తక్కువ ధర, ఎక్కువ మైలేజ్.. భారీగా డబ్బుల ఆదా చేసే ట్యాక్సీ కార్లు ఇవే

బతుకు బండిని లాగడానికి ప్రతి వ్యక్తి ఏదో ఒక ఉద్యోగాన్ని ఎంచుకుంటాడు. కొందరు సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ఉద్యోగాలు చేస్తుంటే.. మరి కొందరు మాత్రం కారు నడపడం నేర్చుకుని డ్రైవర్‎గా స్థిరపడుతుంటారు. వాళ్లు మంచి మైలేజీ, తక్కువ ధరలో లభించే కార్ల కోసం చూస్తుంటారు. అలాంటి వారి కోసం మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్, టాటా టిగోర్, హ్యుందాయ్ ఆరా, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి ఎర్టిగా వంటి కార్లు డ్రైవర్ ఉద్యోగానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి.

ప్రస్తుతం పెద్ద పెద్ద పట్టణాల్లో ఊబర్, ఓలా, ర్యాపిడో లాంటి సంస్థలు కార్లను హైర్ చేసుకుంటాయి. దీంతో వేలాది మంది తమ కార్లను ఆ కంపెనీలకు ఇచ్చి డ్రైవర్లుగా కమీషన్లు పొందుతున్నారు. రోజంతా కష్టపడినా మంచి లాభాలను చవిచూడకపోతే ఆ రోజు పడిన శ్రమ వృధా అవుతుంది. దీంతో వాళ్లు మంచి మైలేజ్ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ కథనంలో కొన్ని బెస్ట్ కార్ల ధర, స్పెసిఫికేషన్‌ల వివరాలను అందించారు.

Maruti Dzire

మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్: ఇది ఒక సెడాన్, బడ్జెట్ ధరలో లభిస్తుంది. పెట్రోల్ తో నడిచే ఈ కారు ధర రూ. 6.79 లక్షలు(ఎక్స్ షోరూమ్). అదేవిధంగా, సీఎన్జీ బేస్డ్ మోడల్ రూ. 7.74 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కస్టమర్లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ఈ డిజైర్ టూర్ ఎస్ సెడాన్ 1.2-లీటర్. ఇది పవర్ ఫుల్ 3-సిలిండర్ పెట్రోల్, సీఎన్జీ ఇంజిన్‌తో వస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంది. ఇది లీటరుకు 22.72 నుంచి 24.69కి.మీ మైలేజ్ అందిస్తుంది. ఇది 5 సీట్ల ఆఫ్షన్ కలిగి ఉంది. దీనిలో ప్రయాణీకులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

కొత్త మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్ ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, బ్లూయిష్ బ్లూ కలర్స్‎లో లభిస్తుంది. దీనికి అల్లాయ్ వీల్స్, రియర్ డీఫాగర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లను అందిస్తుంది. సేఫ్టీ కోసం దీనిలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు లభిస్తాయి.

Tata Tigor

టాటా టిగోర్: ఇది కూడా సెడాన్ టైప్ కారు. ఈ సెడాన్ టాక్సీ సర్వీసులను అందించడానికి అత్యంత అనుకూలమైనది. దీని ధర రూ. 6 లక్షల నుంచి రూ. 9.50 లక్షల (ఎక్స్-షోరూమ్)మధ్య ఉంటుంది. ఇది XM, XT, XZ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది. దీనిలో కూడా 5 సీట్లు ఉన్నాయి.

కొత్త టాటా టిగోర్ కారు 1.2-లీటర్. పెట్రోల్, 1.2-లీటర్ CNG ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. దీనికి కూడా 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. ఫ్యూయెల్ కెపాసిటీ పరంగా ఈ సెడాన్ లీటరుకు19.43 నుంచి 28.06కి.మీ మైలేజీని అందిస్తుంది.

ఈ టిగోర్ సెడాన్ 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, యూఎస్బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, కీలెస్ ఎంట్రీ వంటి లేటెస్ట్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ప్రయాణీకుల సేఫ్టీ కోసం 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

Hyndai Aura

హ్యుందాయ్ ఆరా: ఇది కూడా ఒక సెడాన్. దీని ధర రూ. 6.54 లక్షల నుంచి రూ. 9.11 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది E, S, SX, SX(O) వేరియంట్స్ లో లభిస్తుంది. ఇది టైఫూన్ సిల్వర్, స్టార్రి నైట్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, టీల్ బ్లూ వంటి కలర్స్‎లో లభిస్తుంది.

Take a Poll

కొత్త హ్యుందాయ్ ఆరా సెడాన్ 1.2-లీటర్.. 4-సిలిండర్ పెట్రోల్, 1.2-లీటర్ CNG ఇంజిన్ ఉంటుంది. 5-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఇది లీటరుకు 17 నుంచి 28.4కిమీ వరకు మైలేజీని అందిస్తుంది. ఈ కారులో ఐదుగురు హాయిగా ప్రయాణించవచ్చచు. ఇది 6.5-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా వివిధ ఫీచర్స్ కలిగి ఉంది.

Maruti Waganor

మారుతి సుజుకి వ్యాగన్ఆర్: ఈ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 5.64 లక్షల నుంచి రూ. 7.47 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. దీనికి LXI, VXI, ZXI తో సహా వివిధ వేరియంట్స్ ఉన్నాయి. గాలెంట్ రెడ్, పూల్ సైడ్ బ్లూ, సుపీరియర్ వైట్, సిల్కీ సిల్వర్ వంటి కలర్స్ ఉన్నాయి.

ఈ మారుతి వ్యాగన్ఆర్ కారు పెట్రోల్, CNG ఇంజిన్లతో లభిస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. ఇది లీటరుకు 23.56 నుంచి 34.05 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. ఇందులో ఐదుగురు హాయిగా కూర్చోవచ్చు.

కొత్త మారుతి సుజుకి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ 312 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. దీనిలో 7-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే, 4-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియోతో సహా పలు ఫీచర్లతో వస్తుంది. సేఫ్టీ కోసం డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ కలిగి ఉంటుంది.

Maruti Eartiga

మారుతి సుజుకి ఎర్టిగా: ఇది ఒక పాపులర్ ఎంపీవీ. దీని ధర రూ. 8.84 లక్షల నుంచి రూ. 13.13 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. దీనికి VXI, ZXI, ZXI ప్లస్ అనే వేరియంట్స్ ఉన్నాయి. ఇది మెటాలిక్ మాగ్మా గ్రే, పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, డిగ్నిటీ బ్రౌన్, పెర్ల్ మెటాలిక్ ఆక్స్‌ఫర్డ్ బ్లూ వంటి వివిధ కలర్స్ లో కూడా లభిస్తుంది.

కొత్త ఎర్టిగా కారు 1.5-లీటర్. దీనికి పెట్రోల్, సీఎన్జీ ఇంజిన్ ఉంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్/6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆఫ్షన్ ఉంది. ఇది లీటరుకు 20.3 నుండి 26.11కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. ఈ కారులో 7 సీట్ల ఆప్షన్ ఉంది.

ఈ MPV లగేజీని తీసుకెళ్లడానికి 209 లీటర్ల బూట్ స్పేస్‌ కలిగి ఉంది. ఇది 7-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ప్యాడిల్ షిఫ్టర్లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఏసీ వంటి వివిధ ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులో 4 ఎయిర్‌బ్యాగులు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ప్రయాణీకుల సేఫ్టీ కోసం బ్యాక్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, March 24, 2025, 17:20 [IST]
English summary
Best budget cars for drivers seeking high mileage and low cost
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+