లో బడ్జెట్లో ఫ్యామిలీ మొత్తం ప్రయాణించే కారు.. రెనాల్ట్ ట్రైబర్ కొత్తగా వచ్చేసింది.. డిజైన్, ఫీచర్లు ఇవే
భారత ఆటోమొబైల్ మార్కెట్లో 7 సీటర్ కార్లలో బాగా పేరున్న రెనాల్ట్ ట్రైబర్ ఇప్పుడు సరికొత్త మోడల్‌లో విడుదలైంది. ఫ్రెంచ్ కంపెనీ రెనాల్ట్ గ్రూప్ నుంచి వచ్చిన రెనాల్ట్ ఇండియా, ఈరోజు (జూలై 23, 2025) ఆల్-న్యూ రెనాల్ట్ ట్రైబర్‌ను లాంచ్ చేసింది.
ఈ కొత్త ట్రైబర్ దాని ప్రత్యేకమైన 7సీటర్ కెపాసిటీని, సీట్లను మార్చుకునే వెసులుబాటును అలాగే ఉంచుకుంటూనే డిజైన్, సౌకర్యాల విషయంలో ఎన్నో మార్పులతో వచ్చింది. ఇందులో 35కు పైగా కొత్త డిజైన్‌లు, ఫీచర్లు జోడించారు. ఇది ఒక కొత్త డ్రైవింగ్ ఎక్సపీరియన్స్ ఇస్తుంది.

డిజైన్ : కొత్త ట్రైబర్ ముందు భాగం పూర్తిగా మారిపోయింది. ఇందులో కొత్తగా పెద్దగా ఉండే గ్రిల్, కొత్త డిజైన్ చేసిన హుడ్, మారిన బంపర్, LED DRLS (డే టైమ్ రన్నింగ్ లైట్స్) తో కూడిన స్టైలిష్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త LED ఫాగ్ ల్యాంప్‌లు ఉన్నాయి.
కారు లోపల కూడా పెద్ద మార్పులు చేశారు. డాష్‌బోర్డ్ కొత్తగా డ్యూయల్-టోన్ రంగులో చాలా స్టైలిష్‌గా ఉంది. దీనికి 8-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే కలిపారు. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేలను సపోర్ట్ చేస్తుంది. లోపల కొత్త సీటు కవర్లు, లేటెస్ట్ LED ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED క్యాబిన్ లైటింగ్, ప్రీమియం లుక్ కోసం బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.

కారు వెనుక భాగంలో కూడా కొత్త డిజైన్ చేసిన బంపర్, కొత్త LED టెయిల్‌ల్యాంప్‌లు, కొత్త స్కిడ్ ప్లేట్, స్టైలిష్ టెయిల్‌ల్యాంప్ కనెక్టింగ్ పట్టీ ఉన్నాయి. ఇవన్నీ కారుకు ఒక లేటెస్ట్ లుక్ ఇస్తాయి.
ఫీచర్లు : ఈ కొత్త ట్రైబర్‌లో 35 కొత్త ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తూ అన్ని మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఇచ్చారు. ఇంకా ESP, TPMS, EBD విత్ బ్రేక్ అసిస్ట్ వంటి 21 బేసిక్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఈ విభాగంలో మొదటిసారిగా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ కూడా ఇందులో చేర్చారు.

ట్రైబర్ దాని రీథింక్ స్పేస్ ఆలోచనకు తగ్గట్టుగా, మూడవ వరుసలో ఈజీ-ఫిక్స్ సీట్లను అందిస్తుంది. వీటిని 5, 6 లేదా 7 సీటర్ కారుగా మార్చుకోవచ్చు. 5 సీట్ల మోడ్‌లో 625 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ లభిస్తుంది. ఇది కారును వివిధ అవసరాలకు అనుగుణంగా వాడుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.
ధర, వేరియంట్స్ : కొత్త ట్రైబర్ నాలుగు వేర్వేరు మోడళ్లలో వస్తుంది. అథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్. వీటి ధరలు రూ.6.29 లక్షల నుండి రూ.9.16 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటాయి. బుకింగ్‌లు ఈరోజు నుండి అన్ని షోరూమ్‌లలో మొదలయ్యాయి.

అథెంటిక్ వేరియంట్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో రూ.6,29,995 ధరకు లభిస్తుంది. ఎవల్యూషన్ వేరియంట్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో రూ.7,24,995 ధరతో వస్తుంది. టెక్నో వేరియంట్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌కు రూ.7,99,995 ఖర్చవుతుంది. టాప్-ఎండ్ ఎమోషన్ వేరియంట్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో రూ.8,64,995 ధరకు, ఈజీ-ఆర్ AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రూ.9,16,995 ధరకు లభిస్తుంది.
ఆల్-న్యూ ట్రైబర్ 6250 rpm వద్ద 72 PS పవర్, 3500 rpm వద్ద 96 Nm టార్క్‌ను అందిస్తుంది. అన్ని వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది. టాప్-ఎండ్ ఎమోషన్ వేరియంట్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అయిన ఈజీ-ఆర్ AMT కూడా ఉంది. ఇది సిటీ, హైవే మీద డ్రైవింగ్‌ను మరింత సులువు చేస్తుంది.

