రూ.6.89 లక్షలకే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కారు! యాక్సిడెంట్ అవుతుందన్న భయం అవసరం లేదు!

ఇటీవల కాలంలో కార్ల మార్కెట్‌లో ఒక ప్రత్యేకమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఒక వాహనం అవసరం కోసం కాకుండా, సౌకర్యం, భద్రత, ఫీచర్లు అన్నీ కలిసిన పూర్తి ప్యాకేజ్ కోసం వినియోగదారులు ఎక్కువగా వెతుకుతున్నారు. అందుబాటు ధరలోనే మంచి మైలేజ్ ఇస్తే బాగుంటుందని, లాంగ్ జర్నీలో ఇబ్బందులు లేకుండా నడిస్తే ఇంకా మంచిదని కోరుతున్నారు. కేవలం ఇంధన ఖర్చు తక్కువగా ఉండడమే కాదు, డ్రైవ్ చేసే వారికి నమ్మకం కలిగించే సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండాలని భావిస్తున్నారు.రోడ్డుపై కారు నడపగానే శక్తివంతంగా స్పందిస్తేనే దాని విలువ పెరుగుతుందని చాలా మంది భావిస్తున్నారు. అదే సమయంలో, సాంకేతికతను దృష్టిలో పెట్టుకుని అధునాతన ఫీచర్లు ఉండటం తప్పనిసరి అయింది. అలాంటి వాటిలో కొత్త 2025 టాటా ఆల్ట్రోజ్ (2025 Tata Altroz) ఒకటి.

ఈ కారు గురించిన వివరాలను చూసినట్లయితే,ఆల్ట్రోజ్‌ను కొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ధర పరంగా చూస్తే, బేస్ వేరియంట్‌ను కేవలం రూ. 6.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంచింది. డీజిల్ వేరియంట్‌ను కోరుకునే వారికి మాత్రం ధర రూ. 8.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ ధరల శ్రేణి ఆల్ట్రోజ్‌ను మధ్యతరగతి కుటుంబాలకు మరింత చేరువ చేస్తూ, మంచి ఫీచర్లు కలిగిన హ్యాచ్‌బ్యాక్‌గా నిలిపింది.

Best Family Budget Car Tata Altroz Price Engine

ఇంజిన్ పరంగా ఆల్ట్రోజ్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెండు వేరియంట్లలో వస్తోంది. మొదటిది 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజిన్ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో పాటు రోజువారీ డ్రైవింగ్‌కు సరిపోయే విధంగా డిజైన్ చేయబడింది. పెట్రోల్ వేరియంట్‌లో ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఫ్యాక్టరీ-ఫిటెడ్ CNG కిట్‌తో కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో పెట్రోల్ వాడేవారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది.

మరొక ఎంపికగా 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా లభిస్తోంది. ఇది ఎక్కువ శక్తి, మంచి టార్క్ ఇవ్వడం వల్ల హైవేలు, దూర ప్రయాణాల్లో డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతం చేస్తుంది. ఇంజిన్ వేరియంట్లు కూడా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తోనే లభిస్తున్నాయి. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం,ఈ కారు మైలేజీ విషయానికొస్తే, 19 నుంచి 26 కిలోమీటర్ల వరకు లీటరుకు ఇచ్చే సామర్థ్యంతో మార్కెట్లో మంచి ఎకానమికల్ కార్లలో ఒకటిగా నిలుస్తోంది.

Best Family Budget Car Tata Altroz Price Engine

కొత్త టాటా ఆల్ట్రోజ్ క్లాస్-లీడింగ్ ఫీచర్లతో వచ్చింది. ఇందులో ఉన్న డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్లు(ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ & ఇన్ఫోటైన్‌మెంట్) కారు క్యాబిన్‌ను పూర్తిగా ఆధునికంగా మార్చేస్తాయి. టాటా ప్రత్యేకంగా అందించిన iRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ప్యాడిల్ షిఫ్టర్లు, టచ్-అండ్-టోగుల్ క్లైమేట్ కంట్రోల్ బటన్లు, ఇల్యూమినేటెడ్ 2-స్పోక్ స్టీరింగ్ వీల్, యాంబియంట్ లైటింగ్ కలిసిపోవడంతో లోపలి వాతావరణం మరింత స్టైలిష్‌గా, ప్రీమియంగా అనిపిస్తుంది.

అదనపు ఫీచర్లలో కూడా ఆల్ట్రోజ్ వెనుకబడలేదు. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్‌తో పెద్ద టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫుల్ డిజిటల్ క్లస్టర్ డిస్ప్లే వంటి అంశాలు దీన్ని మరింత ప్రత్యేకంగా నిలిపేస్తాయి. బేస్ వేరియంట్‌లో కొంతవరకు తక్కువ ఫీచర్లు ఉన్నప్పటికీ, టాప్-ఎండ్ మోడళ్లలో మాత్రం పూర్తిగా ప్రీమియం అనుభూతి లభిస్తుంది.

Best Family Budget Car Tata Altroz Price Engine

భద్రత విషయానికి వస్తే, టాటా ఆల్ట్రోజ్ తన క్లాస్‌లోనే అత్యంత సురక్షితమైన కారుగా గుర్తింపు పొందింది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ సాధించడం దీని బలమైన బాడీ స్ట్రక్చర్‌ను, భద్రతా ప్రమాణాలను నిరూపిస్తుంది. దీనిలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ABS EBD, ESP, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉన్నాయి. టాప్ వేరియంట్‌లో అయితే 6 ఎయిర్‌బ్యాగులు, అధునాతన ఎలక్ట్రానిక్ సేఫ్టీ టెక్నాలజీలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, September 5, 2025, 18:26 [IST]
English summary
Best family budget car tata altroz price engine and all details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+