BYD Sealion 7: ‘లయన్'ను దింపిన బీవైడీ సంస్థ.. ఈ కారు ఫీచర్లు కేకో కేకస్య కేకోభ్యహ!

న్యూదిల్లీ వేదికగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 జోరుగా హుషారుగా సాగుతోంది. స్టార్టప్‌ల నుంచి మొదలుకుని దిగ్గజ వాహన తయారీ సంస్థలు ఇందులో తమ కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఎక్స్‌పోలో చైనాకు చెందిన దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ బీవైడీ ఇండియా.. భారత్‌లో తమ బ్రాండ్ నుంచి రానున్న ఓ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేసి 'వావ్' అనిపించింది. సీలయన్ 7 పేరుతో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఈ సంస్థ లాంఛ్ చేసింది. ఈ కారు బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కారు డెలివరీలు మార్చి నుంచి ప్రారంభించనుంది బీవైడీ సంస్థ. ఈ కారు పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం

ఈ కొత్త బీవైడీ సీలయన్ 7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. Coupe-like రూఫ్‌తో ఉంటుంది. ఈ కారులో డిజైన్ ఎలిమెంట్స్‌లో వినూత్నత కనిపిస్తోంది. ఈ కారు LED డేటైమ్ రన్నింగ్ లైట్స్(DRL)తో కూడిన స్వెప్ట్ బ్యాక్ LED headlightsతో ఉంటుంది. ఈ బీవైడీ ఎస్‌యూవీ మోడల్‌ను కొనుగోలు చేయాలంటే వినియోగదారులు రూ.70,000 తో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Auto Expo 2025 BYD Sealion 7

బ్లాక్ క్లాడింగ్‌తో కూడిన వీల్ ఆర్చెస్‌తో ఈ కారు ఉంటుంది. అదే సమయంలో... ఈ బీవైడీ సీలయన్ 7 కారు... వెనుకవైపు స్లీక్ LED లైట్ బార్ ఉంటుంది. డ్యూయల్ - టోన్ రియర్ బంపర్, wraparound LED టెయిల్ లైట్స్‌తో రూఫ్ స్పాయిలర్ ఉంటుంది. వివిధ కలర్ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులోకి రానుంది.

ఇక ఈ కారు కేబిన్ విషయానికి వస్తే.. ఇందులో ఫ్లాట్- బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. 10.25 అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్స్టుమెంట్ క్లస్టర్, ఇతర బీవైడీ కార్లలో ఉన్నట్లుగా ఇందులో కూడా 15.6 అంగుళాల రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం ఉంటుంది.

BYD Sealion 7 Bookings

ఈ బీవైడీ సీలయన్ 7 ఎలక్ట్రిక్ కారులో ఉండే ఇతర కీ ఫీచర్లను పరిశీలిస్తే.. ఈ కారు హీటింగ్, వెంటిలేషన్‌తో కూడిన పనోరమిక్ సన్ రూఫ్‌తో ఉంటుంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్- జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 12- స్పీకర్ ఆడియో సిస్టం, హెడ్- అప్ డిస్‌ప్లే, ADAS సూట్ వంటివి కూడా ఉంటాయి.

ఈ ఈవీ.. RWD, AWD కన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. వివిధ రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ఇది లభిస్తోంది. RWD మోడల్ కారు.. 82.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. ఇది 308 bhp పవర్, 380 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 482 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

BYD Sealion 7 Features

ఇందులోని AWD మోడల్.. 91.3 kWh బ్యాటరీ ప్యాక్ తో అందుబాటులో ఉంది. ఇది 523 bhp పవర్, 690 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఏడబ్ల్యూడీ మోడల్ 502 కిలోమీటర్ల రేంజ్ అందివ్వగలదు. ఫిబ్రవరి 17న ఈ కారు ధర వెల్లడించనుంది ఈ సంస్థ.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, January 18, 2025, 17:44 [IST]
English summary
Auto expo 2025 byd sealion 7 launched check bookings and features details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+