ఈ వినాయక చవితికి టయోటా కారు తెచ్చుకోండి.. ఆ మోడల్స్ పై ఏకంగా రూ.1.05లక్షల డిస్కౌంట్

టాటా కంపెనీ కార్లపై ఆగస్టు 2025లో భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. హ్యుందాయ్ వెన్యూ, టాటా టిగోర్, టాటా సఫారీ వంటి మోడళ్లపై కంపెనీలు బంపర్ ఆఫర్లు అందిస్తున్నాయి. అయితే, ఇప్పుడు టయోటా కూడా తన కార్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. టయోటా గ్లాంజా, హైరైడర్, టైసర్, ఇన్నోవా, రూమియన్ వంటి మోడళ్లపై ఏకంగా రూ. 1.05 లక్షల వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో వివరంగా తెలుసుకుందాం.

టయోటా కంపెనీ ఆగస్టు 2025లో తమ కార్ల అమ్మకాలను పెంచడానికి గ్లాంజా, హైరైడర్, ఇన్నోవా, టైసర్, రూమియన్ వంటి మోడళ్లపై భారీ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లలో నగదు తగ్గింపు, ఎక్స్‌ఛేంజ్/స్క్రాప్ బోనస్, లాయల్టీ బోనస్, ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.

Big Discounts on 5 Toyota Cars This August Save Up to Rs 1 05 Lakh

టయోటా గ్లాంజా : ఈ కారు బేస్ మోడల్ EMT మినహా మిగతా అన్ని వేరియంట్లపై మొత్తం రూ. 1,05,300 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ. 45,000 నగదు తగ్గింపు, రూ. 40,000 ఎక్స్‌ఛేంజ్/స్క్రాప్ బోనస్, రూ. 13,800 విలువైన 5 సంవత్సరాల వారంటీ, రూ. 6,500 కార్పొరేట్/ప్రభుత్వ/గ్రామీణ ప్రయోజనాలు ఉన్నాయి.

టయోటా హైరైడర్ : ఈ కారుపై రూ. 28,000 నగదు తగ్గింపు, రూ. 40,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 23,600 విలువైన ఎక్సటెండెడ్ వారంటీ, రూ. 6,500 కార్పొరేట్ ప్రయోజనాలు లభిస్తున్నాయి. హైరైడర్ E నియో డ్రైవ్ G, V వేరియంట్లపై రూ. 67,000, S వేరియంట్‌పై రూ. 65,600, ఎంట్రీ లెవల్ E నియో వేరియంట్‌పై రూ. 80,600 వరకు లాయల్టీ బోనస్ ఉంది.

Big Discounts on 5 Toyota Cars This August Save Up to Rs 1 05 Lakh

టయోటా ఇన్నోవా : టయోటా ఈ ప్రముఖ మోడల్‌పై రూ. 15,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 44,400 విలువైన యాక్సెసరీస్ కిట్ లభిస్తోంది. దీంతో మొత్తం రూ. 59,400 వరకు ఆదా చేసుకోవచ్చు.

టయోటా టైసర్ : ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ 1.0 లీటర్ టర్బో వేరియంట్‌పై మొత్తం రూ. 50,900 వరకు లాయల్టీ బోనస్ లభిస్తుంది. ఇందులో రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్స్‌ఛేంజ్/స్క్రాప్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్, రూ. 17,900 విలువైన పొడిగించిన వారంటీ ఉన్నాయి.

Big Discounts on 5 Toyota Cars This August Save Up to Rs 1 05 Lakh

టయోటా రూమియన్ : ఈ కారు పెట్రోల్ వేరియంట్‌పై రూ. 20,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది. అయితే, సీఎన్‌జీ వేరియంట్‌పై ప్రస్తుతం ఎలాంటి ఆఫర్లు లేవు.

టయోటా మాత్రమే కాకుండా టాటా మోటార్స్ కూడా ఆగస్టు నెలలో తమ కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. టాటా టియాగో, పంచ్, కర్వ్, హారియర్, సఫారి వంటి మోడళ్లపై రూ. 1.05 లక్షల వరకు బంపర్ ఆఫర్లు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 12, 2025, 14:30 [IST]
English summary
Big discounts on 5 toyota cars this august save up to rs 1 05 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+