Budget 2025: ఈవీ పరిశ్రమకు అత్యంత కీలకమైన బడ్జెట్.. ఆశలన్నీ నిర్మలా సీతారామన్ పైనే!
ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమతో పోలిస్తే భారత్‌లో వృద్దికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో లేని సానుకూలత కారణంగా దిగ్గజ వాహన తయారీ దారులు తమ పెట్టుబడులు, తమ వ్యాపారాన్ని విస్తరించడానికి భారత్ అత్యంత అనువైన దేశంగా ఎంచుకుని ఇక్కడ తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా గతంతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం అంచనాలకు భిన్నంగా అనుకున్నదాని కంటే మరింత ఎక్కువగా పెరిగింది. భారతీయ వినియోగదారులు సాంప్రదాయ పెట్రోల్, డీజిల్, cng వాహనాలతో పాటే ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కూడా ఎక్కువగా ఆదరిస్తున్నారు. వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈవీలను ప్రోత్సహించడానికి పెట్టుబడిదారులకు మద్దతుగా పలు రాయితీలను కూడా అందిస్తుంది. దీంతో తయారీదారులు కూడా ప్రభుత్వం ఆశయం మేరకు పోటీ పడుతూ మరి అధునాతన ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఛార్జింగ్ అనేది ప్రధాన సమస్యగా ఉండగా, దానిని కూడా కంపెనీలు ప్రభుత్వ సహకారంగా అధిగమిస్తున్నాయి. ప్రస్తుతం ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో పలు రంగాలకు బడ్జెట్ భారీ ఎత్తున కేటాయింపులు ఉండే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమ కేంద్ర బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కొత్త ప్రోత్సహకాలు, రాయితీలు ఉంటాయని పరిశ్రమ వర్గాల వారు భావిస్తున్నారు.

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ వాహన పరిశ్రమ బడ్జెట్‌పై ఎన్నో ఆశలను పెట్టుకుంది. ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధికి, పన్ను రాయితీలు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ప్రోత్సాహకాలు, తోడ్పాటు వంటివి ఉంటాయని పరిశ్రమ ప్రతినిధులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గత బడ్జెట్‌లలో ఈవీలకు ఎక్కువగా కేటాయింపులు ఉండగా, ఈ సారి ఇంకా ఎక్కువ ఉంటాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈవీ పరిశ్రమ పలు సవాళ్లను ఎదుర్కొంటుంది. స్థానికంగా తయారీని పెంచడానికి అవసరమయ్యే అధిక ఇన్‌పుట్ ఖర్చులు, సరఫరా గొలుసు అంతరాయాలు కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కొంత ప్రభావానికి గురవుతుంది. ఇలాంటి సవాళ్లను అధిగమించాలంటే ఈ కేంద్ర బడ్జెట్‌లో ఈవీలకు సంబంధించి ప్రత్యేక కేటాయింపులు ఉండాల్సిందే. భవిష్యత్తు అంతా కూడా ఈవీలదే కాబట్టి ఈ పరిశ్రమ వృద్దికి కేంద్ర సహకారం అత్యంత కీలకం.

ఎలక్ట్రిక్ వాహన రంగానికి ఊతమిచ్చే విధంగా ఇన్నోవేషన్, వృద్ధి, సుస్థిరత, మెరుగైన బ్యాటరీల అభివృద్ది వంటి వాటికి ఈ కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధుల అవసరం ఉంది. ప్రపంచంలో భారత్‌లో ఉన్న సానుకూలతల కారణంగా ఇక్కడికి అంతర్జాతీయ కంపెనీలు కూడా తరలివచ్చి ఈవీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి. అయితే దీనికి రాయితీలు ఇవ్వాల్సి ఉంది.
స్థానిక తయారీకి ఊతమిచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు బడ్జెట్‌లో నిధులను కేటాయించడంతో పాటు ప్రజల్లో ఈవీల ఆవశ్యకత తెలిసేలా, కొనుగోళ్ల విషయంలో రాయితీలు అందించే విధంగా పలు పథకాలు ఈ బడ్జెట్‌లో ఉంటాయని పరిశ్రమ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. సప్లై చెయిన్‌లో అంతరాయాలు, ముడి సరుకు ధరలు వంటి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








