వర్షాకాలానికి కార్ చెక్‌అప్ ఫ్రీగా చెయ్యాలంటే ఈ అవకాశాన్ని వదులుకోకండి! బంపర్ ఆఫర్ ఇస్తోన్నకంపెనీ

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ (BMW) భారతదేశంలో వర్షాకాలానికి సిద్ధమవుతోంది. తన కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి BMW మాన్‌సూన్ సర్వీస్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఇది జూన్ 15 నుండి నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా ఉన్న తన అన్ని అధీకృత డీలర్ వర్క్‌షాప్‌లలో అందుబాటులో ఉంటుంది. వర్షాకాలంలో మరింత సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా దీన్ని తీసుకొచ్చింది. ఈ మాన్‌సూన్ సర్వీస్ ప్రచారం కేవలం ఒక రొటీన్ సర్వీసింగ్ కార్యక్రమం మాత్రమే కాదు. కారు నిర్వహణ, నిరంతర సేవల అవసరం, వర్షాకాల ప్రమాదాలు, వాటి పరిష్కారాలపై వినియోగదారులకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఇది ఒక మంచి అవకాశం.

వర్షపు కాలంలో కారు పనితీరు ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్రేకింగ్ వ్యవస్థ, టైర్ల స్థితి, విండ్షీల్డ్ వైపర్లు, లైటింగ్ సిస్టమ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో, BMW తన వినియోగదారులకు ఉచిత వాహన చెకింగ్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. సాంకేతిక నిపుణుల ద్వారా కారును పూర్తిగా పరీక్షించి, అవసరమైన సేవలపై సూచనలు ఇవ్వబడతాయి.

Bmw Service Campaign 2025

BMW మాన్‌సూన్ సర్వీస్ క్యాంపెయిన్ ద్వారా ఉచితంగా అందించే సేవల గురించి చూసినట్లయితే వర్షాకాలంలో కారు ప్రయాణం సురక్షితంగా ఉండేందుకు అవసరమైన ప్రతీ అంశాన్ని ఈ తనిఖీ ద్వారా పరిశీలిస్తారు. కారును వర్షాకాలానికి సిద్ధంగా ఉంచడంలో ముందుగా వైపర్ వ్యవస్థ తనిఖీకి వస్తుంది. ముందునీ వెనక విండ్‌స్క్రీన్‌లపై ఉన్న వైపర్లు, వాటి వాషర్ సిస్టమ్, అలాగే వాషర్ ఆయిల్ స్థాయిని పరిశీలిస్తారు.

నీటి చినుగులు ఎక్కువగా పడే వాతావరణంలో ఇవి సమర్థవంతంగా పనిచేయాలంటే, సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అన్నది కీలకం. ఆటోమెటిక్ వైపర్, హెడ్‌లైట్ ఆపరేషన్‌ను నియంత్రించే రెయిన్-లైట్ సెన్సార్‌ను కూడా ఈ సమయంలో పరీక్షిస్తారు. వర్షపు చినుగులు మొదలైన వెంటనే లైట్లు వెలిగించాల్సిన అవసరం ఉంటుంది కనుక, ఈ సెన్సార్ సరిగ్గా స్పందించాలి. అలాగే హెడ్‌లైట్లు, ఫాగ్ లైట్లు, వాటి అసెంబ్లీ పరిస్థితి, హార్న్ పనితీరు కూడా తనిఖీ చేయబడతాయి.

అలాగే, కారులో ఉన్న మైక్రో ఫిల్టర్‌లు శుభ్రంగా ఉన్నాయా, మార్చాల్సిన అవసరమా ఉందా అని చెక్ చేస్తారు. ఇవి వాతావరణ కాలుష్యాన్ని అడ్డుకునే ముఖ్యమైన భాగాలు కావడంతో, వర్షాకాలంలో వీటి స్థితి మంచిగా ఉండటం అవసరం. ఇతర ముఖ్యమైన చెకింగ్‌లో డోర్లు, ట్రంక్ మూతల వాతావరణ స్ట్రిప్స్, సన్‌రూఫ్ కవర్ సీల్స్, ట్రంక్ వెంటిలేషన్ వంటి అంశాలు ఉంటాయి. వీటిల్లో వర్షపు నీరు రాకుండా ఉండేందుకు సీలింగ్ సమర్థంగా ఉండాలి.

అంతేగాక, సన్‌రూఫ్ డ్రెయిన్ పైప్‌లు క్లీన్‌గా ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలించడం ద్వారా నీటి నిలువుదల వల్ల సమస్యలు తలెత్తకుండా చూస్తారు. ఇంజిన్ కంట్రోల్ యూనిట్‌ను కాపాడే E-బాక్స్ శుభ్రత కూడా దీనిలో భాగమే. అలాగే, ఇంజిన్ కంపార్ట్‌మెంట్, కారు అండర్‌బాడీలో ఉన్న పవర్ ప్లగ్ కనెక్షన్‌లు సురక్షితంగా ఉన్నాయా అనే అంశాన్ని కూడా సాంకేతిక నిపుణులు జాగ్రత్తగా పరిశీలిస్తారు.

టైర్ కండిషన్ కూడా చెక్ చేస్తారు. టైర్ థ్రెడ్ డిపార్చర్‌ను అంటే, టైరు పైన ఉన్న గ్రీపింగ్ రెక్కల లోతును పరీక్షిస్తారు. అదనంగా, డ్యామేజ్, కట్స్, బంప్స్, టైర్ ప్రెజర్ స్థాయి వంటి అంశాలను కూడా సాంకేతిక నిపుణులు జాగ్రత్తగా చెక్ చేస్తారు. వర్షంలో అదుపుతప్పే ప్రమాదం ఎక్కువగా టైర్‌ వల్లే జరగవచ్చు కాబట్టి ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాల్లో ఛార్జింగ్ కేబుల్, అధిక వోల్టేజ్ ఛార్జింగ్ సాకెట్, తుప్పు పట్టడం, దెబ్బతినడం చెక్ చేస్తారు. బ్రేక్ విషయానికి వస్తే, బ్రేక్ ప్యాడ్‌ల మందాన్ని, పనితీరును చెక్ చేస్తారు. అలాగే, బ్రేక్ ఆయిల్ స్టేటస్, అల్లాయ్ వీల్స్, బాడీ కిట్‌లు, ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లు వంటివి ఇందులో ఉన్నాయి. BMW ఇండియా 5 సంవత్సరాల కంటే పాత యజమానులకు ప్రత్యేకమైన BMW Joy Rewards స్కీమ్‌ను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 25, 2025, 13:54 [IST]
English summary
Bmw india announced monsoon service campaign 2025 full details inside
Read more on: #bmw #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+