రెండు ఫ్యామిలీలకు సరిపడా లగేజీ తీసుకెళ్లొచ్చు..రూ.10 లక్షల లోపు ఎక్కువ బూట్ స్పేస్ ఉన్న కార్లు ఇవే

కొత్త కారు కొనేటప్పుడు చాలా మంది గమనించే విషయం బూట్ స్పేస్. అంటే కారు వెనుక భాగంలో సామాన్లు పెట్టుకునే స్థలం. కారు సైజు పెద్దగా ఉంటే బూట్ స్పేస్ కూడా పెద్దగా ఉంటుంది. కానీ, పెద్ద కార్ల ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే రూ.10 లక్షల లోపే ఎక్కువ బూట్ స్పేస్ ఉన్న కార్లు ఉన్నాయి. అటువంటి కొన్ని కార్ల గురించి ఈ వార్తలో తెలుసుకుందాం.

రేనాల్ట్ ట్రైబర్ (Renault Triber):
భారతదేశంలో తక్కువ ధరలో లభించే ఎంపీవీ కారు ఇది. ఇటీవల రేనాల్ట్ కంపెనీ అప్‌డేట్ చేసిన కొత్త ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ కారును విడుదల చేసింది. రూ.6.25 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న ఈ కారు సైజులో పెద్దగా ఉంటుంది. దీని బూట్ స్పేస్ ఏకంగా 625 లీటర్లు. ఎక్కువ సామాన్లు తీసుకెళ్లడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

Affordable Cars with Maximum Luggage Space Under Rs 10 Lakhs

మారుతి సుజుకి సియాజ్ (Maruti Suzuki Ciaz):
మారుతి సుజుకి నుంచి లభించే సెడాన్ కారులలో ఇది చాలా ఖరీదైనది. అయితే, ఈ కారు బూట్ స్పేస్ 510 లీటర్లు. దీని ప్రారంభ ధర రూ.9.3 లక్షలు. దీని ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ బూట్ స్పేస్ ఉండడం వల్ల చాలామంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.

Affordable Cars with Maximum Luggage Space Under Rs 10 Lakhs

హోండా అమేజ్ (Honda Amaze):
ఈ జాబితాలో మరో సెడాన్ కారు ఇది. హోండా నుంచి మార్కెట్‌లో బాగా అమ్ముడవుతున్న అమేజ్ కారులో 420 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.2 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Affordable Cars with Maximum Luggage Space Under Rs 10 Lakhs

టాటా టిగోర్ (Tata Tigor):
ఈ లిస్ట్‌లో ఇది మరో సెడాన్ కారు. టిగోర్ కారులో టార్క్ సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. దీని బూట్ స్పేస్ 419 లీటర్లు. టాటా మోటార్స్ నుంచి లభించే ఈ కాంపాక్ట్ సెడాన్ కారు ప్రారంభ ధర రూ.6.3 లక్షలు.

Affordable Cars with Maximum Luggage Space Under Rs 10 Lakhs

రేనాల్ట్ కైగర్ (Renault Kiger):
నిస్సాన్ మరియు రేనాల్ట్ కంపెనీలు కలిసి ఈ ఎస్​యూవీ కారును తయారు చేశాయి. ఈ కారులో 405 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Affordable Cars with Maximum Luggage Space Under Rs 10 Lakhs

హ్యుందాయ్ ఆరా (Hyundai Aura):
ఈ జాబితాలో మరొక సెడాన్ కారు హ్యుందాయ్ ఆరా. ఇది మార్కెట్‌లో అమేజ్ మరియు టిగోర్ కార్లకు పోటీగా ఉంటుంది. ఈ కారులో 402 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: ఈ జాబితాలో రేనాల్ట్ ట్రైబర్ బూట్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంది. ఇది ఎంపీవీ కారు కావడం దీనికి ప్రధాన కారణం. అయితే, ఈ జాబితాలో సెడాన్ కార్లు ఎక్కువగా ఉన్నాయి. తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ, సెడాన్ కార్ల వెనుక వైపు ఎక్కువ బూట్ స్పేస్ ఉంటుందని దీని ద్వారా తెలుసుకోవచ్చు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, August 22, 2025, 10:28 [IST]
English summary
Affordable cars with maximum luggage space under rs 10 lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+