Auto Expo 2025 Kia: అనంతపురం నుంచి కియా కొత్త కారు ఆట ఆరంభం.. ఇప్పటికే 10 వేలకు పైగా బుకింగ్స్‌ సొంతం!

ఆటో ఎక్స్‌పో 2025లో కియా ఇండియా కొత్త సబ్-4 మీటర్‌ ఎస్‌యూవీ కియా సైరోస్‌ (Kia Syros in Auto Expo 2025)ని ప్రదర్శించింది. ఈ సైరోస్‌ తొలి యూనిట్‌ అనంతపురంలో ఆవిష్కరించారు. ఇది పూర్తిగా ఈ ప్లాంట్‌లోనే ఉత్పత్తి అయ్యింది. ఈ మొట్టమొదటి యూనిట్‌ ఆటో ఎక్స్‌పో 2025లో ఆకట్టుకోనుంది. డిసెంబర్‌లో తొలిసారిగా ఈ కారును ఆవిష్కరించి బుకింగ్స్ ప్రారంభించింది. ఎవ్వరూ ఊహించిని విధంగా ఈ కారుకి ఫుల్‌ రెస్పాన్స్‌ వచ్చింది. విడుదలకు ముందే రికార్డు స్థాయిలో 10,258 ప్రీ-లాంచ్ బుకింగ్స్‌ని రాబట్టింది. ఈ కియా కొత్త సైరస్ ధరలను ఫిబ్రవరి 1 న కంపెనీ వెల్లడించనుంది.

అయితే ఈ కొత్త కియా సైరస్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ .9.7 లక్షల నుంచి రూ .16.50 లక్షల మధ్య ఉండనుంది. ఈ కియా సైరస్‌కి ప్రత్యక్ష పోటీ లేనప్పటికీ మార్కెట్‌లోని హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, కియా సోనెట్, మారుతి గ్రాండ్ విటారా వంటి ఇతర సబ్-4మీటర్‌ సెగ్మెంట్‌ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Auto Expo 2025 Kia Syros Showcased Check Deliveries and Price Announcement Details here

దీని బాక్సీ డిజైన్‌ ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్ల వల్ల భారీ మొత్తంలో బుకింగ్స్‌ వచ్చాయి. ఈ సైరస్ ఎస్‌యూవీ ఫీచర్లలో ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం రెండు 12.3-అంగుళాల స్క్రీన్లు ఉన్నాయి. వీటితో పాటు 5 ఇంచెస్‌ క్లైమేట్ కంట్రోల్ డిస్ ప్లే, ముందు, వెనుక వెంటిలేటెడ్ సీట్లు, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటివి ఉన్నాయి.

ఇక ఇందులోని ప్రయాణీకులకు సైతం మంచి సేఫ్టీ లభించనుంది. ఇందులో ప్రయాణీకుల భద్రత కోసం 6 స్టాండర్డ్‌ ఎయిర్‌బ్యాగ్స్‌ , 360 డిగ్రీల కెమెరా, డ్యూయల్-డాష్ క్యామ్ సెటప్, లెవల్ 2 అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటివి ఉన్నాయి. వీటితో పాటు టాప్‌ వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్, 4-వే పవర్డ్ డ్రైవర్ సీటు, డ్యూయల్-టోన్ క్యాబిన్ కలర్ థీమ్ వంటివి ఇందులో ఉండనున్నాయి.

Auto Expo 2025 Kia Syros Showcased Check Deliveries and Price Announcement Details here

ఈ కారు రెండు పవర్ట్రెయిన్‌ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఇందులో 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 120 ps పవర్‌ని, 172 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ AMT, 7-స్పీడ్ DCT గేర్ బాక్స్ ఆప్షన్‌తో జతచేయబడి ఉంటుంది. మరో 1.5-లీటర్ డీజల్ ఇంజిన్ 116 ps పవర్‌, 250 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ AMT, 6-స్పీడ్ AT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఈ కారుకి సంబంధించిన మైలేజీ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. దీంతోపాటు కియా అప్‌డేటెడ్‌ ఈవీ6 ని (Updated Kia EV6) సైతం కియా మోటార్స్‌ ఈ భారత్‌ మొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో లాంచ్‌ చేయనుంది. ఇది కంప్లీట్‌ బిల్డ్‌ యూనిట్‌గా భారత్‌లో అడుగుపెట్టనుంది. ఇందులో అధునాతన ఫీచర్లు భారీ రేంజ్‌ అందిచేలా బ్యాటరీ ప్యాక్స్‌ ఉండనున్నాయి. ఈ కార్ల విడుదలతో మార్కెట్‌లో మంచి గ్రిప్‌ పెంచుకునేందుకు కియా యత్నిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, January 17, 2025, 11:30 [IST]
English summary
Auto expo 2025 kia syros showcased and 1st unit roll out from anantapur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+