ఈ కారును చూడగానే లవ్ లో పడిపోతారు.. అంత అందం, పవర్ దీని సొంతం.. ధర కూడా తక్కువే

ఇంటి ముందు ఒక లగ్జరీ కారు ఉండాలని చాలా మంది కల కంటారు. ముఖ్యంగా బీఎండబ్ల్యూ సొంతం చేసుకోవడం అనేది చాలా మంది భారతీయ ఆటోమొబైల్ ప్రియుల ఆకాంక్ష. అయితే, అధిక ధరల కారణంగా ఈ కల చాలామందికి నెరవేరడం కష్టమే. కానీ ఇప్పుడు, బీఎండబ్ల్యూ తన కలలను నిజం చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది.

కంపెనీ రూ.48 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో ఒక అద్భుతమైన 2 సిరీస్ గ్రాన్ కూపే మోడల్‌ను విడుదల చేసింది. చెన్నైలోని బీఎండబ్ల్యూ గ్రూప్ ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేయబడిన ఈ రెండో తరం 2 సిరీస్ గ్రాన్ కూపే, పెట్రోల్ పవర్‌ట్రైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీఎండబ్ల్యూ ఇండియా డీలర్‌షిప్‌లలో ఈ కొత్త కారును బుక్ చేసుకోవచ్చు.

BMW 2 Series Gran Coupe

బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే తన విలక్షణమైన డిజైన్, స్పోర్టీ డ్రైవింగ్ స్వభావంతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రీమియం కాంపాక్ట్ సెగ్మెంట్‌లో స్టైల్, గ్రాన్ కూపే సిలౌట్‌ను కోరుకునే యూత్ కస్టమర్లలో ఇది చాలా త్వరగా పాపులారిటీ పొందింది.

కొత్త బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే ప్రత్యేకమైన స్పోర్టీ లుక్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, వెహికల్ ఎక్సటర్నల్ డిజైన్‌లో విశాలమైన ముందు భాగం, పవర్ ఫుల్‎గా డిజైన్ చేయబడిన వెనుక భాగం అన్నీ కలిపి కారు లుక్ అదిరిపోయింది.

BMW 2 Series Gran Coupe

సెకండ్ జనరేషన్ బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే పొడవు 20 మిల్లీమీటర్లు పెరిగి 4546మిల్లీమీటర్లు అయింది. వెడల్పు 1800 మిల్లీమీటర్లు, ఎత్తు 25 మిల్లీమీటర్లు పెరిగి 1445 మిల్లీమీటర్లు అయింది. దీని వీల్‌బేస్ 2670 మిల్లీమీటర్లు ఉంది.

ఈ కారు గ్లేర్-ఫ్రీ మ్యాట్రిక్స్ హై బీమ్ ఉన్న సెగ్మెంట్‌లోని బెస్ట్ అడాప్టివ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లతో వస్తుంది. ఇవి స్కై బ్లూ కలర్ యాక్సెంట్‌లు, కార్నరింగ్ లైట్ ఫంక్షన్‌ను కలిగి ఉంటాయి. హెడ్‌లైట్‌ల క్రింద అమర్చబడిన విశాలమైన బీఎండబ్ల్యూ రేడియేటర్ గ్రిల్, బ్లాక్ కలర్ లోయర్ ఎయిర్ ఇన్‌లెట్ కొత్త బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే ప్రంట్ లుక్ అద్బుతంగా మారుస్తాయి.

BMW 2 Series Gran Coupe

పొడవైన బోనెట్, చిన్న ఓవర్‌హాంగ్‌లు, విశాలమైన వీల్‌బేస్, స్పేసియస్ బ్యాక్, స్ట్రీమ్‌లైన్డ్ టెయిల్‌లైట్ డిజైన్, అలాగే హై గ్లోస్ బ్లాక్‌లో పూర్తి చేయబడిన దిగువ భాగం వెనుక వైపుకు ముఖ్యంగా స్పోర్టీ అందిస్తుంది. ఈ డిజైన్ అంశాలు కారుకు ఒక ఫారిన్ కారు లుక్ అందిస్తాయి.

ధర విషయానికి వస్తే, బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే రెండు ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది. 218i ఎం స్పోర్ట్ , 218i ఎం స్పోర్ట్ ప్రో. 218i ఎం స్పోర్ట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.46,90,000. 218i ఎం స్పోర్ట్ ప్రో ఎక్స్‌షోరూమ్ ధర రూ.48,90,000.

BMW 2 Series Gran Coupe

వినియోగదారుల సౌలభ్యం కోసం కంపెనీ వివిధ రకాల సర్వీస్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇవి లైం లిమిట్, మైలేజీని బట్టి ఉంటాయి. ఈ ప్యాకేజీలలో కండిషన్ బేస్డ్ సర్వీస్ మెయింటెనెన్స్ పనులు ఉంటాయి. ఈ ప్లాన్‌లు 3 సంవత్సరాలు / 40,000 కిలోమీటర్ల నుండి ప్రారంభమై, 10 సంవత్సరాలు / 2,00,000 కిలోమీటర్ల వరకు విస్తరించబడతాయి. అదనంగా, వారంటీ ప్రోగ్రామ్‌ను కూడా 10 సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం ఉంది.

ఈ కారులో భద్రతా ఫీచర్లలో అనేక అడ్వాన్సుడ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవి డ్రైవర్, ప్రయాణీకుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాయి. అటెన్‌టివ్‌నెస్ అసిస్టెన్స్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్తో సహా డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్-ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికిల్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్, ISOFIXచైల్డ్ సీట్ మౌంటింగ్, లోడ్ ఫ్లోర్ కింద ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ స్పేర్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, July 17, 2025, 16:45 [IST]
English summary
Bmw launches 2 series gran coupe luxury and power combined for half a crore
Read more on: #india #auto news #bmw
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+