కింగ్ ఈజ్ బ్యాక్.. ఆ రాజసం మళ్ళీ వచ్చేస్తుంది! కంప్లీట్ లగ్జరీ లుక్‌, హైటెక్ ఫీచర్స్‌‌తో అంబాసిడర్‌ రీఎంట్రీ!

భారతీయ మార్కెట్లో 90వ దశకంలో అంబాసిడర్ కార్ల హవా ఓ రేంజ్‌లో ఉండేది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, సినిమా స్టార్స్, ఇలా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఈ కార్లనే ఎక్కువగా వాడేవారు. ఈ కారుతో రోడ్లపై వెళ్తుంటే ఆ దర్జా వేరే లెవల్‌లో ఉండేది. ఒక ఇంట్లో అంబాసిడర్ (ambassador) ఉందంటే వారిని ధనవంతులు అనుకునేవారు. పాత కాలం సినిమాల్లో ఇది కచ్చితంగా కనిపిస్తుంది. అంబాసిడర్‌ను చాలా మంది తమ సోషల్ స్టేటస్‌ కోసం వాడుతుండేవారు. ఇది భారతీయ మార్కెట్లో ఒక ఐకానిక్ మోడల్. ఒకప్పుడు రోడ్లను ఏలిన కారు ఇప్పుడు చాలా వరకు కనిపించడం లేదు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చాలా అరుదుగా మోడిఫై చేయించుకుని వాడుతుంటారు. అప్పటి కాలం వారు కొంతమంది తమకు ఇష్టమైన కారును వదిలి పెట్టలేక తమ గ్యారేజీలో భద్రంగా ఉంచుకుని వీలున్నప్పుడు రోడ్లపై అలా షికారుకు వెళ్తుంటారు

హిందుస్థాన్‌ మోటార్స్‌ కంపెనీ తయారు చేసిన ఈ అంబాసిడర్‌ కార్ల ఉత్పత్తి 1957లో ప్రారంభమైంది. ఆ కాలంలో ఇది ఒక సంచలన మోడల్. ఆ తర్వాత పలు కారణాల వలన ఉత్పత్తిని 2014లో నిలిపివేశారు. అప్పటికే మార్కెట్లోకి కొత్త మోడళ్లు అందుబాటులోకి రావడం మారుతున్న కాలానికి అనుగుణంగా కస్టమర్ల ఇష్టాలు కూడా మారిపోవడం, ఇతర కంపెనీల నుంచి విడుదలయ్యే లేటెస్ట్ కార్లపై ఆసక్తి చూపించడం కారణంగా అంబాసిడర్‌‌కు ఆదరణ తగ్గిపోయింది.

New Ambassador In India

అయినప్పటికి భారతదేశంలో అంబాసిడర్‌ అంటే ఎదో తెలియని ప్రత్యేకమైన అభిమానం ఇప్పటికి ఉంది. అంబాసిడర్ కారు దాదాపు 57 సంవత్సరాలుగా అమ్మకానికి ఉంది. దీన్ని కొత్తగా అప్‌డేసి ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్పులు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తారని అంబాసిడర్ అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కొత్త అంబాసిడర్ విడుదలపై సోషల్‌మీడియాలో కూడా చర్చలు జరిగాయి. అయితే ఈ కారు ఇప్పటివరకు అయితే విడుదల కాలేదు.

ఇదిలా ఉంటే తాజాగా అంబాసిడర్ త్వరలో తిరిగి అమ్మకానికి వస్తుందని ప్రస్తుత నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అంబాసిడర్ బ్రాండ్ పేరును వాడుకునే హక్కులన్ని కూడా PSA గ్రూప్‌ ఆద్వర్యంలో ఉన్నాయి. ఫ్రెంచ్ కార్ల కంపెనీ అయిన దీని కింద చాలా కంపెనీలు ఉన్నాయి. సిట్రోయెన్ వంటి కంపెనీలన్నీ కూడా PSA గ్రూప్ కిందకు వస్తాయి. ఇటీవల అంబాసిడర్‌ను తిరిగి విక్రయానికి తీసుకురావాలని ఈ గ్రూప్ ఆలోచన చేస్తుంది.

Ambassador May Return To India Next Year The Expected Price Rs 10 Lakh

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. త్వరలో ఇది టాప్ ప్లేస్‌కు కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇంత డిమండ్ ఉన్న దేశీయ మార్కెట్లో ఒకప్పుడు రోడ్లను శాసించిన అంబాసిడర్‌ను కొత్తగా మార్చి విడుదల చేయడం ద్వారా దాని గత సెంటిమెంట్ ఇప్పుడు కూడా పనిచేసి మంచి ఆదరణ సంపాదిస్తుందని PSA గ్రూప్ భావిస్తుంది. అందుకే ఈ కారును తిరిగి లాంచ్ చేయాలని చూస్తుంది.

నివేదికల ప్రకారం, కొత్త అంబాసిడర్ కారును వచ్చే ఏడాది అంటే 2026 మార్చి నెలలో భారతీయ మార్కెట్లో తిరిగి అమ్మకానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే సమాచారం ప్రకారం, ఈ ప్రసిద్ధ కస్టమర్లు కొనగలిగే విధంగా రూ.10 లక్షల ప్రారంభ ధరతో లభించవచ్చని తెలుస్తుంది.

Ambassador Relaunch In India

ఈ కారు రాకతో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఇతర కంపెనీలకు బలమైన పోటీ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్య విషయం ఏమిటంటే ఈ కారును తీసుకురావడానికి దాదాపు ఏడాది పడుతుందని తెలుస్తుంది. అయితే ఇంత తక్కువ టైంలో విడుదల కావడం కష్టం, ఏది ఏమైనప్పటికి కంపెనీ నుంచి అధికారికంగా సమాచారం వచ్చే వరకు మాత్రం ఇంకా వేచి ఉండాలి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 5, 2025, 12:42 [IST]
English summary
Ambassador may return to india next year the expected price rs 10 lakh more details
Read more on: #auto news #india #ambassador
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+