అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో 7- సీటర్ SUV మార్కెట్‌లోకి తెస్తున్న స్కోడా.. ఇక మార్కెట్ లెక్కలు మారుతాయి పక్కా!
దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ స్కోడా.. భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో క్రమక్రమంగా ఎదుగుతోంది. తమ వాహనాలతో వినియోగదారుల నుంచి మన్ననలు అందుకుంటోంది. ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ సంస్థ కొత్త వాహనాలను పరిచయం చేసి ఆకట్టుకుంది. అందులో తమ పాపులర్ ఎస్‌యూవీ అయిన కొడియాక్‌కు సెకండ్ జనరేషన్ మోడల్‌ను కూడా ఉంది. దీన్ని MQB EVO ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్ మీద తయారు చేసింది. ఆధునాతన టెక్నాలజీతో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు జోడించి తీసుకువచ్చింది. ఈ కారు డిజైన్, ఇంజిన్, సేఫ్టీ తదితర పూర్తి వివరాలతో దీనికి మాార్కెట్లో పోటీగా ఉన్న కార్లేంటో చూసేద్దాం.
డిజైన్: ఈ కొత్త స్కోడా కొడియాక్ ఎస్‌యూవీ.. ఇంతకుముందు ఉన్న మోడల్స్ కంటే పెద్దగా ఉంటుంది. ఇది స్కోడా 'Modern Solid' డిజైన్ ఫిలాసఫీతో ఉంటుంది. ఈ ఎస్‌యూవీ 7- సీటర్‌తో వస్తుంది. దీని ఉన్న పొడవు కారణంగా ఈ కారులో స్పేస్ మునపటి కంటే మరింత ఎక్కువగా ఉంటుంది.

ఈ కొడియాక్ ఎస్‌యూవీని రీఫ్రెష్‌డ్ ప్రంట్ ఫేసియాతో తీసుకువచ్చారు. దీంట్లో స్ప్లిట్ LED హెడ్ ల్యాంప్ సెటప్, వర్టికల్ స్లాట్స్‌తో కూడిన పెద్దసైజు గ్రిల్ ఉంటాయి. ఈ కారు అలాయ్ వీల్స్, పనోరమిక్ సన్ రూఫ్‌తో ఉంటుంది. దీని వెనుక వైపున రీస్టైల్డ్ LED టెయిల్ ల్యాంప్ క్లస్టర్, బంపర్ ఉంటుంది.
ఫీచర్లు: ఈ కొత్త కొడియాక్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. దీంట్లో డిజిటల్ ఇన్స్టుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జింగ్, యాంబియెంట్ లైటింగ్ ఉంటాయి. అంతేకాకుండా దీంట్లో 13- అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. ఇందులో మరికొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందించే అవకాశం ఉంది.

ఈ కొత్త మోడల్‌లో సేఫ్టీ ఫీచర్లకు కూడా కొదవేం లేదని చెప్పాలి. ఇది లెవెల్ 2 ADAS టెక్నాలజీతో వస్తుంది. దీంట్లో 6 ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా ఉంటాయి. ఈ కారు టాప్ వేరియంట్లో ఫుల్లీ లోడెడ్ ADAS ఫీచర్లు ఉంటాయి. అన్నీ వేరియంట్లలో కూడా స్టాండర్డ్‌గా 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి.
ఇంజిన్: ఈ కారు 2.0 లీటర్ ఫోర్- సిలిండర్ టర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 187 bhp పవర్, 320 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7- స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జోడించి ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో ఆల్- వీల్ డ్రైవ్ సిస్టం స్టాండర్డ్‌గా ఉంటుంది. ఇది మెరుగైన ఫర్ఫామెన్స్‌ని అందించనుంది.

ప్రత్యర్థి కార్లు: ఈ 2025 స్కోడా కొడియాక్ ఎస్‌యూవీ... ఇప్పటికే మార్కెట్లో ఉన్న టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గోల్‌స్టర్, హ్యూందాయ్ టుక్సాన్స్ ఫోక్స్ వేగన్ టయ్‌గన్, జీప్ మెరిడియన్ ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుందని చెప్పవచ్చు. ప్రీమియం ఫీచర్లతో 7 సీటర్ ఎస్‌యూవీని కొనాలనేవారికి ఈ స్కోడా కొడియాక్ కొత్త మోడల్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








