కొండలు, గుట్టలు ఎక్కడానికి లగ్జరీ ఎస్‌యూవీ.. కొత్త బీఎమ్‌డబ్ల్యూ X5 వచ్చేసింది!

లగ్జరీ కార్ల బ్రాండ్‌ అయిన బిఎమ్‌డబ్ల్యూ (BMW) తమ ప్రముఖ ఎస్‌యూవీ X5 కొత్త వెర్షన్‌ అంటే X5 M స్పోర్ట్ ప్రోను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కొత్త వేరియంట్‌ను స్టాండర్డ్ X5 కంటే మరింత స్టైలిష్‌గా, మరింత అట్రాక్టివ్‎గా రూపొందించారు. ఈ కారు ధర, ఫీచర్లు, ఇంజిన్ వివరాలను ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం.

లగ్జరీ కార్ల మార్కెట్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఇప్పటికే తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ సంస్థ నుండి వచ్చిన X5 ఎస్‌యూవీకి భారత మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. దీనిని మరింత ఆకర్షణీయంగా, స్పోర్టీగా రూపొందించడానికి కొత్తగా M స్పోర్ట్ ప్రో వేరియంట్‌ను తీసుకొచ్చారు. పెట్రోల్ వెర్షన్ అయిన X5 xDrive 40i M స్పోర్ట్ ప్రో ధర రూ. 1.13 కోట్లు కాగా, డీజిల్ వెర్షన్ అయిన X5 xDrive 30d M స్పోర్ట్ ప్రో ధర రూ. 1.15 కోట్లు (ఎక్స్-షోరూమ్).

BMW X5 M Sport Pro Launched in India A Perfect Luxury SUV for Off-Roading

ఈ వాహనానికి హై-గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ ఉన్న కిడ్నీ గ్రిల్, ఎయిర్ డ్యామ్, ఎగ్జాస్ట్ ట్రిమ్ ఉన్నాయి. బ్రేక్ కాలిపర్లు హై-గ్లోస్ రెడ్ కలర్లో ఉండడం దీనికి మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది. లోపలి భాగంలో డాష్‌బోర్డ్‌పై పియానో బ్లాక్ ఫినిషింగ్, స్పోర్టీ M సీట్ బెల్టులు, అడ్వాన్సుడ్ డిజైన్ సీట్స్ దీని లగ్జరీని పెంచుతాయి.

బిఎమ్‌డబ్ల్యూ X5 M స్పోర్ట్ ప్రో కేవలం సిటీల్లో నడపడానికి మాత్రమే కాదు, కఠినమైన రోడ్లపై ప్రయాణించడానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా xOffroad ప్యాకేజీ లభిస్తుంది. ఇందులో నాలుగు రకాల డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి: ఇసుక (xSand), రాళ్ళు (xRocks), కంకర (xGravel), మంచు (xSnow).

BMW X5 M Sport Pro Launched in India A Perfect Luxury SUV for Off-Roading

ఈ మోడ్‌లు వాహనం ఎత్తును, యాక్సెలరేషన్ రెస్పాన్స్‌ను, ట్రాన్స్‌మిషన్, xDrive సిస్టమ్‌ను రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా ఆటోమెటిక్‌గా సర్దుబాటు చేస్తాయి. దీనివల్ల డ్రైవర్ ఏ రకమైన రోడ్డునైనా సులభంగా కంట్రోల్ చేయవచ్చు.

ఈ ఎస్‌యూవీలో ఎయిర్ సస్పెన్షన్, కంఫర్ట్ సీట్లు, మ్యాట్రిక్స్ అడాప్టివ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 21-అంగుళాల అల్లాయ్ వీల్స్, కర్వ్డ్ డిస్‌ప్లే, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, హర్మన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. కారు లోపల ఉన్న 12.3-అంగుళాల ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, 14.9-అంగుళాల కంట్రోల్ డిస్‌ప్లేతో కూడిన బిఎమ్‌డబ్ల్యూ వైడ్‌స్క్రీన్ కర్వ్‌డ్ డిస్‌ప్లే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

BMW X5 M Sport Pro Launched in India A Perfect Luxury SUV for Off-Roading

బిఎమ్‌డబ్ల్యూ X5 M స్పోర్ట్ ప్రో రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 3.0 లీటర్, 6-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 375 bhp పవర్‌ను, 520 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.4 సెకన్లలో 0 నుండి 100 km/h వేగాన్ని అందుకుంటుంది. డీజిల్ వెర్షన్‌లో 3.0 లీటర్, 6-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది.

ఇది 282 bhp పవర్‌ను, 650 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6.1 సెకన్లలో 0 నుండి 100 km/h వేగాన్ని చేరుకుంటుంది. ఈ రెండు ఇంజిన్‌లకు 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ లభిస్తుంది, ఇది అదనంగా 12 bhp పవర్, 200 Nm టార్క్ బూస్ట్ ఇస్తుంది. ఈ ఎస్‌యూవీ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ X5 M స్పోర్ట్ ప్రో ఇప్పుడు మరింత లగ్జరీగా, స్పోర్టీగా, శక్తివంతంగా మారింది. ఇది నగరంలో అయినా, సవాలుతో కూడిన రోడ్లపై అయినా అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరుస్తుంది. దీని ధర కోట్లలో ఉన్నప్పటికీ, ఫీచర్లు, పనితీరును చూస్తే లగ్జరీ కార్లను ఇష్టపడేవారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక అవుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 29, 2025, 12:51 [IST]
English summary
Bmw x5 m sport pro launched in india a perfect luxury suv for off roading
Read more on: #bmw #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+