‘సరిలేరు నీకెవ్వరు' అన్నట్లుగా CNG బైక్ సేల్స్.. 6 నెలల్లోనే 40 వేల మందికి పైగా కొనేశారు!
దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బజాజ్.. తమ వాహనాలతో అభిమానుల మనసు దోచుకుంటూ వస్తోంది. ఈ సంస్థ గతేడాది ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైకును లాంఛ్ చేసి సంచలనం సృష్టించింది. 2024లో జులైలో ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ పేరుతో లాంచ్ అయిన ఈ బైకును భారత వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. అందుకే సేల్స్‌లో దూసుకువెళ్లిపోయి బజాజ్ సంస్థకు లాభాలు తెచ్చిపెట్టింది. ఆరు నెలల వ్యవధిలో ఈ బైకును ఏకంగా 40 వేలకు మందికిపైగా వినియోగదారులు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
తమ విక్రయాలకు సంబంధించి వివరాలను బజాజ్ సంస్థ ప్రతినిధి రాకేశ్ శర్మ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రపంచంలోనే తొలిసారి తమ బ్రాండ్ నుంచి వచ్చిన సీఎన్ జీ బైకును భారతీయులు బాగా ఆదరించారని ఆయన అన్నారు. భారత్‌లో ఈ బైక్ Drum, Drum LED, Disc LED అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో డ్రమ్ వేరియంట్ ఎంట్రీ లెవెల్ వేరియంట్‌గా ఉంది.

ఈ బైక్ (చెన్నై ఎక్స్- షోరూమ్ ధర) రూ.89,997 కు మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే దీని గరిష్ఠ ధర రూ.1.10 లక్షలుగా ఉంటుంది. ఒక కిలో సీఎన్‌జీకి ఇది 102 కి.మీటర్ల మైలేజ్ అందిస్తుంది. పెట్రోల్‌తో అయితే ఇది ఒక లీటర్‌కు 65 కి.మీ.ల మైలేజీ ఇస్తుంది. రెండు లీటర్ల కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్ కలదు.
అధిక మైలేజీ అందించే ప్రత్యేకత ఈ బైకులో ఉండడం.. దీన్ని భారతీయ వినియోగదారులు బాగా ఆదరించడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. పేదల నుంచి ఈ బైకుకు భారీగా రెస్పాన్స్ లభించింది. ఈ బైకు ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 125 సీసీ, 4- స్ట్రోక్, ఎయిర్- కూల్డ్ మోటార్‌తో వస్తుంది. ఇది 9.5 PS పవర్, 9.77 Nm టార్క్‌ని విడుదల చేస్తుంది.

ఈ బైకులో ప్రీమియం ఫీచర్లు కూడా చాలానే ఉన్నాయి. ఇందులో LCD స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, 16- అంగుళాల వీల్స్, LED హెడ్ ల్యాంప్స్ వంటి సదుపాయాలు ఉంటాయి. ఈ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైకులో ఇంకా అదనపు ఫీచర్లు కూడా జోడించి ఉన్నాయి. ఈ ఫీచర్లతో పాటు, అధిక మైలేజీ ఇవ్వడం వంటి కారణంగా భారత్‌లో బైకు పాపులర్ అయింది.
ఈ బైక్ 6 నెలల వ్యవధిలోనే 40 వేల మందికి పైగా వినియోగదారులు దీన్ని కొనుగోలు చేశారు. ఈ బైకు భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ.. దీనికి ఈ స్థాయిలో సేల్స్ సాధించడం గమనార్హం. ఈ బైకును దేశవ్యాప్తంగా మార్కెట్లో అందుబాటులోకి తెస్తే... ఈ విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకు తగినట్లుగా ఆఫర్లను సైతం బజాజ్ అందిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: భారత్‌లో CNG కార్లు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ సీఎన్‌జీ ఆప్షన్.. బైకులకు కూడా విస్తరిస్తోంది. సీఎన్‌జీ- పవర్‌డ్ స్కూటర్లు మార్కెట్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రాబోతున్నాయి. టీవీఎస్ సంస్థ ... త్వరలో సీఎన్‌జీ స్కూటర్‌తో మార్కెట్ లోకి రానుంది. భవిష్యత్తులో సీఎన్‌జీ వెహికిల్స్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








