Top-3 Safest Cars: కళ్లు పెద్దవి చేసి చూడు బ్రో.. ఇండియాలో తక్కువ ధరలకు లభించే టాప్ 3 సేఫ్టీ కార్లు ఇవే !

Top-3 Safest Cars: ఇండియాలో వాహన భద్రతకు ప్రాధాన్యత పెరుగుతోంది. వినియోగదారులు సురక్షితమైన కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనివల్ల కార్ల తయారీదారులు కూడా ఎక్కువ భద్రతలో పాటు సరసమైన ధరల్లో కొన్ని కార్లను అందిస్తున్నారు. డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఏ కారు కొనాలనే విషయంలో వినియోగదారులు అయోమయంలో ఉన్నారు.

అలాంటి వారి కోసం తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీ ఫీచర్లను అందించే మూడు ప్రముఖ బ్రాండ్లకు చెందిన కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ మూడు కార్లు ప్రస్తుతం భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో దూసుకుపోతున్నాయి. సేఫ్టీ, ధర, డిజైన్, ఫీచర్లు వంటి అనేక విభాగాలలో వినియోగదారుల నుంచి మంచి స్పందనను పొందాయి. మధ్యతరగతికి బడ్జెట్ ధరలో లభించే ఈ కార్లు వారి కుటుంబానికి భద్రతను అందిస్తాయి.

Best Budget Cars with Top Safety

మహీంద్రా XUV 3XO: దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా XUV300 సబ్-కాంపాక్ట్ SUV అప్ డేట్ వెర్షన్ అయిన మహీంద్రా XUV 3XO SUV ని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ మహీంద్రా XUV 3XO భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) క్రాష్ టెస్ట్‌లో మంచి సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

మహీంద్రా XUV 3XO సబ్-కాంపాక్ట్ SUV క్రాష్ టెస్ట్‌లో పెద్దల సేఫ్టీలో 32కి 29.36 పాయింట్లు, పిల్లల ప్రయాణీకుల సేఫ్టీలో 49కి 43 పాయింట్లు సాధించింది. దీని ద్వారా మహీంద్రా XUV 3XO మొత్తం సేఫ్టీలో 5-స్టార్ సేఫ్టీని పొందింది. మహీంద్రా XUV 3XO SUV సేఫ్టీ ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇందులో లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) టెక్నాలజీ అందించారు.

Best Budget Cars with Top Safety

అదనంగా, కొత్త మహీంద్రా సబ్-కాంపాక్ట్ SUV లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, EBDతో ABS, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు బ్రేక్ డిస్క్ వైపింగ్ ఉన్నాయి. కొత్త మహీంద్రా XUV 3XO సబ్-కాంపాక్ట్ SUV ధర రూ. 7.79 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అదనపు భద్రత కోసం బెల్ట్ ప్రీటెన్షనర్‌లు, బెల్ట్ లోడ్-లిమిటర్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్ బెల్ట్ రిమైండర్‌లు ఉన్నాయి.

టాటా కర్వ్: టాటా మోటార్స్ కొత్త కర్వ్ కూపే SUV దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ సాధించింది. కొత్త టాటా కర్వ్ కారు కూడా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ కొత్త SUV భారత్ NCAP కింద అత్యంత సేఫ్టీ కారుగా నిలిచింది. క్రాష్ టెస్ట్‌లో పెద్దల సేఫ్టీలో 32కి 29.5, పిల్లల రక్షణలో 49కి 43.66 పాయింట్లు సాధించింది. మొత్తంగా ఈ కారు 5-స్టార్ రేటింగ్‌ను పొందింది.

Best Budget Car Tata Curv

టాటా కర్వ్ SUV లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, TPMSతో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించింది. దీని టాప్-ఎండ్ వేరియంట్‌లలో డిస్క్ బ్రేక్‌లు, 360డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఉన్నాయి. దీని ఎలక్ట్రిక్ SUV వెర్షన్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-స్టార్ట్, డిసెంట్ అసిస్ట్, ESP, డ్రైవర్ డ్రెసినెస్ అలర్ట్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, లెవెల్ 2ADAS ఫీచర్లు ఉన్నాయి.

టాటా మోటార్స్ ఈ మోడల్‌ను లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్, విలాసవంతమైన ఇంటీరియర్‌తో తీసుకొచ్చింది. మంచి డ్రైవింగ్ ఎక్సీరియన్స్, పర్ఫామెన్స్ రెండింటికీ ప్రాధాన్యతనిస్తూ ఈ కారును రూపొందించారు. ఈ కారు ప్రస్తుతం రూ. 10 లక్షల నుంచి రూ. 19.20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ధరలో లభిస్తుంది.

Best Budget Car Maruti Suzuki

మారుతి డిజైర్: మారుతి సుజుకి ఇటీవల విడుదల చేసిన ఫోర్త్ జనరేషన్ డిజైర్ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ పొందింది. కార్ల బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ రేటింగ్ ను అంచనా వేసే గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (GNCAP) డిజైర్‌ను మారుతి అత్యంత సురక్షితమైన కారుగా ప్రకటించింది.

మారుతి సుజుకి డిజైర్ గ్లోబల్ NCAP నిర్వహించిన సేఫ్టీ టెస్టులో పెద్దల సేఫ్టీ సెగ్మెంట్లో 34కి 31.24 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్ పొందింది. అలాగే, పిల్లల రక్షణ విభాగంలో 42కి 39.20 పాయింట్లు సాధించి మంచి సేఫ్టీ కలిగిన కారుగా నిలిచింది. ఫోర్త్ జనరేషన్ డిజైర్ అనేక సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.

ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు ఉన్నాయి. ప్రయాణీకుల రక్షణ కోసం కొత్త మారుతి సుజుకి డిజైర్ ఎక్కువ మొత్తంలో సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. అందుకే గ్లోబల్ NCAP ఈ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను ఇచ్చింది. దీని ధర రూ. 6.84 లక్షల నుంచి రూ. 10.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

Best Budget Cars Mahindra

మారుతి సుజుకి డిజైర్ లోపలి భాగంలో డ్యూయల్-టోన్ బీజ్ (ఎగువ భాగం, డాష్, సీట్లు), బ్లాక్ (డాష్, డోర్ కార్డ్‌లు, దిగువ భాగాలు) థీమ్ ఉంది.5-స్టార్ రేటింగ్ ఉన్న కార్లు అత్యంత సురక్షితమైనవిగా పరిగణిస్తారు.

ప్రమాదాలు జరిగినపుడు ప్రాణ నష్టం తగ్గించడానికి సీటు బెల్టులు చాలా ఉపయోగపడతాయి. పిల్లల భద్రత కోసం చైల్డ్ సేఫ్టీ సీట్లు ఉపయోగించడం మంచిది. కారును ఎప్పుడు కూడా అతివేగంగా నడపరాదు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతూ కారు నడపరాదు.

కారు కొనుగోలు చేసే ముందే దాని సేఫ్టీ రేటింగ్‌ను తప్పకుండా తెలుసుకోండి. కారులో అన్ని ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయో లేదో చూసుకోండి. టెస్ట్ డ్రైవ్ సమయంలో కారు సేఫ్టీ ఫీచర్లను పరీక్షించాలి. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులను రక్షించడానికి ఎయిర్‌బ్యాగ్‌లు చాలా అవసరం. కొన్ని కార్లలో 6 లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 26, 2025, 15:30 [IST]
English summary
Best budget cars with top safety features for indian buyers
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+