రూ.10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ ఫ్యామిలీ కార్లు! మధ్యతరగతి వారికి స్టైల్, భద్రత, మైలేజ్ అన్నింటి పరంగా టాప్!
భారతదేశంలో కార్ల కొనుగోలు అనేది కేవలం ఓ వాహనం తీసుకోవడం మాత్రమే కాదు, అది ఆ కుటుంబం ఆర్ధిక స్థితిని, అవసరాలను ప్రతిబింబించే ఒక కీలక నిర్ణయం. ఎక్కువ మంది కొనుగోలుదారులు తక్కువ ధరలో మంచి మైలేజ్, మెరుగైన పనితీరును అందించే వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రధానంగా మధ్యతరగతి వారు ప్రత్యేకించి రూ.10 లక్షల బడ్జెట్‌లో మంచి ఫీచర్లు, మైలేజ్, భద్రతా ప్రమాణాలు ఉండే కారును ఎంచుకోవాలనే లక్ష్యం పెట్టుకుంటారు. ఈ ఆగస్టు 2025లో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన మూడు కార్లు వాటి ధర, లక్షణాలు, ప్రాక్టికాలిటీ విషయంలో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. వాటి గురించిన వివరాలను ఈ కింది కథనంలో అందించడం జరిగింది.
Tata Punch: టాటా మోటార్స్ రూపొందించిన పంచ్ కార్ 2021లో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ప్రారంభించిన తక్కువ సమయంలోనే ఇది వినియోగదారుల నుంచి విశేష స్పందన పొందింది. ముఖ్యంగా ఫస్ట్-టైమ్ కారు కొనుగోలుదారులకు, సిటీ డ్రైవింగ్‌కి అనువైన SUV లుక్‌ను కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలిచింది. ఈ కారు ధర రూ.6.20 లక్షల ప్రారంభ ధర నుండి, టాప్-ఎండ్ వేరియంట్లకు రూ.10.17 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంది.

పెట్రోల్ కాకుండా సి.ఎన్.జీ వేరియంట్‌లోనూ ఇది లభిస్తుంది, దీని వల్ల ఫ్యూయల్ ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మరింత ఆకర్షణీయంగా మారింది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటోమేటిక్ AMT గేర్‌బాక్స్ ఎంపిక కూడా ఇందులో అందుబాటులో ఉంది, ఇది డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది. ఇది సేఫ్టీ పరంగా అత్యుత్తమైన కారు. మధ్యతరగతి వారికి ఇది బెస్ట్ మోడల్.
Maruti Baleno: మారుతి సుజుకి బాలెనో గత దశాబ్దంగా భారత ఆటోమొబైల్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ మోడల్‌ను డబ్బుకు మంచి విలువ కలిగిన కారుగా వినియోగదారులు గుర్తించారు. మొదటిసారి కారును కొనాలనుకునే వారికి, రోజువారీ ప్రయాణానికి అనువైన మార్గాన్ని కోరుకునే వారికి ఇది ఓ నమ్మకమైన ఎంపికగా నిలిచింది. ఇంటీరియర్ డిజైన్, స్మార్ట్ టెక్నాలజీ, మైలేజ్, భద్రత, డ్రైవింగ్ కంఫర్ట్ అన్ని దీనిలో ఉన్నాయి.

ఇది నాలుగు వేరియంట్లలో సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫాలలో లభిస్తుంది. ప్రతి వేరియంట్‌కి తనదైన ప్రత్యేకత ఉంది. బేస్ మోడల్ సిగ్మా ధర రూ. 6.74 లక్షలుగా ఉండగా, టాప్ వేరియంట్ అయిన ఆల్ఫా ధర రూ. 9.96 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్ ధరలు). ఈ ధరల పరిధిలో మరింత ఫీచర్లు, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, స్టైలిష్ డిజైన్ వంటి అంశాలతో ఇది తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ప్యాకేజ్‌గా నిలుస్తోంది.
Maruti Swift: భారతదేశంలో మారుతి స్విఫ్ట్ పేరు వినగానే సాధారణ ప్రజలకు నమ్మకమైనది, ఫ్యూయల్ ఎఫిషియెంట్, స్టైలిష్, కుటుంబానికి చక్కటి ఎంపిక. 2005లో మొదటగా పరిచయమైనప్పటి నుంచి ఈ హాచ్‌బ్యాక్ తన యాక్టివ్ డిజైన్, మంచి పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చుతో మార్కెట్లో ఎంతో మంది వినియోగదారుల మనసు దోచుకుంది. ఈ కారు ప్రస్తుతం రూ. 6.49 లక్షల ప్రారంభ ధర నుండి రూ. 9.50 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు లభిస్తుంది.

పెట్రోల్ ఇంజిన్‌తో మాన్యువల్, ఆటోమేటిక్(AMT) గేర్‌బాక్స్‌తో వినియోగదారులు తమ అవసరాలకు తగిన వేరియంట్ ఎంచుకోవచ్చు. అందులోను LXI, VXI, VXI (O), ZXI, ZXI+ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత పరంగా కూడా స్విఫ్ట్ ఇప్పుడు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో లభిస్తుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే 25.75 కి.మీ వరకు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది సిటీ డ్రైవ్, హైవే డ్రైవ్ రెండింటికీ అనువైనదిగా చేస్తోంది.


Click it and Unblock the Notifications








