రూ.6 లక్షల్లో 34 కి.మీల మైలేజ్ ఇవ్వగల టాప్ మారుతీ కార్లు! పేద-మిడిల్‌క్లాస్ వారికి సరిగ్గా సరిపోతాయ్
కొత్త కారును కొని, ఇంటి ముందు నిలిపి, కుటుంబంతో కలిసి సంతోషంగా ఆ ఫోటోలు దిగడం... ఇది ఎందరో మధ్యతరగతి కుటుంబాల కల. అయితే ఆ కలను నిజం చేయాలంటే, బడ్జెట్‌కి తగ్గ ధరలో, మంచి మైలేజ్ అందించగల మోడల్ ఏది అనేది తెలుసుకోవడం చాలా అవసరం. ప్రధానంగా మారుతీ సుజుకీ కార్లు ఇలాంటి విభాగానికి చెందినవే. ఈ కంపెనీ కార్లు అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలో, మంచి మైలేజ్ ఇవ్వగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న పలు మారుతీ కార్లు బడ్జెట్ వినియోగదారులకు సరిగ్గా సరిపోతాయి. ఇవి దేశంలో పేద, మిడిల్ క్లాస్ వినియోగదారులు సైతం కొనుగోలు చేయగలిగే బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా మారుతీ సుజుకీ స్విఫ్ట్, వ్యాగన్ఆర్, సెలెరియో కార్ల గురించి తెలుసుకుందాం.
Maruti Suzuki Swift: మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఇది పేరుకే హ్యాచ్‌బ్యాక్ కానీ, ప్రతి కుటుంబానికి ఒక పూర్తి అనుభవాన్ని అందించే కారుగా నిలుస్తోంది. ఆకట్టుకునే డిజైన్, స్పోర్టీ లుక్‌కి తోడు, బలమైన పనితీరు దీని విశేషంగా చెప్పుకోవచ్చు. దీని ధర రూ.6.49 లక్షల నుండి రూ.9.64 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

ఇంజిన్ పనితీరుకి అనుగుణంగా 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. దీని మైలేజ్ పెట్రోల్ అయితే 24 కి.మీల వరకు అదే సీఎన్‌జీ వేరియంట్ 33 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. అంటే, ప్రతిరోజు ఆఫీసుకి వెళ్లే వారు, లేదా కుటుంబంతో ప్రయాణాలు చేసే వారు ఫ్యూయల్ ఖర్చుపై భారం లేకుండా ఉపయోగించవచ్చు. ఇందులో ఐదు మంది సౌకర్యవంతంగా కూర్చునే సీటింగ్ అరేంజ్‌మెంట్ ఉంది.
ఈ కారులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా నావిగేషన్, మ్యూజిక్, కాల్స్ అన్నీ సులభంగా నియంత్రించవచ్చు. అదే విధంగా, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా వెహికిల్ సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. సేఫ్టీ కోసం మొత్తం 6 ఎయిర్‌బ్యాగులు ఏర్పాటు చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) తో వాహనం అదుపులోనే ఉంటుంది.

Maruti Suzuki WagonR: మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ బడ్జెట్ కోసం చూస్తున్నవారికి ఇది ఒక మంచి ఆప్షన్. దీని ప్రారంభ ధర రూ.5.79 లక్షల నుండి ప్రారంభమై, టాప్ వేరియంట్లకు రూ.7.62 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వెళ్ళుతుంది. ఎక్కువ మైలేజ్ కోరేవారికి అనువుగా 1-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్, CNG వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. CNG వేరియంట్ అయితే అత్యధికంగా దాదాపు 34 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
పెట్రోల్ వేరియంట్లకు సుమారు 23-25 kmpl వరకు మైలేజ్ ఇస్తాయి. ఇంటీరియర్ ఫీచర్ల విషయంలోనూ వ్యాగన్ఆర్ తక్కువలో ఎక్కువ ఇచ్చే కారు. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా నావిగేషన్, మ్యూజిక్, ఫోన్ కనెక్టివిటీ అన్నీ సులభంగా నిర్వహించవచ్చు. 4-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్‌తో ప్రయాణం ఆసక్తికరంగా మారుతుంది. చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగులు కారులో ఏర్పాటు చేశారు.

Maruti Suzuki Celerio: మారుతీ సుజుకీ సెలెరియో ధర రూ.5.64 లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్లకు రూ.7.37 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణం చేసే వారికి CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్ సుమారు 24-26 కిలోమీటర్ల వరకు, CNG వేరియంట్ దాదాపు 34 km/kg వరకు అందిస్తుంది.


Click it and Unblock the Notifications








