ఎప్పటినుంచో కలలు కంటున్నారా ఆడి కారు కొనాలని? స్పెషల్ ఎడిషన్ కేవలం రూ.52 లక్షల నుంచి!
ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్‌లో తనదైన గుర్తింపు కలిగిన జర్మన్ ఆటోమొబైల్ బ్రాండ్ ఆడి (Audi) ఇటీవల భారతీయ కార్ల మార్కెట్లో కొత్త హైప్‌ను సృష్టించింది. స్టైల్, కంఫర్ట్, టెక్నాలజీ అన్నీ కలగలిసి ఉండే SUV లుక్స్‌కి పేరుగాంచిన ఆడి, ఇప్పుడు Q3, Q5 మోడళ్లలో కొత్త Signature ఎడిషన్‌లు విడుదల చేసి మరింత దృష్టిని ఆకర్షిస్తోంది. ఆడి ఈ సిగ్నేచర్ వేరియంట్‌లను డిజైన్ చేసే సమయంలో ప్రత్యేకమైన స్టైలింగ్, మరింత ప్రీమియమ్ ఫీల్, లిమిటెడ్ ఎడిషన్ టచ్‌ను ఇవ్వడంపై ఎక్కువగా దృష్టిపెట్టింది. ఫలితంగా, సాధారణ Q3, Q5 మోడళ్ల కంటే ఈ సిగ్నేచర్ ఎడిషన్‌లు రోడ్డుపై ప్రత్యేకంగా కనిపించేలా తీర్చిదిద్దబడ్డాయి.
కొత్త Audi Q3 Signature రెండు బాడీ స్టైల్‌లలో స్టాండర్డ్, స్పోర్ట్‌బ్యాక్‌లో అందుబాటులో ఉంది. స్పోర్టీ అటెన్షన్, అద్భుతమైన LED లైటింగ్, బాడీ లైన్లలో వచ్చే ఖచ్చితమైన డిజైన్ వివరాలు SUVకి మరింత గ్లామర్‌ను అందిస్తున్నాయి. ధర విషయానికి వస్తే, స్టాండర్డ్ వేరియంట్ రూ.52.31 లక్షలు, స్పోర్ట్‌బ్యాక్ వేరియంట్ రూ. 53.55 లక్షలు(ఎక్స్-షోరూమ్). పెద్ద, పవర్‌ఫుల్ Q5 మోడల్ కూడా తన Signature Editionతో మరింత ప్రీమియం టచ్‌ను అందిస్తోంది.

మెరుగైన ఇంటీరియర్ క్వాలిటీ, అధునాతన టెక్నాలజీ, ఆడి SUVల కు ప్రత్యేకమైన డైనమిక్ డ్రైవింగ్ అనుభవం ఇవన్నీ కలిసి ఈ మోడల్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపాయి. ఈ కొత్త Q5 Signature Edition ధర రూ. 69.86 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ మూడు సిగ్నేచర్ ఎడిషన్ కార్లు లిమిటెడ్ నంబర్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే ఇవి సాధారణ మోడళ్లలా ఎక్కువకాలం అందుబాటులో ఉండవు.
ప్రత్యేకత కోరుకునే, లిమిటెడ్ ఎడిషన్ వాహనాలు ఇష్టపడే కస్టమర్ల కోసం ఇవి పర్ఫెక్ట్ ఎంపిక. బుకింగ్స్ విషయానికి వస్తే, ఆసక్తి ఉన్న కస్టమర్లు తమ సమీపంలోని ఆడి డీలర్‌ను సంప్రదించవచ్చునో, లేదా Audi India అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ఈ సిగ్నేచర్ ఎడిషన్ మోడళ్లు కేవలం కార్లు మాత్రమే కాదు.. స్టైల్, లగ్జరీ, ఆడి బ్రాండ్‌కు పేరు తెచ్చిన ప్రెస్టీజియస్ ఎక్స్‌పీరియన్స్‌కి ప్రతీక అని చెప్పాలి.

ఆడి Q3, Q3 Sportbackలో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ అమర్చబడి, 190 hp పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. శక్తివంతమైన ఈ ఇంజిన్ వల్ల డ్రైవర్‌కు ఎప్పుడు కావాలంటే అప్పుడు రోడ్డుపై స్పందనను అందించేలా ఉంటుంది. ఇదే సమయంలో, పెద్ద, మరింత ప్రీమియం SUV అయిన Audi Q5 సిగ్నేచర్ ఎడిషన్ తన 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో 249 hp పవర్, 370 Nm టార్క్‌ను అందిస్తుంది.
Q3 సిగ్నేచర్ ఎడిషన్ బాహ్య డిజైన్‌లో గేట్ ఓపెన్ చేసిన వెంటనే నేలపై మెరిసే ఆడి లోగో అబ్బురపరుస్తుంది. అలాగే కారు కదులుతున్నప్పటికీ ఆడి 4-రింగ్ లోగో స్థిరంగా కనిపించే డైనమీక్ వీల్ క్యాప్స్ ప్రీమియం క్లాస్‌ను తెస్తాయి. కారు లోపలి భాగంలోనూ ఆడి సిగ్నేచర్ లగ్జరీ స్పర్శ స్పష్టంగా కనిపిస్తుంది. శుభ్రమైన, సూక్ష్మమైన ఫినిషింగ్‌తో డ్యాష్‌బోర్డ్ నుంచి డోర్ వరకు ప్రతీ ఎలిమెంట్ నాణ్యతను ప్రతిబింబిస్తుంది.

ఇదే సమయంలో Q5 సిగ్నేచర్ ఎడిషన్ కూడా మరింత ప్రీమియం లుక్‌ను కలిగిస్తుంది. ఇది Graphite Grey రంగు హై-గ్లోస్ ఫినిష్‌తో 19-అంగుళాల 5 ట్విన్ ఆర్మ్ అల్లాయ్ వీల్స్‌ను పొందింది. ఈ ప్రత్యేక వీల్స్, పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ SUVకు శక్తివంతమైన, రాయల్ లుక్‌ను అందిస్తాయి. ఆడి ఈ సిగ్నేచర్ ఎడిషన్‌లను స్టైల్, కంఫర్ట్, ప్రెజెన్స్ పరంగా మరింత లెవల్‌కు తీసుకెళ్తున్నట్లు స్పష్టమవుతుంది.


Click it and Unblock the Notifications








