వర్షం వస్తోందని టెన్షన్ లేదు.. నీటి సునామి వచ్చినా సేఫ్.. బురద మట్టిలో అయిన దూసుకుపోయే కార్లు

వర్షకాలం వచ్చిందంటే చాలు కార్లతో బయటికి వెళ్లాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. రోడ్లు జారిపోవడం, ట్రాఫిక్ సమస్యలు, మట్టి మార్గాల్లో వాహనం నడపడం వంటి వాటి వల్ల వర్షకాలం కార్లను బయటికి తీయాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆఫీస్ లేదా ఇంటికి వెళ్లడానికి లేదంటే ఇతర అవసరాలకు కారును వర్షపు నీళ్లలో డ్రైవ్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. దీంతో ఇటీవల కాలంలో వర్షంలో కూడా తిరగడానికి కంఫర్ట్‌గా ఉండే మోడళ్లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, శక్తివంతమైన ఇంజిన్ పనితీరు వంటి అంశాల ఆధారంగా చేసుకుని మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటిని కొనడానికి కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి వాతవరణ పరిస్థితుల్లో ఎస్‌యూవీ (SUV)లు ఎంతగానో ఉపయోగపడుతాయి. కొన్ని ప్రధాన SUVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Mahindra Thar Roxx: ఆఫ్‌రోడ్ కింగ్ "మహీంద్రా థార్ రాక్స్" SUV వర్షపు చినుకులు పడుతుంటే, మనకు కావాల్సింది సురక్షితమైన ప్రయాణం అందిస్తుంది. తికూల వాతావరణంలోనూ, దారులు వంకరగా ఉన్నా, నీటితో నిండిన వీధుల్లోనూ ముందుకు సాగే శక్తిమంతమైన పెర్ఫామెన్స్ ఇస్తుంది. థార్ రాక్స్‌కి 225 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల, అది మట్టి రోడ్లు అయినా, వరదలతో ముంచెత్తే గల్లీలు అయినా, నిదానంగా, సురక్షితంగా ముందుకెళ్లగలదు.

Rainy Season Car

అందుకే ఇది వర్షాకాలంలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ SUV రెండు శక్తివంతమైన ఇంజిన్లలో లభిస్తుంది, ఒకటి 2.0 లీటర్ టర్బో పెట్రోల్ వెర్షన్, మరొకటి 2.0 లీటర్ డీజిల్ వేరియంట్. 12 నుండి 15.2 కిలోమీటర్లు లీటరుకు మైలేజీని ఇస్తాయి. పర్వతాలు, పల్లెలు , ఎంత దూరమైనా ఈజీగా వెళ్తుంది. ఈ కారును రూ.12.99 లక్షల ప్రారంభ ధరతో, గరిష్టంగా రూ. 23.39 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు కొనుగోలు చేయవచ్చు.

Maruti Suzuki Jimny:మారుతీ సుజుకీ జిమ్నీ SUV ధర రూ. 12.76 లక్షల నుంచి రూ. 14.96 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. దీనికి అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. దీంతో నీటితో నిండిన వీధుల్లోనూ సులభంగా ప్రయాణిస్తుంది. వర్షకాలంలో ఇది బెస్ట్ కారు డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. మహీంద్రా థార్‌కు పోటీగా ఈ మోడల్ అమ్మకానికి అందుబాటులో ఉంది. పెర్ఫామెన్స్ పరంగా కస్టమర్లు నమ్మకాన్ని నిలబెడుతుంది.

Monsoon Cars In India

మారుతీ సుజుకీ జిమ్నీ SUV 1.5-లీ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్/4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇది దాదాపు 16 నుండి 17 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. లేటెస్ట్ ఫీచర్స్‌కు ఎలాంటి కొదవ లేదు. ప్రయాణికులను ఆకట్టుకునే డజన్ల కొద్ది అత్యాధునిక ఫీచర్స్‌ను ఈ కారులో అందించారు. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ వంటి పలు అంశాలను కలిగి ఉంటుంది.

Force Gurkha: వర్షంలో రోడ్లు నీటితో నిండి, దారి కనిపించని స్థితి తలెత్తినప్పుడు, మనకి కావాల్సింది ఒక బలమైన, నమ్మకమైన వాహనం. అలాంటి సమయంలో "ఫోర్స్ గూర్ఖా" బాగా అనుకూలంగా ఉంటుంది. ఫోర్స్ గూర్ఖా, రూపంలో గట్టిగా ఉండటంతో పాటు, లోపల అధునాతన సౌకర్యాలతో కూడా ఆకట్టుకుంటుంది. దీనికి 233 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో, తక్కువ ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిలోనూ దూసుకుపోతుంది.

Best Three Suvs For Rainy Season

ఇండియన్ ఆర్మీలో కూడా ఫోర్స్ గూర్ఖాను వాడుతుంటారు. నిజంగా ఇది వర్షాకాలానికి, ఆఫ్-రోడ్ ప్రయాణాల కోసం రూపొందించిన కారు. ధర పరంగా చూస్తే, ఫోరూ. 16.75 లక్షల నుండి రూ. 18 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. భద్రత విషయంలో, ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి ఉంది. 2.6 లీటర్ డీజిల్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 27, 2025, 7:30 [IST]
English summary
Best three suvs for rainy season mahindra thar roxx force gurkha maruti jimny details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+