ఆలోచించకండి.. పైసా వసూల్ ఆఫర్.. కొనేందుకు ఇదే సరైన సమయం.. మారుతి ఫ్రాంక్స్‌పై భారీ తగ్గింపు
కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యేక సందర్భాల్లో ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. తాజాగా, మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ ఫ్రాంక్స్‌పై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఇప్పటికే నెక్సా షోరూమ్‌లలో టాప్ సెల్లర్‌గా దూసుకుపోతున్న ఈ క్రాస్‌ఓవర్‌పై రూ. లక్ష వరకు ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ ధరలో స్టైలిష్ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే! మారుతి సుజుకి అందిస్తున్న ఈ బంపర్ ఆఫర్ వివరాలు తెలుసుకుందాం.
మారుతి సుజుకి తన నెక్‌సా షోరూమ్‌లలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటైన ఫ్రాంక్స్‌పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇదివరకు ఉన్న క్రాస్‌ఓవర్ ఆలోచనలను తిరగరాస్తూ.. బాలెనో, బ్రెజా మధ్య స్థానం సంపాదించుకున్న ఈ మోడల్‌ను కొనుగోలుదారులు చాలా త్వరగా ఆదరించారు.

దీని డిజైన్‌లోని ప్రత్యేకతే అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మారుతి సుజుకి ఫ్రాంక్స్‌పై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. అంటే, ఇప్పుడు కొంటే మీ జేబుకు పెద్దగా చిల్లు పడదని చెప్పవచ్చు. ఫ్రాంక్స్‌పై మారుతి సుజుకి అందిస్తున్న ఆఫర్ల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
గ్రాండ్ విటారాను గుర్తుచేసే ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ డీఆర్ఎల్‌లతో కూడిన ఎల్ఈడీ మల్టీ-రిఫ్లెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, దృఢమైన రూపాన్నిచ్చే చంకీ బాడీ క్లాడింగ్, 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, కూపే తరహాలో వెనుకకు వాలి ఉండే రియర్ గ్లాస్ ఏరియా వంటివి ఫ్రాంక్స్‌కు ప్రత్యేకమైన అందాన్నిస్తాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లోని టర్బో-పెట్రోల్ వేరియంట్‌లపై ఈ ఆఫర్లను ప్రకటించింది. వీటిపై రూ. 93,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో రూ. 35,000 వరకు క్యాష్ డిస్కౌంట్, అలాగే రూ. 43,000 విలువైన వెలాసిటీ యాక్సెసరీ కిట్‌లో సీట్ కవర్లు, ఫ్లోర్ మ్యాట్‌లు మరిన్ని ఉన్నాయి. అదనంగా, రూ. 15,000 వరకు స్క్రాపేజ్ బోనస్ లేదా రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.
మీరు ఏప్రిల్ నెలలో కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, వెంటనే షోరూమ్‌కు వెళ్లండి. అయితే, ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆఫర్‌లు ఒక్కో షోరూమ్‌ను బట్టి మారవచ్చు. ఇంటీరియర్‌లోకి వెళితే, మారుతి కొత్త తరం మోడళ్లలో కనిపించే అదే శైలి ఈ క్రాస్‌ఓవర్ కూపే స్టైల్ ఎస్‌యూవీలోనూ కనిపిస్తుంది.

9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఇంజన్ స్టార్ట్-స్టాప్, కీ ఎంట్రీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు, రియర్ డిఫాగర్ వంటి అనేక ఫీచర్లు ఈ వాహనంలో ఉన్నాయి.
మారుతి కార్లు సేఫ్టీ విషయంలో అంతంతమాత్రంగానే ఉంటాయని చెప్పేవారికి ఫ్రాంక్స్‌ను ప్రత్యక్షంగా చూస్తే సగం అపోహలు తొలగిపోతాయి. HEARTECT ప్లాట్‌ఫామ్‌పై నిర్మించినప్పటికీ, సురక్షితమైన బాడీ షెల్, దృఢమైన నిర్మాణాన్ని కంపెనీ చేసిందని చెబుతోంది.

మారుతి ఫ్రాంక్స్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్,1.0-లీటర్ టర్బో-పెట్రోల్ బూస్టర్‌జెట్ ఇంజన్ ఆప్షన్‌లతో మార్కెట్లో లభిస్తుంది. మొదటిది నేరుగా బాలెనో నుంచి తీసుకుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడిన ఈ ఇంజన్ 88 bhp పవర్, 113 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదని మారుతి సుజుకి పేర్కొంది.
ఫ్రాంక్స్‌లోని బూస్టర్‌జెట్ ఇంజన్ విషయానికి వస్తే.. ఇది 99 bhp శక్తిని, 147.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేశారు. టర్బో-పెట్రోల్‌లో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది. హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యూవీ రెండింటి లక్షణాలను కలిగి ఉన్న ఈ వాహనం ప్రస్తుతం టాటా నెక్సాన్ కంటే ఎక్కువగా అమ్ముడవుతోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








