కేవలం రూ.6లక్షలకే ఎస్యూవీ కారు.. ఒక చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్.. అసలు ఈ కారు ఎందుకు కొనాలంటే ?
మారుతున్న కాలానికి తగ్గట్టు కార్ల కంపెనీలు సరికొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. కానీ ధర మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చూస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ భారీగా పెరిగింది. ఈ సెగ్మెంట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తున్న కార్లలో రెనాల్ట్ కైగర్ (Renault Kiger) ఒకటి.
కేవలం ఆరు లక్షల ప్రారంభ ధరతో ఎస్‌యూవీ కారును సొంతం చేసుకోవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తాజాగా, ఈ కారు సేల్స్‌లో కొంత తగ్గుదల కనిపించింది. అయితే, దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రెనాల్ట్ కైగర్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

భారత మార్కెట్‌లో సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో బాగా అమ్ముడవుతున్న కార్లలో రెనాల్ట్ కైగర్ ఒకటి. కానీ 2025 జులై నెలలో దీని అమ్మకాలు భారీగా తగ్గాయి. జూన్ నెలలో 755 యూనిట్లు అమ్ముడవగా, జులైలో కేవలం 323 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే దాదాపు 57.22% అమ్మకాలు పడిపోయాయి.
అయితే, దీనికి కారణం జూలై నెలలో అమ్మకాలు జూన్ తో పోలిస్తే భారీగా పడిపోవడానికి కారణం, రెనాల్ట్ కంపెనీ కొత్త అప్‌డేటెడ్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఆగస్టు 24న మార్కెట్‌లోకి తీసుకురావడమే. కొత్త మోడల్ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లు కొనుగోలును వాయిదా వేసుకోవడంతో ఈ అమ్మకాలు పడిపోయినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కొత్త రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కొన్ని ముఖ్యమైన డిజైన్ మార్పులు, అదనపు ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. ఈ కొత్త మోడల్‌లో సరికొత్త బంపర్స్, అప్‌డేటెడ్ అల్లాయ్ వీల్స్, కొత్త లైటింగ్ సిస్టమ్, ఇంకా సరికొత్త గ్రిల్ తో కొత్త రెనాల్ట్ లోగో ఉండే అవకాశం ఉంది. లోపలి భాగంలో కొత్త డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్, అప్‌డేటెడ్ అప్‌హోల్స్టరీ, ఇంకా కొత్త స్టీరింగ్ వీల్‌తో కారు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
అలాగే, 360-డిగ్రీ కెమెరా, ఆటో క్లైమెట్ కంట్రోల్, ఇంకా సురక్షితమైన ప్రయాణానికి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా అందించే అవకాశం ఉంది. ఈ అదనపు ఫీచర్ల వల్ల కొత్త కైగర్ ధర రూ. 6.50 లక్షల నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రెనాల్ట్ కైగర్ మోడల్‌లో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కూడా అవే ఇంజిన్లను కొనసాగించే అవకాశం ఉంది.

1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్...ఇది 72 పీఎస్ పవర్, 96 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ ఇంజిన్ మ్యాన్యువల్ వేరియంట్‌లో 20.18 kmpl, ఏఎంటీ వేరియంట్‌లో 19.83 kmpl మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్.. ఈ ఇంజిన్ 100 పీఎస్ పవర్, 160 ఎన్ఎమ్ టార్క్ (మ్యాన్యువల్) మరియు 152 ఎన్ఎమ్ టార్క్ (సీవీటీ) ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్, ఇంకా ఎక్స్-ట్రానిక్ సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, మ్యాన్యువల్ వేరియంట్‌లో 20.5 kmpl, సీవీటీ వేరియంట్‌లో 17.63 kmpl మైలేజ్ లభిస్తుంది. రెనాల్ట్ కైగర్ కారు 40 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో పాటు, సీఎన్‌జీ కిట్ ఆప్షన్ కూడా లభిస్తుంది.
ప్రస్తుతం భారత మార్కెట్‌లో రెనాల్ట్ కైగర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 6.15 లక్షలు మాత్రమే. టాప్ వేరియంట్ ధర రూ. 11.23 లక్షలు. ఆన్-రోడ్ ధర విషయానికొస్తే, హైదరాబాద్‌లో కైగర్ ధర రూ. 7.31 లక్షల నుంచి రూ. 13.74 లక్షల మధ్య ఉంటుంది. ఈ ధరలు వేరియంట్‌ను, డీలర్‌ను బట్టి మారవచ్చు.


Click it and Unblock the Notifications