వారంటీ : కారుకు 3 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. దీనిని రెనాల్ట్ సెక్యూర్ ప్రోగ్రామ్ ద్వారా 7 సంవత్సరాల వరకు లేదా ఎన్ని కి.మీ.లైనా నడపడానికి పొడిగించుకోవచ్చు. ప్రభుత్వ అనుమతి పొందిన CNG కిట్లతో కూడా ట్రైబర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. దీనికి 3 సంవత్సరాల వారంటీ ఉంది.
రెనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లె మాట్లాడుతూ.. భారతదేశం రెనాల్ట్ వరల్డ్ వ్యూహంలో చాలా ముఖ్యమని అన్నారు. ఈ కొత్త ట్రైబర్, రెనాల్ట్ కొత్త లోగోతో వస్తున్న మొదటి మోడల్ అని, ఇది కంపెనీ మోడ్రన్ వేను సూచిస్తుందని తెలిపారు. భారతదేశంలో తయారైన ట్రైబర్ ఇప్పటికే 1.84 లక్షల మంది కస్టమర్లను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 12కు పైగా దేశాలకు ఎగుమతి అవుతోందని తెలిపారు.

ఇతర ఫీచర్లు : ఈ కొత్త మోడల్ 5 నుండి 7 సీట్లుగా మార్చుకోగలిగే ఈజీ ఫిక్స్ సీటింగ్‌తో వస్తుంది. ఇది కుటుంబ అవసరాలకు తగ్గట్టు సీటింగ్ స్పేస్‌ను సర్దుబాటు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. రెండవ వరుస సీట్లను స్లైడ్ చేయవచ్చు, వంచవచ్చు, ఫోల్డ్ చేయవచ్చు, దీనివల్ల లోపల స్థలాన్ని బట్టి 100కు పైగా సీటింగ్ కాంబినేషన్‌లు సాధ్యమవుతాయి.
ఐదు సీట్ల మోడ్‌లో, ఈ కారు 625లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను అందిస్తుంది. ఇది సుదూర ప్రయాణాలకు లేదా ఎక్కువ సామానుకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే, 182 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్, 23 లీటర్ల లోపలి స్టోరేజ్ స్థలం, 50 కిలోల వరకు బరువు మోయగల రూఫ్ రైల్స్ వంటివి దీనికి అదనపు బలాన్ని చేకూరుస్తాయి.రెండవ, మూడవ వరుసలకు ప్రత్యేక AC వెంట్లతో కూడిన ఇండిపెండెంట్ రియర్ AC ఉంటుంది.

ఈ కారుకు కొత్త ఫ్రంట్ గ్రిల్, హుడ్, బంపర్‌లు ఉన్నాయి. ఇవి కారుకు మరింత అట్రాక్టివ్ లుక్‌ను ఇస్తాయి. కొత్త ఫ్రంట్, రియర్ స్కిడ్ ప్లేట్‌లు కారుకు ధృఢత్వాన్ని అందిస్తాయి. 15 అంగుళాల డ్యూయల్ టోన్ ఫ్లెక్స్ వీల్స్, కొత్త సైడ్ డెకాల్స్ కారు అందాన్ని పెంచుతాయి. లైటింగ్ విషయంలో, కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు, LED టెయిల్‌ల్యాంప్‌లు, LED ఫాగ్ ల్యాంప్‌లు మంచివిజిబిలిటీని అందిస్తాయి.
రంగుల ఎంపికలో 3 కొత్త బాడీ రంగులు, 6 మోనోటోన్, 3 డ్యూయల్ టోన్ రంగులు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్‌లు తమ అభిరుచికి తగ్గట్టు ఎంపిక చేసుకోవచ్చు. లోపలి భాగంలో, కొత్త డాష్‌బోర్డ్, ఇంటీరియర్ ట్రిమ్, కొత్త సీటు ఫాబ్రిక్ ప్రీమియం అనుభూతిని ఇస్తాయి.
ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ కారులో అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఆటో హెడ్‌ల్యాంప్‌లు వెలుతురును బట్టి ఆటోమేటిక్గా ఆన్/ఆఫ్ అవుతాయి. 8 అంగుళాల డిస్‌ప్లే లింక్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఆధునిక ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. దీనికి వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంది. క్రూయిజ్ కంట్రోల్ సుదూర ప్రయాణాలను సులభతరం చేస్తుంది.
ఆటో ఫోల్డ్ ORVMలతో కూడిన వెల్‌కమ్ గుడ్‌బై సీక్వెన్స్ ఒక ప్రీమియం టచ్‌ను ఇస్తుంది. అలాగే, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు వర్షం పడినప్పుడు ఆటోమేటిక్గా పనిచేస్తాయి, డ్రైవర్‌కు మెరుగైన విజిబిలిటీని అందిస్తాయి. ఈ ఫీచర్లన్నీ కలిసి డ్రైవర్‌కు, ప్రయాణికులకు ఒక విలాసవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తాయి.


Click it and Unblock the Notifications








