ఈ కారు కోసం షోరూమ్‌ ముందు జనాల సందడి.. 30 కి.మీ మైలేజ్, రూ.6.70 లక్షలు.. సేల్స్‌లో హవా

మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలో మెరుగైన సౌకర్యాలు అందించడంలో మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పుడూ ముందుంటుంది. అటువంటి బ్రాండ్ నుంచి వచ్చిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ - బాలెనో (Baleno), ఇప్పుడు భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే కారులలో ఒకటిగా నిలిచింది. దాదాపు ప్రతి నెలా, ఈ కారుకు గల డిమాండ్ పెరుగుతూనే ఉంది. స్టైలిష్ లుక్, విస్తృతమైన ఇంటీరియర్, అధునాతన ఫీచర్లతో బాలెనో అనేది ఒక మంచి ఆప్షన్‌గా మారింది. ప్రత్యేకించి నగరాల్లో ఉండే యువత నుంచి, చిన్న కుటుంబాల వరకు ఇది ఒక పర్ఫెక్ట్ కారుగా పేరు తెచ్చుకుంది. ఫ్యూయల్ సామర్థ్యం పరంగా బాలెనో నిరూపించుకున్న మోడల్. పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నప్పటికీ, మంచి మైలేజీ అందించడంతో ఇది వినియోగదారుల మనసు దోచుకుంది.

తాజాగా విడుదలైన సేల్స్ గణంకాల ప్రకారం,జూలై 2025లో బాలెనో తన సత్తా మరోసారి నిరూపించుకుంది. మొత్తం 12,600 యూనిట్లు అమ్ముడుపోవడం ద్వారా ఇది మార్కెట్లో తన స్థానం మరింత బలపరుచుకుంది. ఈ గణాంకంతో బాలెనో, భారతదేశంలోని టాప్ 10 అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో చోటు సంపాదించడం గమనార్హం. ఇటీవల సంవత్సరాలలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పోటీ మరింత తీవ్రంగా మారింది. అయినప్పటికి సేల్స్‌లో ఇది దూసుకుపోతుంది.

Maruti Suzuki Baleno July 2025 Sales

బాలెనో ఎంపిక చేసేవారు కేవలం స్టైల్‌కి కాదు, ఉపయోగపడే ఫీచర్లు, బ్రాండ్ విలువ, మైలేజీ, రీసేల్ విలువ వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని తీసుకుంటున్నారు. ఇదే కారణంగా, పోటీ చాలా ఉన్నా కూడా బాలెనో అమ్మకాలు తగ్గక, నెలనెలకూ పెరుగుతూనే ఉన్నాయి. టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ లాంటి మోడళ్లన్నీ ఒక్కోదానికి ప్రత్యేకమైన ఫీచర్లతో మార్కెట్లో ఉన్నా కూడా వినియోగదారులు బాలెనో వైపు చూస్తున్నారు.

మారుతి సుజుకికి దేశవ్యాప్తంగా సర్విసింగ్ నెట్‌వర్క్ ఉండటం, తక్కువ నిర్వహణ ఖర్చు, వేగంగా స్పేర్ పార్ట్స్ అందుబాటు వంటి అంశాలు బాలెనోను మరింత పాపులర్ చేసాయి. ఈ కారు అన్ని వైపులా బ్యాలెన్స్‌గా ఉండడం వల్లే, యువత నుంచి ఇటు కుటుంబాల వరకు దీనిపై ఆకర్షణ పెరిగింది. స్టైలిష్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్, ఫీచర్ రిచ్ కిట్ అన్నీ కలిపి ఈ కారును మార్కెట్లో ఒక శక్తివంతమైన మోడల్‌గా నిలిపాయి.

Best Budget Car Maruti Suzuki Baleno July 2025 Sales

ప్రస్తుతానికి బాలెనో ధర రూ.6.70 లక్షల నుండి ప్రారంభమవుతోంది, ఇది దీనిని మధ్యతరగతి కారు కేటగిరీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలబెడుతోంది.బాలెనో రెండు ప్రధాన పెట్రోల్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఒకటి 1.2 లీటర్, 4-సిలిండర్ K12N పెట్రోల్ ఇంజిన్, ఇది 83 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రెండవది, మరింత శక్తివంతమైన 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్, ఇది 90 bhp శక్తిని అందిస్తుంది.

ఈ రెండు వేరియంట్‌లు కూడా డ్రైవింగ్‌కు సరిపోయేలా రూపొందించబడ్డాయి. పెట్రోల్ వేరియంట్‌లు కావడంతో మైలేజీ విషయంలో మంచి రికార్డు ఎక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (AMT) ఎంపిక కావడం వల్ల ట్రాఫిక్‌లోనూ హాసిల్-ఫ్రీ డ్రైవింగ్ అనుభూతి కలుగుతుంది. అదే సమయంలో, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో క్లాసిక్ డ్రైవింగ్ ఫీల్‌ను కోరుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్. మరో విషయం ఏమిటంటే ఇది CNG లో కూడా లభిస్తుంది.

Best Budget Car Maruti Suzuki Baleno July 2025 Sales

బాలెనో CNG వెర్షన్‌లో 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ అమర్చబడింది. ఈ ఇంజిన్ 78 PS శక్తిని, 99 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సాఫ్ట్‌గా, సమర్ధవంతంగా రన్నవుతుంది. CNG మోడ్‌లో కూడా పవర్ డిప్లాయ్‌మెంట్ చాలా స్మూత్‌గా ఉంటుంది. CNG వేరియంట్‌కి మంచి మైలేజీ ప్లస్ పాయింట్. మారుతి సుజుకి ప్రకారం, బాలెనో CNG మోడల్ కిలోగ్రామ్‌కి దాదాపు 30 కి.మీ మైలేజ్ అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 7, 2025, 9:50 [IST]
English summary
Best budget car maruti suzuki baleno july 2025 sales report details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+