Auto expo 2025: మహా కుంభమేళ మాదిరిగా ఆటో ఎక్స్‌పో 2025కు భారీగా వచ్చిన జనం.. ఏకంగా 9 లక్షల మంది

ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మారుమోగేలా, భారతీయులు గర్వపడేలా దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో ఎగ్జిబిషన్ ఈవెంట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 తాజాగా ముగిసింది. జనవరి 17 నుంచి మొదలైన ఈ ఈవెంట్ 22 వ తేదీ వరకు విజయవంతంగా జరిగింది. దేశ ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈవెంట్‌లో దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందిన వాహన తయారీదారులు తమ మోడళ్లను ఆవిష్కరించారు. ఆరు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ఈ ఆటో ఎక్స్‌పో‌లో భారీ ఎత్తున సందర్శకులు వాహనాలను చూడటానికి వచ్చారు. దాదాపు 9 లక్షల మంది వరకు ఈ కార్యక్రమానికి వచ్చినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ రంగంలో తాజాగా జరిగిన భారత ఎగ్జిబిషన్ వాహన ప్రియుల చేత గొప్ప ప్రసంశలు అందుకుంటుంది.

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆటో పరిశ్రమలో రాబోతున్న సరికొత్త డిజైన్లను, వినూత్న ఆలోచనలను రూపొందించిన మోడళ్లను ప్రదర్శించారు. అంతకుముందులా కాకుండా ఈసారి ఆటో ఎక్స్‌పో, ఆటో కాంపోనెంట్ షోలను వేర్వేరుగా కాకుండా ఒకే పైకప్పు క్రింద నిర్వహించారు. స్టీల్ ఇన్నోవేషన్, ఆటో ఎక్స్‌పో, బ్యాటరీ షో, టైర్ షో, మొబిలిటీ టెక్, ఇండియా సైకిల్ షో అన్ని కూడా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో కింద ఉన్నాయి.

Auto Expo 2025 9 Lakh Visitors Over New Vehicle Launches

ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని ఇండియా ఎక్స్‌పో సెంటర్, భారత్ మండపం, గ్రేటర్ నోయిడాలోని ఎక్స్‌పో మార్ట్, ద్వారకలోని యశోదభూమి ప్రధాన వేదికలుగా ఉన్నాయి. బ్యాటరీ షో, ఆటో ఎక్స్‌పో, ఇండియా సైకిల్ షో, టైర్ షో, స్టీల్ ఇన్నోవేషన్‌లను భారత మండపంలో నిర్వహించారు. అదే ద్వారకలోని యశోభూమిలో జనవరి 18 నుండి జనవరి 21 వరకు ఆటో ఎక్స్‌పో కాంపోనెంట్ షో నిర్వహించారు.

అలాగే, గ్రేటర్ నోయిడా ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో 19 నుండి 22 వరకు భారత్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ షో, అర్బన్ మొబిలిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షోని నిర్వహించారు. అట్టహసంగా ఢిల్లీ వేదికగా జరిగిన అతిపెద్ద ఆటో ఎగ్జిబిషన్‌లో అనేక కొత్త వాహనాలు లాంచ్ అయ్యాయి. వీటిలో ఇప్పుడు కొన్ని విడుదల కాగా, మరికొన్ని భవిష్యత్తు కాన్సెప్ట్ మోడళ్లుగా ప్రదర్శించబడ్డాయి. ఫోర్ వీలర్స్, టూవీలర్స్, వాణిజ్య వాహనాలు ఈవెంట్‌లో సందడి చేశాయి.

Auto Expo 2025

సాంప్రదాయ పెట్రోల్, డీజిల్, cng వాహనాలతో పాటు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను కూడా పలు కంపెనీలు ఆవిష్కరించాయి. సమాచారం ప్రకారం, 200 కంటే ఎక్కువ కొత్త వాహనాలు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో లాంచ్ అయ్యాయి. పలు విభాగాల్లో 19 ప్రధాన ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్ వాహనాలను ఆవిష్కరించారు. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌లో టాటా, మారుతీ, బీఎండబ్ల్యూ, హ్యుందాయ్ వంటి పలు కంపెనీలు లాంచ్‌లు చేశాయి.

Mercedes-Maybach EQS 680 నైట్ సిరీస్, BMW iX1, BMW X3,క్రెటా ఎలక్ట్రిక్, Porsche Macan EV,Taycan ఫేస్‌లిఫ్ట్, మినీ కూపర్ S JCW ప్యాక్ వంటి కీలక లాంచ్‌లు జరిగాయి. అలాగే, టూ-వీలర్ సెగ్మెంట్‌లో హోండా యాక్టివా e, హీరో Xpulse 210,Zoom 125, Zoom 160,Extreme 250R, Suzuki Access, Gixxer SF 250 Flex Fuel,30 BMW S 1000 RR వంటివి లాంచ్ అయ్యాయి.

Auto Expo 2025 Concludes

2025 ఆటో ఎక్స్‌పో కార్యక్రమం ఈ సారి ఎంతో ఘనంగా ముగిసింది. కొత్త లాంచ్‌లు, ఆవిష్కరణతో ఈ ఆరు రోజులు కూడా ఆద్యంతం ఢిల్లీ మొత్తం కూడా సందడి వాతావరణంలో మునిగిపోయింది. మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించడం, విదేశీ కంపెనీల కొత్త లాంచ్‌లు వాటితో ఆటో ఎక్స్‌పో అట్టహసంగా జరిగింది.

More from DriveSpark

Article Published On: Thursday, January 23, 2025, 15:13 [IST]
English summary
Auto expo 2025 concludes 9 lakh visitors 1500 exhibitors over 200 new vehicle launches
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+