దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న బెస్ట్ కార్లు.. రూ.5.50 లక్షల నుంచి స్టార్ట్! బడ్జెట్ పెట్రోల్ SUVలు

భారతదేశంలో SUV లకు ఉన్న క్రేజ్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు సెడాన్‌లు, హ్యాచ్‌బ్యాక్‌లు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు దేశంలోని ఆటోమొబైల్ మార్కెట్‌ను పూర్తిగా మార్చేసిన విభాగం SUV సెగ్మెంట్. ప్రతి వయసు వర్గం, ప్రతి నగరం, గ్రామం.. ఎక్కడ చూసినా SUVలే రోడ్లను ఆక్రమిస్తున్నాయి. ఈ ట్రెండ్ ఎందుకు వచ్చిందంటే, SUVలు అందించే స్టైల్, రోడ్ ప్రెజెన్స్, సేఫ్టీ, గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అంశాలు భారతీయ ప్రయాణికుల అభిరుచులకు పర్ఫెక్ట్‌గా సరిపోవడం ప్రధాన కారణం. ప్రస్తుతం మార్కెట్లో పలు కంపెనీలకు చెందిన SUV లు ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ కథనంలో టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ పెట్రోల్ SUV గురించి తెలుసుకుందాం.

Tata Punch: భారత మార్కెట్లో కాంపాక్ట్ SUVల రాజుగా పేరొందిన టాటా పంచ్, తన ప్రత్యేకమైన రగ్డ్ లుక్, ప్రాక్టికల్ సైజ్, నమ్మదగిన పనితీరుతో ప్రతి ఇంటి ముందూ కనిపించే కారుగా మారింది. రూ. 5.50 లక్షల నుంచి 9.30 లక్షల(ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో లభించే ఈ మోడల్, బడ్జెట్‌-ఫ్రెండ్లీ అయినా కూడా ఫీచర్లలో మాత్రం ఏ మాత్రం రాజీపడదు. టాటా పంచ్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో అందరినీ ఆకట్టుకుంటుంది.

Best Affordable Petrol Suvs Tata Punch Nissan Magnite And Maruti Fronx Details

ఇది 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ CNG ఇంజిన్ ఆప్షన్లు ఇచ్చే స్మూత్ డ్రైవ్ అనుభవం. పెట్రోల్‌లోనూ, CNGలోనూ మంచి రెస్పాన్స్ ఇస్తూ, మైలేజీ విషయంలో 18 kmpl నుంచి 27 kmpl మధ్య అద్భుతమైన ఎకానమీని అందిస్తుంది. ఫ్యామిలీ కోసం పర్ఫెక్ట్‌గా సరిపడే 5-సీటర్ సెట్టింగ్, లోపల విశాలమైన కేబిన్, ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్ కూడా పంచ్‌కు అదనపు అట్రాక్షన్. డజన్ల కొద్ది ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Nissan Magnite: భారత కుటుంబాల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన కాంపాక్ట్ SUVల్లో నిస్సాన్ మాగ్నైట్ ఒకటి. ధర పరంగా అందుబాటులో ఉండటం, ఫీచర్ల పరంగా రిచ్‌గా ఉండటం..ఈ రెండు కారణాలు కలిసి ఈ SUVని మొదటి నుంచే మంచి హిట్‌గా నిలబెట్టాయి. రూ.5.62 లక్షల నుంచి 10.76 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో లభించే మాగ్నైట్, స్టైలిష్‌గా కనిపించే డిజైన్‌తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Best Affordable Petrol Suvs Tata Punch Nissan Magnite And Maruti Fronx Details

దీని 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్ రోజువారీ వినియోగానికి పర్ఫెక్ట్‌గా ఉండగా, 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ స్మూత్ పికప్‌తో డ్రైవర్‌కు స్పోర్టీ ఫీలింగ్ ఇస్తుంది. పెర్ఫార్మెన్స్ మంచి స్థాయిలో ఉండటం మాత్రమే కాదు, 18 నుంచి 20 కి.మీ. వరకు అందించే మైలేజీ కూడా దీనిని బడ్జెట్‌కు కట్టుబడి ఉండే ఫ్యామిలీస్‌కు ప్రత్యేకంగా సూట్ అయ్యేలా చేస్తుంది. 5-సీటర్ సెట్టింగ్‌తో ఫ్యామిలీ యూజ్‌కి సరిపోయే స్పేస్ ఉంది.

Maruti Suzuki Fronx: భారత ఆటో మార్కెట్లో యువత నుండి ఫ్యామిలీ యూజర్ల వరకు అందరి దృష్టిని ఆకర్షించిన మోడళ్లలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఒకటి. రూ. 6.85 లక్షల నుంచి 11.98 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో అందుబాటులో ఉండటం వల్ల ఇది కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో ఎక్కువ మంది కొనుగోలుదారులకు చేరువైంది. ఇంజిన్ ఎంపికల పరంగా చూస్తే, ఫ్రాంక్స్ చాలా విభిన్న ఆప్షన్లను అందిస్తుంది.

Best Affordable Petrol Suvs Tata Punch Nissan Magnite And Maruti Fronx Details

రోజువారీ సిటీ డ్రైవింగ్‌కు సరిపోయే 1.2-లీటర్ పెట్రోల్, పెర్ఫార్మెన్స్‌ను ఇష్టపడేవారికి 1-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, అలాగే మైలేజ్ ప్రాధాన్యత ఇచ్చేవారికి 1.2-లీటర్ CNG-ఇలా ప్రతి రకమైన యూజర్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మారుతి ఈ SUVని తీర్చిదిద్దింది. ఫ్యూయల్ ఎఫిషియెన్సీ కూడా ఫ్రాంక్స్‌కు మరో పెద్ద బలం. వేరియంట్‌ను బట్టి 20.1 kmpl నుండి 28.51 km/kg వరకు అందించే మైలేజీ దీనిని అత్యంత ఆర్థికంగా మారుస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, December 1, 2025, 18:50 [IST]
English summary
Best affordable petrol suvs tata punch nissan magnite and maruti fronx details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+