బ్రెజా, నెక్సన్, సోనెట్.. ఇవేవీ ఈ కారు ముందు పనికి రావు.. త్వరలోనే అదిరిపోయే లుక్‌తో వస్తున్న బేబీ క్రెటా
సబ్-4 మీటర్ SUV సెగ్మెంట్‌లో ఒకప్పుడు మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూల మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. ఆ తర్వాత టాటా నెక్సన్, కియా సోనెట్ వంటి మోడల్స్ రావడంతో పోటీ మరింత పెరిగింది. అయితే ఇప్పుడు, హ్యుందాయ్ వెన్యూ తన పాత డిజైన్‌ను పక్కన పెట్టి సరికొత్త రూపంలో మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది.
కొత్త వెర్షన్ హ్యుందాయ్ వెన్యూ అక్టోబర్ 24, 2025న అధికారికంగా విడుదల కానుంది. దీని రాకతో మళ్ళీ ఈ సెగ్మెంట్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. కొత్త హ్యుందాయ్ వెన్యూ డిజైన్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, దీని డిజైన్ హ్యుందాయ్ క్రెటాను పోలి ఉంటుంది.

అందుకే దీనిని చాలామంది 'బేబీ క్రెటా' అని పిలుస్తున్నారు. కొత్త వెన్యూ ముందు భాగంలో క్రెటాలో ఉన్నట్లుగానే కనెక్టెడ్ LED DRLలతో కూడిన క్వాడ్-LED హెడ్‌ల్యాంప్ సెటప్ ఉండొచ్చు. ఇంకా, ముందు గ్రిల్ కూడా కొత్తగా, మరింత ఆకర్షణీయంగా ఉండనుంది.
డిజైన్‌లోనే కాకుండా, ఇంటీరియర్, ఫీచర్ల విషయంలోనూ కొత్త వెన్యూ అదరగొట్టనుంది. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉండొచ్చు. ఇవి ఈ సెగ్మెంట్‌లో ఈ కారుకు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తాయి. కొత్త వెన్యూ ఇంటీరియర్ డిజైన్ కూడా క్రెటా, అల్కాజార్ కార్లను పోలి ఉండే అవకాశం ఉంది. ఈ మార్పుల వల్ల క్యాబిన్ మరింత ప్రీమియం లుక్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది.

హ్యుందాయ్ ఇప్పుడు సేఫ్టీకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. కొత్త వెన్యూలో లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ప్యాకేజీ లభించే అవకాశం ఉంది. దీనితో పాటు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు, నాలుగు డిస్క్ బ్రేక్‌లు వంటి ఎక్స్ ట్రా సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండొచ్చని సమాచారం. ఈ ఫీచర్లు కారు నడిపే వారికి మరింత భద్రత, సౌకర్యాన్ని అందిస్తాయి.
కొత్త వెన్యూలో ప్రస్తుతం ఉన్న ఇంజిన్ ఆప్షన్లే కొనసాగే అవకాశం ఉంది. అవి 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. మ్యానువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం వెన్యూ ఎక్స్‌షోరూమ్ ధర రూ.7.94 లక్షల నుంచి రూ.13.82 లక్షల వరకు ఉంది.

అయితే, కొత్త మోడల్‌లో అదనపు ఫీచర్లు, డిజైన్ మార్పుల వల్ల ధర రూ.30,000 నుంచి రూ.60,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ కొత్త వెన్యూ రాకతో మారుతి బ్రెజా, టాటా నెక్సన్, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO వంటి కార్లకు గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








