చిన్న ఫ్యామిలీకి చింత లేని ప్రయాణం కావాలనుకునే వాళ్లకు బెస్ట్ కార్ ఇదే.. లీటరుకు ఏకంగా 34కి.మీ

ప్రస్తుతం మార్కెట్‌లో చాలా కార్లు ఉన్నాయి. తక్కువ ధరలో, మంచి మైలేజ్ ఇచ్చే కారు కోసం చూస్తున్నారా.. అలాంటి వాళ్లు మారుతి సుజుకి వ్యాగన్ఆర్(Maruti Suzuki Wagon R) గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

ఇది ఒకప్పుడు టాప్ సేల్స్‌లో ఉండేది.. కానీ ఇప్పుడు కొంచెం వెనుకబడింది. అయితే, కంపెనీ మాత్రం కస్టమర్ల కోసం ఎదురుచూస్తోంది. అసలు వ్యాగన్ఆర్ సేల్స్ ఎందుకు తగ్గాయి? రూ.5.78 లక్షల స్టార్టింగ్ ధరలో, 34 కి.మీ. మైలేజ్ ఇచ్చే ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Maruti Suzuki Wagon R

భారత మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్ కార్లు కొనాలనుకునే వారికి మారుతి సుజుకి వ్యాగన్ఆర్(Maruti Suzuki Wagon R) ఒక మంచి ఆప్షన్. దీని 2025 మే నెల సేల్స్ రిపోర్ట్(Sales Report) ఇప్పుడు రిలీజ్ అయ్యింది. దీని ప్రకారం, మారుతి సుజుకి కంపెనీ 2025 మే నెలలో 13,949వ్యాగన్ఆర్ కార్లను సేల్ చేసింది. కానీ, 2024మే నెలలో ఈ నెంబర్ 14,492గా ఉండేది. అంటే, ఇది 4 శాతం తగ్గిపోయినట్లు లెక్క.

దీని కారణంగా, 2025 మే నెలలో ఎక్కువగా సేల్ అయిన టాప్ 10 కార్ల లిస్టులో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారుకు 7వ ప్లేస్ మాత్రమే దక్కింది. ఈ లిస్టులో మొదటి స్థానంలో మారుతి సుజుకి డిజైర్(Maruti Suzuki Dzire) ఉంది. దీని తర్వాత స్థానాల్లో వరుసగా మారుతి సుజుకి ఎర్టిగా(Maruti Suzuki Ertiga), మారుతి సుజుకి బ్రెజ్జా(Maruti Suzuki Brezza), హ్యుందాయ్ క్రెటా(Hyundai Creta), మహీంద్రా స్కార్పియో(Mahindra Scorpio), మారుతి సుజుకి స్విఫ్ట్(Maruti Suzuki Swift)కార్లు ఉన్నాయి. ఈ వరుసలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారుకు 7వ స్థానం మాత్రమే దక్కింది.

Maruti Suzuki Wagon R

అయితే, ఈ తగ్గుదల తాత్కాలికం మాత్రమే అని నిపుణులు అంటున్నారు. త్వరలోనే, బహుశా 2025 జూన్ నెలలోనే ఈ తగ్గుదల నుండి మారుతి సుజుకి వ్యాగన్ఆర్ బయటపడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది తక్కువ ధరలో(Price) లభించే, అదే సమయంలో ఎక్కువ మైలేజ్(Mileage) ఇచ్చే కార్లలో ఒకటి. భారత మార్కెట్‌లో ప్రస్తుతానికి మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కేవలం రూ.5.78 లక్షల(ఎక్స్-షోరూమ్ ధర) స్టార్టింగ్ ప్రైస్‌తో దొరుకుతుంది.

అదే సమయంలో, ఈ కారు సీఎన్‌జీ (CNG) వేరియంట్లు ఒక కిలో సీఎన్‌జీకి 33.47 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయని మారుతి సుజుకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెప్పారు. కాబట్టి, తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కోసం చూసే వారికి మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఒక మంచి ఆప్షన్.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: టాటా పంచ్(Tata Punch), టాటా టియాగో(Tata Tiago) లాంటి కార్లకు మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఒక మంచి ఆప్షన్. అలాగే, మారుతి సుజుకి స్విఫ్ట్ కారుకు బదులుగా ఒక హ్యాచ్‌బ్యాక్ కారును ఆలోచించే కస్టమర్లకు కూడా మారుతి సుజుకి వ్యాగన్ఆర్(Maruti Suzuki Wagon R) సరిపోతుంది. వ్యాగన్ఆర్ తన ప్రత్యేకతలతో తిరిగి సేల్స్ పెంచుకుంటుందని ఆశిద్దాం.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, June 10, 2025, 9:37 [IST]
English summary
Affordable 34 km mileage car selling at low rates are they looking for customers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+