మార్కెట్లోకి ఆడి కొత్త కారు.. ఇది మీ వద్దకు రావాలంటే 6 నెలలు ఆగాల్సిందే.. దీనికి అంత డిమాండ్ ఎందుకో!
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి (Audi) ఇండియా మార్కెట్లో మంచి ఆదరణ కలిగిన సంస్థ. చాలా కాలంగా అధునాతన ఫీచర్స్‌ను కలిగిన మోడళ్లను విడుదల చేస్తుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా కస్టమర్లను ఆకట్టుకునే కార్లను లాంచ్ చేయడంలో ఆడి ఇండియా బాగా ప్రసిద్ధి చెందిన సంస్థ. కంపెనీ తాజాగా ఇప్పుడు సరికొత్త లగ్జరీ కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ పేరు 'ఆడి ఆర్‌ఎస్ క్యూ8 పెర్ఫార్మెన్స్(audi rs q8 performance)'. ఈ కారుకు భారతీయ మార్కెట్లో భారీ డిమాండ్ నెలకొంది. దీన్ని ఇప్పటికే చాలా మంది బుకింగ్ చేసుకున్నారు. కస్టమర్లు ఈ ఆడి కారును తమ చేతుల్లోకి తీసుకోవాలంటే దాదాపు 6 నెలల సమయం వరకు వేచి ఉండాల్సి ఉంది. దీనికి కారణం రాబోయే 6 నెలల కాలానికి సంబంధించిన బుకింగ్స్ అన్ని పూర్తయ్యాయి.
కొత్త ఆడి rs q8 పెర్ఫార్మెన్స్ ధర విషయానికి వస్తే రూ.2.49 కోట్లుగా ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంది. దీని డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంది. ముందు ప్రత్యేక బంపర్ సెటప్‌ను అమర్చారు. దీనికి రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, RS ఎగ్జాస్ట్ పైపును కూడా అందించారు. 23-అంగుళాల 6 Y ట్విన్-స్పోక్ అల్లాయ్ వీల్స్ కారుకు ఎక్స్‌టీరియర్ అందాన్ని పెంచడంలో కీలకంగా ఉన్నాయి.

దీని ఇంజిన్ విషయానికి వస్తే, 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 640 bhp పవర్, 850 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సెటప్‌ను జోడించారు. ఇదిఆడి క్వాట్రో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో వచ్చింది. వేగంలో కూడా సాటిలేనిది. స్టార్ట్ చేసిన కేవలం 3.5 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ./గం. వేగాన్ని చేరుకుంటుంది.
audi rs q8 performance టాప్ స్పీడ్ గంటకు 305 కి.మీలు. ముఖ్యవిషయం ఏమిటంటే, ఈ కారు 2024 లో నిర్వహించిన టెస్ట్ రన్‌లో కేవలం 7.3 సెకన్లలొనే ఒక ల్యాప్‌ను పూర్తి చేయడం గమనార్హం. దీని బాడీ కఠినంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. లోపల క్యాబిన్‌లో చాలా అధునాతన సదుపాయాటు ఉన్నాయి. 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటిని కలిగి ఉంది.

వైర్‌లెస్ ఛార్జింగ్, 12.3-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్, ఆటో AC, లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్,లెదర్ అప్హోల్స్టరీ స్పోర్ట్ సీట్లు, డోర్ ప్యానెల్‌లపై మైక్రోఫైబర్ మెటీరియల్, డ్రైవింగ్‌లో గేర్లను మార్చడానికి డ్రైవర్లకు సహయకరంగా ఉండటానికి రెడ్ కలర్ అలర్ట్, ప్రయాణంలో ఉన్నప్పుడు హయిగా పాటలు వినడానికి 23-స్పీకర్ బ్యాంగ్ అండ్ ఓలుఫ్సెన్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటివి ఈ ఆడి కారులో ఉన్నాయి.
ప్రమాద సమయంలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా కూడా ఈ ఆడి కారు అత్యున్నత ప్రమాణాలను కలిగి ఉంది. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, చుట్టు చూడటానికి 360-డిగ్రీ కెమెరా, రాత్రి సమయంలో కూడా మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి నైట్ విజన్ అసిస్టెన్స్‌తో సహా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), యాక్టివ్ రోల్ స్టెబిలైజేషన్ వంటివి ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








