పవర్‌ఫుల్ ఇంజిన్, సూపర్ స్పీడ్.. ఆడి A4 లోపల అద్భుతాలు.. అందుకే శ్రీమంతులు పడి చచ్చిపోతారు

లగ్జరీ కార్లంటే మీకు ఇష్టమా.. అవి అంటే పడి చచ్చిపోతాయారా అయితే, మీకోసం ఆడి ఒక కొత్త అదిరిపోయే కారును తీసుకొచ్చింది. అదే ఆడి A4 సిగ్నేచర్ ఎడిషన్. ఇది కేవలం ఒక కారు కాదు. ఇది ఒక స్టేటస్ సింబల్.

ఈ కారులో వైర్‌లెస్ ఛార్జింగ్, లగ్జరీ క్యాబిన్, మెమరీ సీట్లు, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, కీ లేకుండానే బూట్ డోర్ తెరవడం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారు ప్రీమియం సెగ్మెంట్‌లో దుమ్ము రేపుతోంది.

Audi A4

ఆడి A4 సిగ్నేచర్ ఎడిషన్ కారులో మీ స్మార్ట్‌ఫోన్ కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ ఉండే ఆడి ఫోన్ బాక్స్ ఉంది. అలాగే, ప్రీమియం లెదర్‌రెట్ క్యాబిన్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్‌డ్ డ్రైవర్ సీట్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి అందించారు.

అంతేకాకుండా, 30 రంగుల యాంబియెంట్ లైటింగ్ ప్యాకేజ్ ప్లస్ తో ఇంటీరియర్‌కు అదిరిపోయే లుక్ ఇచ్చారు. కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారు ప్రస్తుతం ప్రీమియం విభాగంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Audi

"ఆడి A4 మా సిరీస్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్‌లలో ఒకటి. ఇప్పుడు సిగ్నేచర్ ఎడిషన్ విడుదల చేయడంతో మా కస్టమర్లకు మరింత ప్రత్యేకమైన వేరియంట్‌ను అందిస్తున్నాము" అని కొత్త A4 సిగ్నేచర్ ఎడిషన్ విడుదల గురించి ఆడి ఇండియా హెడ్ బల్‌బీర్ సింగ్ ధిల్లాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ప్రముఖ కారు తయారీ సంస్థ ఆడి తన 'A4 సిగ్నేచర్ ఎడిషన్'ను భారతదేశంలో రూ.57,11,000 (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఆడి A4 సిగ్నేచర్ ఎడిషన్ అనేది ఒక స్పెషల్ ఎడిషన్ కారు కాబట్టి, కొన్ని యూనిట్లను మాత్రమే విక్రయిస్తారు. ఇతర ఆడి కార్ల కంటే భిన్నంగా, స్పెషాలిటీ కోరుకునే కస్టమర్ల కోసం ఈ కొత్త సిగ్నేచర్ ఎడిషన్‌ను డిజైన్ చేశారు.

Audi A4

ఈ కారు నవర్రా బ్లూ మెటాలిక్, ప్రోగ్రెసివ్ రెడ్ మెటాలిక్, గ్లేసియర్ వైట్ మెటాలిక్, మిథోస్ బ్లాక్ మెటాలిక్, మన్‌హాటన్ గ్రే మెటాలిక్ అనే ఐదు ఎట్రాక్టివ్ బాడీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో ఆకర్షణీయమైన ఆడి రింగ్స్, డైనమిక్ వీల్ హబ్ క్యాప్స్, ఎంట్రీ ఎల్‌ఈడీ ల్యాంప్‌లు వంటి అనేక డిజైన్ అంశాలు ఉన్నాయి.

అంతేకాకుండా ఇందులో డైనమిక్ వీల్ హబ్ క్యాప్స్, ఏరోడైనమిక్ స్పాయిలర్ లిప్, కస్టమైజబుల్ కీ కవర్, 360-డిగ్రీ కెమెరా & పార్క్ అసిస్ట్, ఆడి రింగ్స్ ఎంట్రీ ఎల్‌ఈడీ ల్యాంప్‌లు, ప్రత్యేకమైన ఆడి రింగ్స్ డెకాల్స్, స్టెయిన్‌లెస్ స్టీల్ పెడల్ కవర్స్, స్పెషల్ అలాయ్ వీల్ పెయింట్ డిజైన్, 3-స్పోక్, ఫ్లాట్-బాటమ్, స్పోర్ట్స్ కాంటూర్ లెదర్‌తో కూడిన మల్టీ-ఫంక్షన్ ప్లస్ స్టీరింగ్ వీల్ ఉంది. ఇది డ్రైవర్‌కు మంచి పట్టును, కంట్రోల్ అందిస్తుంది.

D B&O ప్రీమియం సౌండ్ సిస్టమ్(Bang & Olufsen Premium Sound System) ఉంది. ఇది సెంటర్ స్పీకర్, సబ్ ఊఫర్‌తో సహా 19 స్పీకర్‌లు, 16-ఛానెల్ యాంప్లిఫైయర్, 755 వాట్స్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. కారు లోపల థియేటర్లో ఉన్న అనుభూతిని ఇస్తుంది.

ఆడి A4 2.0L TFSI ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 204 hp పవర్, 320 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని 12V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ఇంధన వినియోగాన్ని తగ్గించి, మైలేజ్‌ను పెంచుతుంది. కేవలం 7.1 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని చేరుకోగల కెపాసిటీని కలిగి ఉంది. గంటకు 241 కి.మీ టాప్ స్పీడ్ తో దూసుకుపోతుంది.

ఇందులో ఉన్న టెక్నాలజీని పరిశీలిస్తే.. ఆడి స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్, న్యాచురల్ లాంగ్వేజ్ వాయిస్ కంట్రోల్, 25.65 సెం.మీ (10.1 అంగుళాలు) కొలత గల హై-రెజల్యూషన్ టీఎఫ్‌టీ (TFT) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆల్-డిజిటల్ ఆడి వర్చువల్ కాక్‌పిట్ ప్లస్ (Audi Virtual Cockpit Plus) తో వస్తుంది. ఇది డ్రైవర్‌కు అవసరమైన అన్ని సమాచారాన్ని డిజిటల్ రూపంలో చూపిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: ఆడి A4 సిగ్నేచర్ ఎడిషన్, దాని లగ్జరీ ఫీచర్‌లు, పవర్ ఫుల్ ఇంజిన్, లేటెస్ట్ టెక్నాలజీతో నిజంగా ప్రీమియం కార్ల విభాగంలో ఒక బెంచ్ మార్క్. ప్రత్యేకతను కోరుకునే వారికి, లగ్జరీకి పెద్ద పీట వేసే వారికి ఇది ఒక మంచి ఆప్షన్.

More from DriveSpark

Article Published On: Friday, June 13, 2025, 17:50 [IST]
English summary
Audi a4 signature edition why rich people are falling for it
Read more on: #audi #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+