యాక్సిడెంట్‌లో కుటుంబాన్ని రక్షించే టాప్ 5-స్టార్ రేటింగ్ కార్లు.. కుటుంబం సేఫ్ – మీ పెట్టుబడి సేఫ్!

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొన్ని సంవత్సరాల్లో ఒక భారీ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ముందెప్పుడో కారు కొనుగోలు అంటే మైలేజ్ ఎంత వస్తుంది, ధర ఎంత తక్కువగా ఉంటుంది అనేదే ప్రధాన ప్రశ్న. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారతీయ కస్టమర్లు కార్ల బాడీ క్వాలిటీ, బిల్డ్ స్ట్రెంగ్త్, భద్రత, ఇవన్నింటినీ మొదటి ప్రాధాన్యంగా చూస్తున్నారు. కార్ల కంపెనీలు కూడా ఈ మార్పును గ్రహించి మెరుగైన బాడీ స్ట్రక్చర్ స్టాండర్డ్‌గా ఇవ్వడం మొదలు పెట్టాయి. ఇండియాలో కార్ల నిర్మాణ నాణ్యతను భారత్ NCAP (భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) క్రాష్ టెస్ట్ చేయడం ద్వారా కొనుగోలుదారులకు కారు ఎంత సురక్షితమైనదో స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది. ఈ క్రమంలో భారత్ NCAPలో మంచి రేటింగ్ సాధించిన కొన్ని కార్ల గురించి ఈ కథనంలో.

Maruti Suzuki Invicto: కొత్త ఇన్విక్టో ధర రూ. 24.97 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ. 28.70 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ధరకు తగ్గట్లే ఈ మోడల్ అందించే నాణ్యత, ఫీచర్లు, భద్రత ఇతర వాహనాలకు మంచి పోటీని ఇస్తున్నాయి. ఇది భారత్ NCAP నిర్వహించిన కఠినమైన సేఫ్టీ టెస్టుల్లో ఇన్విక్టో ఆశ్చర్యకరమైన ప్రదర్శన చేసింది.

Bharat Ncap 5 Star Rated Cars Invicto Altroz And Innova Hycross Details

వయోజన భద్రత (Adult Protection) 32లో 30.43 పాయింట్లు, పిల్లల భద్రత (Child Protection) 49లో 45 పాయింట్లు సాధించింది. ఈ స్కోర్లు ఈ SUV నిర్మాణ బలాన్ని, సేఫ్టీ ఇంజినీరింగ్‌ను, ఆసలైన ప్రొటక్షన్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇవన్నీ కలిపి, ఇన్విక్టోకు భారత్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇది ఈ తరగతిలో అత్యంత నమ్మదగిన కారు అని చెప్పడానికి సరిపోతుంది.

Tata Altroz: టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటిగా గుర్తించబడుతోంది. ధర విషయానికి వస్తే, కొత్త ఆల్ట్రోజ్ రూ. 6.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ. 10.15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంది. ధరకు తగ్గట్లు దీని బిల్డ్ క్వాలిటీ, ఫీచర్లు, రోడ్ ప్రెజెన్స్ మరింత ఆకర్షణగా ఉంటాయి.

Bharat Ncap 5 Star Rated Cars Invicto Altroz And Innova Hycross Details

భద్రతా ప్రమాణాల్లో ఆల్ట్రోజ్ అసలు రాజీపడలేదు. భారత్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో, ఆల్ట్రోజ్ వయోజన భద్రతలో 32లో 29.65 పాయింట్లు, పిల్లల భద్రతకు సంబంధించి 49లో 44.90 పాయింట్లు సాధించింది. ఇలాంటి అత్యుత్తమ స్కోర్లతో, ఆల్ట్రోజ్‌కు మొత్తం మీద 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. టాటా ఆల్ట్రోజ్ తన సెగ్మెంట్‌లోనే కాదు, ఒక స్థాయి పైకి ఉన్న కార్లతో కూడా సేఫ్టీ పరంగా గట్టి పోటీ ఇస్తోంది.

Toyota Innova Hycross: టయోటా ఇన్నోవా హైక్రాస్ భారత మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన MPV‌లలో ఒకటిగా నిలుస్తోంది. భారత్ NCAP రేటింగ్ పొందిన తొలి MPV అనే ప్రత్యేక గుర్తింపును కూడా ఇది అందుకుంది. ధరల విషయానికి వస్తే, కొత్త ఇన్నోవా హైక్రాస్ రూ. 18.05 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ. 31.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంది.

Bharat Ncap 5 Star Rated Cars Invicto Altroz And Innova Hycross Details

ప్రీమియం డిజైన్, పెద్ద కేబిన్ స్పేస్, హైబ్రిడ్ టెక్నాలజీ వంటి అంశాలతో ఇది కుటుంబాలు మరియు లాంగ్ డ్రైవ్ ప్రేమికులకే కాకుండా, కమర్షియల్ యూజర్లకు కూడా బెస్ట్ ఎంపికగా మారింది. భద్రతా ప్రమాణాల్లో భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో ఈ MPV అద్భుతమైన స్కోర్లు సాధించింది. వయోజన రక్షణలో 32లో 30.47 పాయింట్లు, పిల్లల రక్షణలో 49లో 45 పాయింట్లు సాధించింది.

More from DriveSpark

Article Published On: Saturday, November 22, 2025, 17:18 [IST]
English summary
Bharat ncap 5 star rated cars invicto altroz and innova hycross details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+