ఒక్క చుక్క పెట్రోల్ లేకుండా 110 కి.మీలు ప్రయాణించవచ్చు! ఈ కారు కోసం చాలా కాలంగా వెయిటింగ్!
ఆటోమొబైల్ పరిశ్రమలో హైబ్రిడ్ వాహనాల ట్రెండ్ వేగంగా పెరుగుతుంది. ఎక్కువ కార్ల తయారీదారులు హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలను (PHEV) తీసుకొస్తున్నారు. ఇప్పుడు, లగ్జరీ కార్ల తయారీదారు ప్రముఖ కంపెనీ ఆడి (audi) కూడా తన కొత్త మోడల్ A5 మోడల్‌తో ఈ విభాగంలోకి అడుగు పెడుతుంది. తాజాగా ఈ కారును కొత్త PHEV పవర్‌ట్రెయిన్‌తో అప్‌డేట్ చేసింది. దాంతో ఇది ఎలక్ట్రిక్ మోటారు ద్వారా 110 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఇది రోజువారీ ప్రయాణాలకు పెట్రోల్ వినియోగాన్ని తగ్గించే అవకాశాన్ని కల్పిస్తుంది. బ్యాటరీ, పెట్రోల్ రెండింటి ద్వారా ప్రయాణించడం వల్ల కారు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అవుతుంది.
కొత్త PHEV శక్తివంతమైన టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్‌తో కలిసి పని చేస్తుంది. దీంతో అధిక మైలేజ్‌తో పాటు మెరుగైన పవర్ డెలివరీని అందిస్తుంది. A5 E-హైబ్రిడ్ 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 252 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 142 hp శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటారుతో కూడా పనిచేస్తుంది. ఇవి 450 Nm టార్క్‌తో 300 hp పవర్ ఉత్పత్తి చేస్తుంది.

అలాగే, 500 Nm టార్క్‌తో 367 hp పవర్ విడుదల చేసింది. ఇది 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఆడి తన తాజా A5 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) మోడల్‌లో సరికొత్త బ్యాటరీ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఇది మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందించడంతో పాటు, వేగంగా ఛార్జ్ అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బ్యాటరీ ప్యాక్ 25.9 kWh సామర్థ్యం కలిగి ఉంటుంది.
దీన్ని పూర్తిగా ఛార్జింగ్ చేసినట్లయితే 110 కి.మీల దూరం వరకు హాయిగా ప్రయాణించవచ్చు. ఇది 11 kW వరకు AC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అంటే, బ్యాటరీని 0 నుంచి 100 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ చేసుకోవడానికి కేవలం 2.5 గంటలు మాత్రమే పడుతుంది. ఇది వినియోగదారులకు సమయాన్ని ఆదా చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్‌లో వెనుక భాగంలో కొత్త హై-వోల్టేజ్ బ్యాటరీ ఉంది.

బ్యాటరీ ఆప్షన్ ద్వారా రోజువారీ ప్రయాణాలకు పెట్రోల్ అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. ఆడి A5 E-హైబ్రిడ్ కొత్త మోడల్‌లో EV, హైబ్రిడ్ మోడ్ అనే రెండు డ్రైవ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ మోడ్‌ల ద్వారా డ్రైవర్ డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా పవర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈవీ మోడ్‌లో కారు 100% బ్యాటరీ పవర్‌పై నడుస్తుంది. హైబ్రిడ్ మోడ్‌లో భవిష్యత్ అవసరాల కోసం బ్యాటరీ శక్తిని ఆటోమేటిక్‌గా మేనేజ్ చేస్తుంది.
ఆడి A5 E-హైబ్రిడ్ లోపల అధునాతన టెక్నాలజీతో కూడిన అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. డ్రైవింగ్ అనుభవాన్ని మరింత డిజిటలైజ్ చేయడానికి 11.9-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. అలాగే, 14.5-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, ఇతర లేటెస్ట్ ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఆడి కారులో స్టీరింగ్ వీల్‌లోని బటన్ షిఫ్టర్‌లను ఉపయోగించి సర్దుబాటు చేయగల రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది.

A5 E-హైబ్రిడ్ కారు మార్కెట్‌లో మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది. ఎందుకంటే, ఇది 110 కి.మీ దూరాన్ని ఒక్క చుక్క పెట్రోల్ లేకుండానే ప్రయాణించగలదు. అంటే, నగర ప్రయాణాల్లో పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లోనే వెళ్లి, అవసరమైనప్పుడు గ్యాసోలిన్‌కు మారే లాభం ఇందులో ఉంటుంది. ఈ కొత్త హైబ్రిడ్ మోడల్ ద్వారా మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఆడి మార్కెట్లో తన అమ్మకాలతో దూసుకుపోయే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








