వింటేజ్ డిజైన్‌కు మోడ్రన్ టచ్ ఇస్తూ టాటా కొత్త కారు.. తొంభైల నాటి రోజుల్ని గుర్తుకు తెచ్చేలా!

దిల్లీలో శుక్రవారం ప్రారంభమైన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పో వైభవంగా సాగుతోంది. అనేక వాహన తయారీ సంస్థలు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్.. ఈ ఈవెంట్‌లో తమ వాహనాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సంస్థ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్(ICE)తో ఉండే సియెర్రా ఎస్‌యూవీని ఈ ఎక్స్‌పో‌లో ఆవిష్కరించింది. నోస్టాలిజిక్ డిజైన్‌ని గుర్తు చేస్తూ.. మోడర్న్ డిజైన్‌ను మేళవించి, ఈ ఎస్‌యూవీని ప్రదర్శించింది. 90వ దశకంలో.. భారతీయ వినియోగదారులను ఆకట్టుకున్న సియెర్రాను మళ్ళీ గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ కారు వీక్షకులను కట్టిపడేస్తోంది. ఈ కారు విశేషాలేంటో తెలుసుకుందాం.

డిజైన్, స్టైలింగ్: 1990 ల నాటి సియెర్రా మోడల్‌ను తలపించేలా సియెర్రా ఐసీఈ వాహనం ఇది. ఆనాటి ఐకానిక్ షేప్‌ను కొనసాగిస్తూ.. alpine విండోస్‌తో దీన్ని తీసుకువచ్చారు. ఇందులో టాటా ఎస్‌యూవీలైన హరియర్, సఫారి వంటి వాటిల్లో కనిపించే మోడర్న్ స్టైలింగ్ అంశాలు కూడా ఉన్నాయి. మందు భాగాన మెయిన్ హెడ్‌లైట్స్‌తో కనెక్టెడ్ LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs) బంపర్‌లో అమర్చి ఉన్నాయి.

Auto expo 2025 Tata sierra

వెనుకవైపు LED టెయిల్ ల్యాంప్స్ దీనికి స్లీక్ లుక్ అందిస్తున్నాయి. ఇంటీరియర్, లోపలి పీచర్లు:టాటా సియెర్రా కారు.. ట్రిపుల్- స్క్రీన్ డ్యాష్ బోర్డ్ సెటప్, టాటా లోగోతో ఉన్న 4- స్పోక్ స్టీరింగ్ వీల్‌తో ఉంటుంది. వినియోగదారులు దీన్ని 4, 5 సీట్ల కన్ఫిగరేషన్లలో ఎంచుకోవచ్చు. టాటా యునిక్ స్టైల్‌ను కొనసాగిస్తూనే.. ప్రస్తుత ట్రెండ్ ఫాలో అవుతూ ఈ కారును తీసుకువచ్చినట్లు ఈ ఫీచర్లతో తెలుస్తోంది.

అడ్వాన్స్‌డ్ ఫీచర్లు: ఈ సియెర్రా కారు 12.3 అంగుళాల స్క్రీన్, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, హై- క్వాలిటీ సౌండ్ సిస్టం వంటి ప్రీమియం ఫీచర్లతో ఉంటుంది. సేఫ్టీ విషయంలో కూడా ఈ కారు తీసిపోలేదు. ఇందులో 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. దాంతో పాటు 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ESC), అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS) వంటివి ఉంటాయి.

Auto expo 2025 Tata sierra ice showcased

ఇంజిన్ ఆప్షన్లు: ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది. ఒకటి 1.5 లీటర్ 4- సిలిండర్ టర్బోల్ పెట్రో ఇంజిన్. ఇది 170PS పవర్ 280Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది‌ 6- స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7- స్పీడ్ డ్యూయల్- క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ తో ఉంటుంది.

మరొకటి 2.0 లీటర్ 4- సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 170PS పవర్, 350Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6- స్పీడ్ మ్యాన్యువల్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జోడించి ఉంటుందని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.

Tata sierra ice showcased Auto expo

దీని ధర ఎంత ఉంటుందంటే: టాటా సియెర్రా ఐసీఈ కారు ప్రారంభ ధర రూ.15 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. మహీంద్రా స్కార్పియో- ఎన్, హ్యూందాయ్ క్రెటా వంటి కార్లకు ఇది పోటీగా ఉండనుంది. రెట్రో స్టైలింగ్‌తో మోడర్న్ ఫీచర్లతో ఉండే వాహనాలను కొనేవారిని ఈ కారు ఎక్కువగా ఆకర్షిస్తుందనే చెప్పవచ్చు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, January 18, 2025, 12:42 [IST]
English summary
Auto expo 2025 tata sierra ice unveiled with modern features check details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+