మీకు రూ.10 లక్షల బడ్జెట్‌లో అదిరిపోయే suv కావాలా? అయితే ట్రెండ్ సెట్టర్‌గా ఉన్న ఈ కార్లపై లుక్కేయండి

ఇప్పుడు కారుల ఎంపికల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రజలు తక్కువ సైజు సెడాన్ల వైపు మొగ్గు చూపేవారు. అందుబాటులో ఉండే ధర, మైలేజ్‌ను ప్రధానంగా పరిగణనలోకి తీసుకునేవారు. అయితే, ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. స్టైల్, రోడ్ ప్రెజెన్స్, ఇంటీరియర్ స్థలం వంటి అంశాలను ప్రజలు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలో ఇది SUVల విపరీతమైన డిమాండ్‌కు దారితీసింది. పొడవైన, ఎత్తైన SUVలు ఇప్పుడు ప్రతి కుటుంబం కలల కారు లాంటి స్థాయికి చేరుకున్నాయి. ఇంటీరియర్ స్పేస్, హైడ్ డ్రైవింగ్ పొజిషన్, బూట్ స్పేస్,సురక్షితంగా ఉండే ఫీల్ వంటి అంశాలు SUVల వైపు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. దీంతో కంపెనీలు కొత్త SUVలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం, రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో ఆకర్షణీయమైన SUVలను ఈ కథనంలో ఇవ్వడం జరిగింది.

Nissan Magnite: నిస్సాన్‌కు చెందిన మాగ్నైట్ SUV సెగ్మెంట్‌లో ఆకట్టుకుంటుంది. నిస్సాన్ సంస్థ ప్రస్తుతానికి విక్రయిస్తున్న ఏకైక SUVగా నిలిచింది. 2020లో ప్రవేశపెట్టినప్పటి నుంచే, మాగ్నైట్ తన స్టైలిష్ డిజైన్, ఆకర్షణీయమైన ధర, ఫీచర్లతో వినియోగదారుల మనసు దోచుకుంది. ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ.6.14 లక్షల నుంచి రూ.11.76 లక్షల వరకు ఉంటుంది. అయితే, రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ మొదలైన వాటితో ఆన్-రోడ్ ధర మరింత పెరగవచ్చు.

Best Suv Cars Under Rs 10 Lakh Nissan Magnite

మాగ్నైట్ రెండు రకాల పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లను 1-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్,1-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్‌తో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఇది రెట్రోఫిట్‌మెంట్ సీఎన్జీలో కూడా ఉంది. గేర్‌బాక్స్ ఎంపికల విషయంలోనూ మాగ్నైట్ వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టే 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ AMT (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్), అలాగే స్మూత్ CVT లో లభిస్తుంది. ఇది 17 నుండి 20 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది.

Hyundai Exter: హ్యుందాయ్ స్టైలిష్ మైక్రో-SUV ఎక్స్‌టర్. చిన్న కారు సైజులో SUV స్టైల్‌ను కోరుకునే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కారు, మార్కెట్లోకి వచ్చిన మొదటి నాటి నుంచే మంచి ఆదరణను పొందుతోంది. ఈ కారులో 1.2-లీటర్ నాచురల్ー ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇది డేలీ యూజ్‌కి మైలేజ్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది.

Best Suv Cars Under Rs 10 Lakh Hyundai Exter

ధర విషయంలో చూస్తే, పెట్రోల్ వేరియంట్‌ ధరలు రూ. 7.43 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. CNG వేరియంట్‌ కోసం ధరలు రూ. 10.16 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద మొదలవుతున్నాయి. ఎస్, ఎస్ స్మార్ట్, EX HY CNG DUO వంటి పలు ఇతర వేరియంట్‌లలో ఈ కారును ఎంచుకోవచ్చు. ప్రతి వేరియంట్‌కి తగిన ఫీచర్లు, ఫ్యూయల్ కెపాసిటీ, డ్రైవింగ్ అనుభవం ఉంటాయి.

Kia Sonet: కియా సోనెట్ ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, ప్రీమియం ఫీచర్లతో కూడిన కొరియన్ బ్రాండ్ సబ్-కాంపాక్ట్ SUV. ఇది రూ.10 లక్షల రేంజ్‌లో నేచురల్ పెట్రోల్, టర్బో పెట్రోల్ వేరియంట్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్లను బట్టి ధర మరిత పెరిగే అవకాశం ఉంది.

Best Suv Cars Under Rs 10 Lakh Kia Sonet

More from DriveSpark

Article Published On: Thursday, August 7, 2025, 7:30 [IST]
English summary
Best suv cars under rs 10 lakh nissan magnite hyundai exter kia sonet details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+