రూ.4.23 లక్షలకే 6 ఎయిర్‌బ్యాగులు, 34 కి.మీ మైలేజ్ కారు! మధ్యతరగతికి మారుతి ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇదే

భారతీయ కార్ల మార్కెట్లో మారుతి సుజుకి (Maruti Suzuki)కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధర, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, మైలేజ్, నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్.. ఇవన్నీ కలిసి ఈ బ్రాండ్‌ను భారతీయుల జీవితంలో ఒక భాగంగా మార్చేశాయి. కొత్తగా తక్కువ ధరలో కారు కొనుగోలు చేయాలని ఆలోచన చేసే వారు మొదటగా మారుతి వైపు అడుగులు వేస్తారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు మారుతి సుజుకి నుండి వచ్చిన ఆల్టో కె10 (Alto K10) అనే హ్యాచ్‌బ్యాక్ మోడల్‌కి మార్కెట్‌లో అనుకూలమైన కారుగా నిలుస్తుంది. తక్కువ బడ్జెట్‌లో కారును కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకి ఇది ఓ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.

ధర పరంగా చిన్నదైనా.. Alto K10లో ఉన్న ఫీచర్లు మాత్రం విస్తృతంగా ఆకట్టుకుంటాయి. అందమైన ఎక్స్‌టీరియర్ డిజైన్, ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, కాంపాక్ట్ స్టైల్‌ ఈ కారును యూత్‌ఫుల్ లుక్‌తో తీసుకురావడంలో సహాయపడుతున్నాయి. ఎంతో మంది మధ్యతరగతి వినియోగదారులకు మొదటి కారుగా మారుతి ఆల్టో సిరీస్ ఓ కలల కారు. ఈ కార్ ధర విషయానికి వస్తే, రూ.4.23 లక్షల నుంచి రూ.6.21 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటోంది.

Maruti Suzuki Alto K10

అంటే, కారుని కొనాలని ఆశపడే చాలా మందికి తమ బడ్జెట్‌ను తాకకుండా తమ కలను సాకారం చేసుకునే అవకాశం Alto K10 ఇస్తోంది. కేవలం ధరకే కాదు, వేరియంట్ల ఎంపికలోనూ ఈ కారు మెరుగైన ఆప్షన్లను కలిగి ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ మూడు ప్రధాన వేరియంట్లలో LXI, VXI, VXI ప్లస్‌లలో అందిస్తోంది. వినియోగదారుల అవసరాలు, ప్రాధాన్యతలు, ఖర్చు సామర్థ్యాన్ని బట్టి వేరియంట్‌ను ఎంపిక చేసుకునే వీలుంది.

ఇంజిన్ పరంగా Alto K10 ప్రాక్టికల్, ఈజీ టు మెంటెయిన్ కార్‌గా నిలుస్తోంది. ఇది రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వస్తోంది, ఒకటి పెట్రోల్ మాన్యువల్ గేర్‌బాక్స్, మరొకటి ఆటో గేర్‌షిఫ్ట్. 1.0 లీటర్ కేపాసిటీ తక్కువ బరువు ఉన్న K10C ఇంజిన్‌తో, డ్రైవింగ్ అనుభవం మృదువుగా, సమర్థవంతంగా ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే, మారుతి కార్లకు ఉన్న గుడ్ విల్‌ను కొనసాగిస్తూ, Alto K10 మంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తోంది.

Best Mileage Car Maruti Suzuki Alto K10

ఈ హ్యాచ్‌బ్యాక్‌ లో 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వినియోగదారుల ప్రధాన ఆప్షన్‌గా అందుబాటులో ఉంది. ఇది 65.71 PS శక్తిని, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ డ్రైవింగ్ ఇష్టపడే వారి కోసం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, అలాగే సిటీ రైడింగ్‌కి మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని కోరుకునే వారికి 5-స్పీడ్ ఆటోమేటిక్ (AGS) గేర్‌బాక్స్ ఉంది. మైలేజ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్.

దీని పెట్రోల్ వేరియంట్ 24.90 కి.మీ/లీటర్ మైలేజ్ అందించగలదట. రోజువారీ ప్రయాణాల కోసం ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇంకా ఫ్యూయల్ ఖర్చులను మరింత తగ్గించాలనుకునే వారికి CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. అదే 1.0 లీటర్ ఇంజిన్ CNG పై 56.70 PS శక్తి, 82.1 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. ఇది 33.85 కి.మీ మైలేజ్ ఇవ్వగలదు.

Maruti Suzuki Alto K10 Mileage

ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, సేఫ్టీ ఫీచర్లు. ఐదు మందితో కూడిన కుటుంబం హాయిగా ప్రయాణించేందుకు ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టాబిలిటీ ప్రోగ్రామ్ (ESP), 3-పాయింట్ సీట్ బెల్టులు వంటి అవసరమైన అన్ని భద్రతా సదుపాయాలు ఉన్నాయి. ఇంటీరియర్‌లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ , పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోలు వంటి అనేక సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 30, 2025, 12:00 [IST]
English summary
Best mileage car maruti suzuki alto k10 hatchback price and all top things
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+