ఈ పొట్టి కారు ధర కేవలం రూ. 3.61 లక్షలు మాత్రమే.. భారీ అప్‌డేట్ వచ్చేసింది!
దేశంలో తక్కువ ధరలో దొరికే వాహనాలను కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కోవలో తక్కవ ధరలో దొరికే కారుగా మారుతీ సుజుకీ ఆల్టో మంచి పేరు సంపాదించుకుంది. ఇక దాని తర్వాత చెప్పుకోవాల్సింది బజాజ్ క్యూట్. రూ.3.61 లక్షలకే అందుబాటులో ఉన్న ఈ వాహనం వినియోగదారులకు బాగా చేరువైంది.
దీన్ని క్వాడ్రిసైకిల్ సెగ్మెంట్(నాలుగు చక్రాల రిక్షా) కింద తీసుకువచ్చింది బజాజ్ సంస్థ. అలాగే ఇది భారత్‌లోని తొలి ఆటో ట్యాక్సీగా కూడా పేరు దక్కించుకుంది. ఈ మోడల్‌కు సంబంధించి కొత్త డ్యాష్ బోర్డ్ డిజైన్‌కు ఇటీవల బజాజ్ సంస్థ పేటెంట్ దక్కించుకుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. బజాజ్ క్యూట్‌ను 2019లో భారత మార్కెట్లో లాంచ్ చేశారు. అయితే దీన్ని 2012లోనే పరిచయం చేశారు.

ప్రాక్టికల్ క్యాబిన్ లే-అవుట్‌తో ఇందులోని ఫస్ట్-జనరేషన్ మోడల్ వస్తుంది. అలాగే ఇందులో స్పీడోమీటర్, డ్యాష్ బోర్డుపైన గేర్ లివర్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ఫీచర్ల.. వినియోగంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు ఈ కొత్త డ్యాష్ బోర్డు డిజైన్‌లో ఫస్ట్ జనరేషన్ మోడల్‌లో ఎదురైన సమస్యలు లేకుండా తీసుకువచ్చింది బజాజ్ సంస్థ. ముఖ్యంగా దీంట్లో నుంచి గేర్ లివర్‌ను తొలగించారు.
అలాగే... స్టీరింగ్ వీల్ వెనకాల స్పీడోమీటర్ కన్సోల్‌ను ఏర్పాటు చేశారు. అంతేగాకుండా సెంటర్ కన్సోల్.. సెంట్రల్లీ మౌంటెడ్ ఏసీ వెంట్ సహా ఇతర రోటరీ డయల్స్‌తో ఉంటుంది. ఈ కొత్త డ్యాష్ బోర్డును ఫంక్షనల్ ఛేంజెస్‌తోనే కాకుండా.. దీన్ని యాస్తెటిక్ అప్డేట్స్‌తో కూడా తీసుకువచ్చారు. దీంట్లో రీడిజైన్‌డ్ బంపర్, లైట్ సెటప్ ఉంటుంది. ఈ అప్డేట్లతో ఈ క్యూట్... వినియోగదారుల్లో మరింత మందిని ఆకర్షించే అవకాశం ఉంది.
అలాగే స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌ను కూడా మరింత మెరుగైన వినియోగం కోసం రీడిజైన్ చేశారు. ఈ బజాజ్ క్యూట్ 217 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో అనుసంధానించి ఉంటుంది. ఇది LPG, CNG బై-ఫ్యూయల్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇది 12.44 PS పవర్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులో CNG మోడ్ 11 PS పవర్ ఉత్పత్తి చేస్తుంది.
2024 డేటా ప్రకారం.. భారత్‌లో మొత్తం త్రీ వీలర్ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ 3 వీలర్స్ వాటా దాదాపు 56శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ క్యూట్‌కు సంబంధించి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా బజాజ్ సంస్థ తీసుకురానుందని సమాచారం. అయితే.. దీంట్లో నెక్స్ట్-జనరేషన్ క్యూట్ మోడల్ గనుక పరిచయం అయితే.. సాధారణ త్రీవీలర్ తరహాలోనే ఈ క్వాడ్రాసైకిల్ కూడా మంచి మైలేజ్‌ను మెయింటెయిన్ చేయగలుగుతుందని చెప్పవచ్చు.
దీని క్వాడ్రాసైకిల్ నేచర్ కారణంగా క్యూట్ టాప్ స్పీడ్ 70 కేఎంపీహెచ్‌కు తగ్గింది. రిక్షా తరహాలోనే దీంట్లో ఇంజిన్ వెనుకవైపు అమర్చి ఉంటుంది. అయితే..ఈ కొత్త మోడల్స్ ప్రస్తుతం ఉన్న ప్లాట్‌ఫామ్‌నే కొనసాగిస్తాయా లేదా అప్‌డేటెడ్ ఎడిషన్‌తో వస్తాయా? అనే విషయం తెలియరాలేదు. దీనికోసం భారత్‌లో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: డిసెంబరు 13, 2024న బజాజ్ సంస్థ త్వరలో తీసుకురాబోయే కొత్త మోడళ్లకు సంబంధించి తన కొత్త డ్యాష్ బోర్డును రిజిష్టర్ చేసుకుంది. ఈ మార్పులు ఈ క్యూట్ వాహనం ఫంక్షనాలిటీతో పాటు లుక్‌ను కూడా మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ సెగ్మెంట్‌లో పోటీ కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








