దేశంలో అందరికి ఇష్టమైన 34 కి.మీ మైలేజ్ కారు.. మీ దగ్గరికి రావాలంటే ఎన్ని రోజులు ఆగాల్సిందో తెలుసా?

మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto k10) మధ్యతరగతి ప్రజల మనసు గెలుచుకున్న హ్యాచ్‌బ్యాక్‌గా పేరుగాంచింది. స్టైలిష్ డిజైన్‌తో పాటు, అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు, సౌకర్యవంతమైన ఇంటీరియర్, నమ్మదగిన పనితీరుతో భారతీయ ప్రజల మనసును గెలుచుకుంది. ఇది దశాబ్దాలుగా స్థిరంగా అమ్ముడవుతూ, తన విశ్వసనీయత, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో భారతీయ కుటుంబాల్లో ఒక స్థానం సంపాదించింది. రోజువారీ ప్రయాణాలకైనా, చిన్న కుటుంబ అవసరాలకైనా, ఆల్టో K10 సరైన ఎంపికగా నిలుస్తోంది. ఈ కారుకు డిమాండ్ ఇప్పుడు భారీగానే ఉంది. తాజాగా కార్‌డెకో దేశంలోని వివిధ నగరాల్లో ఆగస్టు నెలలో ఆల్టో K10 వెయిటింగ్ పీరియడ్‌పై ఒక నివేదికను వెల్లడించింది. ఇది దేశంలోని ప్రధాన నగరాలను బట్టి మారుతుంది.

కొత్తగా ఈ కారును కొనుగోలు చేయాలని చూస్తోన్న వినియోగదారులకు ఈ సమాచారం కొంత ఉపయోగపడుతుంది. మన తెలుగు రాష్టాల్లో హైదరాబాద్ తరువాత కోయంబత్తూర్‌, ఇండోర్ ఏరియాల్లో ఈ కారును బుకింగ్ చేసుకున్న వారు తమ చేతుల్లోకి తీసుకోవడానికి దాదాపు నెలమీద ఐదు రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో న్యూఢిల్లీ, నోయిడా, ముంబై, బెంగళూరు, లక్నో, జైపూర్, కోల్‌కతా, ఫరీదాబాద్, చండీగఢ్ 30 రోజులలోపు డెలివరీ చేయబడుతుంది.

Best Family Car Maruti Suzuki Alto K10 August 2025 Waiting Period

ఇంత వేగంగా వాహనం అందించగలగడం వల్ల, ఆల్టో K10 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక రకంగా ముందుగానే పండుగ వచ్చినట్టే అనిపించనుంది. ఇతర కంపెనీలకు చెందిన మోడళ్లు కొన్ని ఇంకా ఎక్కువ వెయింటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో మారుతి సుజుకి ఆల్టో కె10 తొందరగానే కస్టమర్లకు లభించడం బాగా సంతోషించే విషయం. ఆల్టో K10 డెలివరీలు నగరాన్నిబట్టి మారుతున్నాయి.

గురుగ్రామ్, పూణే, ఘజియాబాద్, చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ కోసం సుమారు రెండు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. కానీ థానే, సూరత్‌లలో మాత్రం కారు బుక్ చేసిన వెంటనే, దాదాపు తక్షణమే డెలివరీ పొందే అవకాశం ఉంది. దీంతో, కొన్ని ప్రాంతాల కస్టమర్లు ఓపికగా ఎదురుచూడాల్సి వస్తే, మరికొన్ని ప్రాంతాల వారికి మాత్రం ఆల్టో K10 ఒకే చటుక్కున అందుబాటులోకి వస్తోంది.

Best Family Car Maruti Suzuki Alto K10 August 2025 Waiting Period

ఆల్టో K10 ఒక చిన్న హ్యాచ్‌బ్యాక్ అయినప్పటికీ, దాని ధర, ఫీచర్లు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. పోటీ ధరలో లభిస్తున్న ఈ కారు రూ. 4.23 లక్షల నుండి రూ. 6.21 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇది LXI, VXI, VXI ప్లస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని పవర్‌ట్రెయిన్‌ శక్తివంతంగా ఉంటుంది.

ఇది 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు CNG ఆప్షన్‌లో కూడా అందిస్తుంది. వేరియంట్‌ను బట్టి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. మైలేజీ పరంగా ఆల్టో K10 నిరాశపరచదు. పెట్రోల్ వెర్షన్ 24.90 kmpl వరకు, CNG వెర్షన్ 33.85 km/kg వరకు ఇస్తుంది. 27 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యంతో, ఇది నగర ప్రయాణాలు, లాంగ్ డ్రైవ్స్ వరకు సులభంగా నడిపించుకోగల కారు.

Best Family Car Maruti Suzuki Alto K10 August 2025 Waiting Period

కొత్త ఆల్టో K10 భద్రత విషయంలో కూడా ఎలాంటి రాజీ పడదు. లోపల 6 ఎయిర్‌బ్యాగులు,ABS, ESP, చిన్న పిల్లల భద్రత కోసం వెనుక డోర్ చైల్డ్ లాక్, వెనుకకు వెళ్తూ అడ్డంకులు గుర్తించడంలో సహాయం కోసం రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, అన్ని సీట్లలో గట్టి రక్షణ కోసం 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు వంటివి మొదలగునవి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, August 9, 2025, 7:30 [IST]
English summary
Best family car maruti suzuki alto k10 august 2025 waiting period
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+