7.1 సెకన్లలో 0-100 కిమీలు.. అదరగొట్టే ఫీచర్లతో ఆడి A4 సిగ్నేచర్ ఎడిషన్ వచ్చేసింది

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి (Audi), భారతీయ మార్కెట్లో తన ప్రీమియం పోర్ట్‌ఫోలియోను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఒక ప్రత్యేకమైన ఎడిషన్‌ను తీసుకొచ్చింది. అదే ఆడి A4 సిగ్నేచర్ ఎడిషన్ (Audi A4 Signature Edition). లగ్జరీను ప్రేమించే, అలాగే తమ స్టైలును ప్రత్యేకంగా చూపించుకోవాలనుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. A4 సిగ్నేచర్ ఎడిషన్‌లో లభించే డిజైన్ అప్‌డేట్లు ఈ కారుకు ఒక ప్రత్యేకమైన మెరిసే రూపాన్ని ఇస్తాయి. ప్రత్యేకంగా రూపొందించిన ఆడి కలర్స్ ఈ కారుకు మరింత స్పోర్టీ లుక్‌ను అందిస్తాయి. ఈ ప్రత్యేక ఎడిషన్ ధర రూ.57,11,000 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతోంది.

ప్రీమియం వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ ప్రత్యేక ఎడిషన్, తన డిజైన్, పనితీరు, సాంకేతికతతో ప్రత్యేకమైన డ్రైవింగ్ అనుభూతిని అందించేందుకు సిద్ధంగా ఉంది. సిగ్నేచర్ ఎడిషన్‌లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన డిజైన్ అంశాలు దాని లగ్జరీ ఆకర్షణను మరింతగా పెంచుతున్నాయి. స్టైలిష్ LED ఎంట్రీ ల్యాంపులు, డైనమిక్ వీల్ హబ్ క్యాప్స్, ప్రత్యేకంగా హైలైట్ చేసే ఆడి రింగ్స్ వంటి ఫీచర్లు ఓ ప్రత్యేకమైన ప్రీమియం ఐడెంటిటీని అందిస్తాయి.

Audi New Car A4 Signature Edition

దీని ఇంజిన్ పనితీరు విషయానికి వస్తే, 2.0 లీటర్ TFSI టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 204 హార్స్ పవర్ (150 కిలోవాట్లు) శక్తిని, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు రయ్ మంటూ దూసుకుపోతుంది. కేవలం 7.1 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ/గం వేగానికి చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 241 కి.మీ/గం వేగం చేరుకోగలదు.

ఫ్యూయల్ సమర్థతను మరింత మెరుగుపర్చేందుకు, ఈ కారులో 12V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కూడా జత చేశారు. ఆడి A4 సిగ్నేచర్ ఎడిషన్‌కు మరింత ప్రత్యేకతను అందిస్తూ, ఈ కారు పరిమిత యూనిట్లలో మాత్రమే అందుబాటులోకి వస్తోంది. ఈ స్పెషల్ ఎడిషన్ కలర్ ఆప్షన్లలో గ్లేసియర్ వైట్ మెటాలిక్, మిథోస్ బ్లాక్ మెటాలిక్, ప్రోగ్రెసివ్ రెడ్ మెటాలిక్, నవర్రా బ్లూ మెటాలిక్, మాన్‌హట్టన్ గ్రే మెటాలిక్‌లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది.

ఆడి A4 సిగ్నేచర్ ప్రత్యేక ఎడిషన్‌లో అందించబడిన ఫీచర్లు కేవలం అందాన్ని మాత్రమే కాదు, వినియోగదారుని అనుభవాన్ని కూడా గణనీయంగా మెరుగుపరుస్తాయి. పార్కింగ్ మరింత సులభతరం చేయడానికి, కారులో 360 డిగ్రీ కెమెరాతో కూడిన పార్క్ అసిస్ట్ వ్యవస్థ అందుబాటులో ఉంది. డ్రైవర్ కారు చుట్టూ ఉన్న ఎన్‌విరాన్‌మెంట్‌ను పూర్తిగా చూసి, సురక్షితంగా పార్క్ చేయగలుగుతారు. ఆడి రింగ్స్ ఎంట్రీ LED ల్యాంప్స్ ఆకట్టుకుంటాయి.

ఎక్స్‌టీరియర్‌లో డైనమిక్ వీల్ హబ్ క్యాప్స్, ఏరోడైనమిక్ స్పాయిలర్ లిప్ వంటి డిజైన్ అంశాలు కారుకు మరింత స్పోర్టీ రూపాన్ని ఇస్తాయి. అంతేకాదు, స్టెయిన్‌లెస్ స్టీల్ పెడల్ కవర్లు, అల్లాయ్ వీల్ ప్రత్యేక పెయింట్ డిజైన్ వంటి వివరాలు చిన్నవిగా అనిపించినా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్టు స్పష్టంగా చెబుతాయి. ఇంటీరియర్‌లో కంఫర్ట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, పవర్డ్ డ్రైవర్ మెమరీ సీటు, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఈ కారులో ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Tuesday, June 10, 2025, 11:00 [IST]
English summary
Audi new car a4 signature edition launched in india price design engine and all details check here
Read more on: #audi #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+