ఇప్పటివరకు ఇలాంటి ఆఫర్ చూసి ఉండరు.. కేవలం రూ.25,000 చెల్లిస్తే చాలు.. ఎలక్ట్రిక్ ఆటో మీ సొంతం!

దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్ (Bajaj) ఇండియాలో టూవీలర్ వాహనాలతో పాటు, త్రీవీలర్స్‌ను కూడా విడుదల చేస్తుంది. ఈ కంపెనీ నుంచి వచ్చే ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. మధ్య తరగతి వినియోగదారులను దృష్టిలో బడ్జెట్ ధరలో తన వాహనాలను తీసుకొస్తుంది. తాజాగా బజాజ్ మార్కెట్లోకి గోగో(gogo) బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ ఆటోరిక్షాల డెలివరీలను లక్నోలో మొదలుపెట్టింది. తక్కువ ధరకు తన త్రీవీలర్ వాహనాన్ని దేశీయ కస్టమర్లకు అందించడానికి బజాజ్ రూ.3.26 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో దీన్ని ప్రారంభించింది. ప్రీమియం వేరియంట్ ధర వచ్చేసి రూ. 3,83,004 (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తుంది. రూ.24,999 డౌన్ పేమెంట్ చెల్లించి వాహనాన్ని సొంతం చేసుకోవచ్చని బజాజ్ ప్రకటించింది.

ఇది భారతదేశం అంతటా ఉన్న అధికారిక బజాజ్ షోరూమ్‌లలో లభిస్తుంది. దీన్ని కొనాలనే ఆలోచనలో ఉన్న కస్టమర్లు డీలర్లను సంప్రదించవచ్చు. మరింత మెరుగైన రైడింగ్ అనుభవాన్ని కోరుకునే వినియోగదారుల కోసం కంపెనీ అదనంగా రూ.3200 విలువ గల ఫీచర్స్‌ను కూడా అందిస్తుంది. ఎవరైనా మీ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాను దొంగలించడానికి చూసినట్లయితే హెచ్చరించే అలర్ట్ సిస్టం, పార్క్ అసిస్ట్, హీల్ హోల్డ్ అసిస్ట్ వంటివి దీనిలో ఉన్నాయి.

Bajaj Gogo Delivery

గోగో బ్రాండ్ కింద విడుదలైన వీటి పేర్లు, P5009, P5012, P7012. ఈ కొత్త ఆటోరిక్షాలోని మొదటి 'P' అక్షరం ప్యాసింజర్‌ని సూచిస్తుంది, 50, 70 నెంబర్లు వాటి కొలతలను పేర్కొంటుంది. బేస్ మోడల్ గోగో P5009 విషయానికి వస్తే, 'P' ప్యాసింజర్‌ని, 50 నెంబర్ దాని కొలతలను పేర్కొంటుంది. తర్వాత చివరి సంఖ్యలు 9 బ్యాటరీ కెపాసిటీని సూచిస్తుంది. దీనర్థం 9 కిలోవాట్లు (kWh).

ఈ బేస్ మోడల్‌లో అధునాతన PMS మోటారును అందించారు. ఇది 4.5 kW పవర్, 36 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరింత ఎక్కువ పవర్ కావాలనుకునే వారు టాప్ వేరియంట్‌ ఎంచుకోవచ్చు. ఇది 5.5kW పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. P5009 మోడల్‌లో అమర్చిన బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే ఏకంగా 171 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే టాప్ వేరియంట్ మరింత ఎక్కువగా 251 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

Bajaj Gogo Three Wheeler

P5009 వేరియంట్‌లో ఉన్నటువంటి బ్యాటరీని కేవలం 4.30 గంటల్లోనే 0 నుండి 80 శాతం ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఆన్-బోర్డ్ ఛార్జర్‌ను వాడినట్లయితే ఇది మరింత మెరుగ్గా ఉంటుంది. ఇది అధునాతన ఫీచర్స్‌ను కలిగి ఉంది. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లను అందించారు. దీంతో బ్రేకింగ్ విషయంలో కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సస్పెన్షన్ సెటప్ కూడా చాలా కొత్తది. గుంతల రోడ్డుపై సాఫీ ప్రయాణాన్ని ఇస్తుంది.

సస్పెన్షన్ సెటప్‌లో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక స్పైరల్ ట్యూబులర్ సస్పెన్షన్ సిస్టమ్ ఉన్నాయి. ఇంకా డ్యూయల్-టోన్ ఇంటీరియర్ డిజైన్, అధునాతన టచ్‌స్క్రీన్ డిజిటల్ LCD క్లస్టర్, USB టైప్ A సపోర్ట్‌తో మొబైల్ ఛార్జర్, TecPac కనెక్టివిటీ, గ్లోవ్‌బాక్స్ , ఇతర సదుపాయాలు దీనిలో ఉన్నాయి. ఈ ఆఫర్ గురించిన పూర్తి వివరాల కోసం కస్టమర్లు దగ్గరలోని బజాజ్ డీలర్‌షిప్ సిబ్బందిని సంప్రదించడం ఉత్తమం.

Bajaj Gogo Three Wheeler Electric Vehicle All Top Things

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 12, 2025, 10:52 [IST]
English summary
Bajaj gogo three wheeler electric vehicle all top things details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+