Auto Expo 2025: ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మారుమోగుతుంది.. సర్వాంగ సుందరంగా సిద్ధమైన భారత మండపం

దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో అట్టహసంగా ప్రారంభం కాబోతుంది. జనవరి 17 నుంచి మొదలుకు కానున్న ఈ ఈవెంట్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. దీని కోసం ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. జీ20 సమ్మిట్ తర్వాత ప్రసిద్ధి చెందిన భారత్ మండపంలో ఈ ఆటో ఎక్స్‌పో ఈవెంట్ 22 జనవరి 2025 వరకు జరుగుతుంది. దీనిలో వాహన తయారీ కంపెనీలు పెద్ద ఎత్తున తమ మోడళ్లను ప్రదర్శించబోతున్నాయి. దీనిలో పాల్గొనే కంపెనీలకు చెందిన బృందాలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. దేశీయ కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు తమ ప్రదర్శనలతో భారత్ మండపాన్ని ఉర్రుతలుగించడానికి సిద్ధం అయ్యాయి.

ఈ ఈవెంట్‌కు దాదాపు ఏకంగా 5 లక్షల మందికి పైగా వస్తారని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వాహన మార్కెట్‌ను కలిగి ఉంది. రవాణా వాహనాల నుంచి మొదలుకుని, ప్రయాణికుల వాహనాల వరకు అన్నింటిలో కూడా అంతర్జాతీయ మార్కెట్‌కు తీసిపోని విధంగా ఇతర దేశాల కంటే భారత్‌లో వాహన రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో ప్రపంచ దేశాల చూపు మన వైపు పడింది.

Bharat Mobility Global Expo 2025

అందుకే ఇక్కడ పోటీ పడి మరీ తమ ఉత్పత్తులను విడుదల చేస్తున్నారు. కేంద్రం భారత్‌ను ఆటోమొబల్ హాబ్‌గా మార్చడానికి కృత నిశ్చయం తీసుకుంది. దీనికోసం వాహన తయారీ కంపెనీ ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 కార్యక్రమం ద్వారా దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేయడానికి భారత్ అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ ఈవెంట్‌లో ప్రముఖ 4 వీలర్ , టూవీలర్ తయారీదారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

ఈ కార్యక్రమంలో మారుతీ సుజుకీ, టయోటా, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, JSW MG మోటార్ ఇండియా, వోక్స్‌వ్యాగన్, స్కోడా వంటి కార్ల తయారీ కంపెనీలు తమ రాబోయే మోడళ్లను ప్రదర్శించబోతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తు అవసరాల కోసం అధునాతన ఫీచర్లు, అదిరిపోయే డిజైన్లు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయబోతున్నారు. ఇవే కాకుండా ఇంకా చాలా ఫోర్ వీలర్ కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శిస్తాయి.

Bharat Mobility Global Expo 2025 Starts From January 17th

దేశీయ తయారీదారులే కాకుండా అంతర్జాతీయంగా మంచి మార్కెట్ కలిగిన కార్ల కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను భారత్‌తో పాటు ప్రపంచానికి కూడా పరిచయం బోతున్నారు. చైనీస్ ఎలక్ట్రిక్ తయారీ కంపెనీ BYD,వియత్నామీస్ EV-బ్రాండ్ Winfast, BMW, Audi, Mercedes-Benz వంటి పలు కంపెనీలు కూడా తమ కార్లను ఈ ఈవెంట్‌లో విడుదల చేయబోతున్నారు. అలాగే కొత్త వాణిజ్య వాహనాలు కూడా లాంచ్ కాబోతున్నాయి.

టూవీలర్ తయారీదారులలో కూడా హోండా స్కూటర్స్, హీరో మోటోకార్ప్, ఏథర్ ఎనర్జీ, బీఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్, బజాజ్ ఆటో వంటి పలు కంపెనీలు తమ కొత్త బైక్స్‌, స్కూటర్లను ప్రదర్శించబోతున్నాయి. ముఖ్యంగా ఇండియాలో ఎలక్ట్రిక్ టూవీలర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈ సెగ్మెంట్‌లో కొత్త బైక్స్, స్కూటర్తు లాంచ్ కాబోతున్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, January 16, 2025, 17:49 [IST]
English summary
Bharat mobility global expo 2025 starts from january 17th in delhi all details check here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+