్నాము.


Click it and Unblock the Notifications








