మార్కెట్లోకి ఆడి కొత్త కారు.. కాఫీ మేకర్‌తో పాటు, మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్‌తో దుమ్ములేపనుంది!
జర్మన్ లగ్జరీ కార్ల బ్రాండ్ కంపెనీ ఆడి (audi), ప్రీమియం మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరిచే దిశగా మరో అడుగు వేసింది. ఆటోమొబైల్ పరిశ్రమలో పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి ఈ నెల ప్రారంభంలో Q4 సిగ్నేచర్ ఎడిషన్‌ను తీసుకురాగా, ఇప్పుడు ఆడి Q7 సిగ్నేచర్ ఎడిషన్ (Audi Q7 Signature Edition)ను విడుదల చేసింది. సిగ్నేచర్ సిరీస్‌లో భాగంగా తాజాగా ఆవిష్కరించిన ఈ మోడల్, రూ. 99.81 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను కంపెనీ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ కారులో అనేక కొత్త ఫీచర్స్, అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఆడి జెన్యూన్ యాక్సెసరీస్ ఆధారంగా రూపొందించిన అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు ఈ సిగ్నేచర్ ఎడిషన్‌ను మరింత స్పెషల్ చేస్తాయి.
డిజైన్‌లో ఆకట్టుకునే లగ్జరీ, లోపల ఫినిషింగ్‌లో ఫైనెస్ట్ డీటెయిలింగ్, అన్నింటిలోనూ ఎక్కడా తగ్గకుండా పరిపూర్ణంగా కనిపిస్తుంది. దీని ఇంజిన్ పనితీరు విషయానికి వస్తే, ఇందులో అమర్చిన 3.0 లీటర్ V6 పెట్రోల్ టర్బోచార్జ్డ్ ఇంజిన్, గరిష్ఠంగా 340 bhp పవర్, 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది టెక్నికల్‌గా మరింత సమర్థవంతంగా పని చేయడానికి 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో జత చేయబడింది.

ఈ ఇంజిన్‌కు ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు పంపించేందుకు క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉపయోగించబడుతోంది. ఇది కేవలం లగ్జరీకి పరిమితం కాకుండా, అద్భుతమైన డ్రైవింగ్ డైనమిక్స్ కూడా అందిస్తుందని స్పష్టంగా చెబుతోంది. ఆడి Q7 సిగ్నేచర్ ఎడిషన్ ప్రత్యేకత కేవలం దాని శక్తివంతమైన ఇంజిన్‌లో మాత్రమే కాదు, ప్రత్యేకమైన డిజైన్, లగ్జరీ టచ్ అన్నింటిలోనూ ప్రతిబింబిస్తుంది.
ఈ ఎడిషన్‌లో ఆడి లోగో నాలుగు-రింగుల వెల్కమ్ LED ల్యాంపులు ఆకట్టుకుంటాయి. కారు చుట్టూ డైనమిక్ వీల్ హబ్ క్యాప్స్ వేగంగా తిరిగే సమయంలో కూడా ఆడి లోగోను స్థిరంగా చూపించేవిగా రూపొందించబడ్డాయి. అంతేకాదు, డ్రైవర్ అనుభూతిని మరింత రిఫైన్ చేయడంలో స్టెయిన్‌లెస్ స్టీల్ పెడల్ క్యాప్స్ కూడా సహకరిస్తాయి. అల్లాయ్ వీల్స్ డిజైన్ మారకపోయినా, వాటికి అందించబడిన కొత్త పెయింట్ ఫినిష్ మోడల్‌కి ఒక కొత్త లుక్‌ను అందిస్తోంది.

మెటాలిక్ కీ కవర్ వంటివి కూడా ఈ ఎడిషన్‌లో భాగంగా ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది ఫోల్డబుల్ మూడవ వరుసతో కూడిన 7-సీటర్ లేఅవుట్‌ను కలిగి ఉంది. ఈ వరుస ఎలక్ట్రానికల్‌గా ఆకట్టుకుంటుంది. ఉపయోగంలో ఉన్నవారికి అధిక సౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాగే సెన్సార్ ఆధారిత బూట్ లిడ్ వలన, చేతులు బిజీగా ఉన్నప్పుడు కేవలం కదలికతోనే డెక్కును తెరవడం సాధ్యమవుతుంది .
ఈ సిగ్నేచర్ ఎడిషన్, టెక్నాలజీ ట్రిమ్ ఆధారంగా రూపొందించబడింది. దీనికి అదనంగా జోడించబడిన రెండు స్పెషల్ ఫీచర్లు ఈ కారును మరింత ప్రత్యేకంగా మారుస్తున్నాయి. మొదటిది, ఇన్-కార్ ఎస్ప్రెస్సో మొబైల్ సిస్టమ్, అంటే ప్రయాణంలోనూ మీకో కాఫీ బ్రేక్ ఇచ్చే ఆడి ప్రత్యేకత. రెండవది, యూనివర్సల్ ట్రాఫిక్ రికార్డర్‌తో కూడిన డాష్‌క్యామ్. ఇది భద్రతా పరంగా, ట్రావెల్ లాగ్ పరంగా ఎంతో ఉపయోగకరం.

ఈ కారు కేవలం 5.6 సెకన్లలో సున్నా నుండి 100 కి.మీ.కు వేగాన్ని చేరుకుంటుంది. టాప్ స్పీడ్ గంటకు 250 కి.మీ. లోపల డ్యూయల్ టచ్‌స్క్రీన్ MMI నావిగేషన్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, పార్క్ అసిస్టెంట్ ప్లస్, 360-డిగ్రీ కెమెరా, సేఫ్టీ కోసం 8 ఎయిర్‌బ్యాగులు, లేన్ డిపార్చర్ హెచ్చరిక, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ESC) వంటి అత్యుత్తన సేఫ్టీ ప్రమాణాలు దీనిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








