రోడ్లు ఎలా ఉన్నా దూసుకుపోతుంది.. కొండలు, గుట్టలను అవలీలగా ఎక్కేస్తుంది.. కొత్త బొలేరో డిజైన్ అదుర్స్

భారతదేశంలో నంబర్ వన్ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ తయారీదారు అయిన మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్‌లోకి ఒకటి కంటే ఎక్కువ కొత్త ప్రొడక్ట్స్ రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ ప్రొడక్టులతో చాలా వరకు వివిధ సందర్భాలలో భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో కెమెరా కంటికి చిక్కాయి. మహీంద్రా ప్రతేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంటే ఆగస్టు 15న కొత్త ఉత్పత్తులు, కాన్సెప్ట్ మోడల్‌లను పరిచయం చేస్తుంది.

ఈ సంవత్సరం జరిగే ఈవెంట్‌లో మహీంద్రా విడుదల చేయబోయే ప్రొడక్టులతో ఒకటి న్యూ జనరేషన్ బొలెరో. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో 20 సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉన్న వెహికల్ మహీంద్రా బొలెరో. ఈ కాలంలో బొలెరోలో చెప్పుకోదగిన మార్పులు జరగలేదు. అయితే, లాంచ్‌కు ముందు కొత్త బొలెరో టెస్టింగ్ ఫోటోలు బయటకు వచ్చాయి.

Mahindra Bolero
Photo Credit:

ఈ టెస్టింగ్ వెహికల్ చాలా వరకు కవర్ చేయబడి ఉంది. మహీంద్రా కొత్త మోడల్‌కు మహీంద్రా థార్ స్పోర్ట్స్ అనే పేరు పెట్టాలని కూడా ఆలోచిస్తోంది. కొత్త కారులో మనం ఆశించే విషయాల గురించి తెలుసుకుందాం.

కొత్త మహీంద్రా బొలెరో దాని స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్‌ను కొనసాగించే విధంగా డిజైన్ చేయబడింది. స్పై ఫోటోల ప్రకారం.. దీనికి స్క్వేర్డ్-ఆఫ్ బాడీ ప్యానెల్స్, అప్‌రైట్ స్టాన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇది ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను గుర్తుకు తెస్తుంది. ఈ డిజైన్ భారతీయ రోడ్లపై బొలెరో మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందని హామీ ఇస్తుంది.

Mahindra Bolero

కొత్త మోడల్‌లో ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్‌ను ఆశించవచ్చు. XUV700 ఎస్‌యూవీలో మహీంద్రా మోటరైజ్డ్ ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్‌ను అందించింది. ఇది ఉన్నత ప్రమాణాలను ప్రదర్శిస్తుంది. అయినప్పటికీ, ఖర్చులను తగ్గించడానికి కొత్త తరం బొలెరోలో మహీంద్రా మాన్యువల్ హ్యాండిల్స్‌ను అందించే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇది కారుకు మరింత ఎట్రాక్షన్ పెంచుతుంది.

కంపెనీ ఇటీవలి హిట్ మోడల్ అయిన థార్ రాక్స్‎లో ఉన్న అనేక ఫీచర్లు, టెక్నాలజీని కొత్త బొలెరోలో తీసుకువస్తారని ఆశిస్తున్నారు. పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్-2 ADAS, ప్రీమియం సౌండ్ సిస్టమ్, పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఇది ప్రయాణాన్ని మరింత మెరుగ్గా చేయడానికి సహాయపడుతుంది.

Mahindra Bolero

కొత్త బొలెరో ఇంటీరియర్‌లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. మహీంద్రా స్కార్పియో N ఎస్‌యూవీలోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇందులో ఉపయోగిస్తారని నివేదికలు చెబుతున్నాయి. ఇది తయారీ ఖర్చులను తగ్గించడమే కాకుండా, డ్యాష్‌బోర్డ్‌కు లేటెస్ట్ లుక్ ఇవ్వడానికి సాయపడుతుంది. ప్రస్తుత కాలంలో వినియోగదారులు కేవలం ప్రాక్టికాలిటీకే కాకుండా సౌకర్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, బొలెరోలో ఈ మార్పు అవసరం.

రాబోయే కొత్త బొలెరోకు కొత్త మోనోకాక్ షాసిస్ లభిస్తుందని చెబుతున్నారు. అలాగే, స్పై ఫోటోల నుండి అందిన సమాచారం ప్రకారం కొత్త మహీంద్రా బొలెరోలో ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్ ఫీచర్ ఉంటుంది. కాబట్టి, ఈ మోడల్ మెరుగైన హ్యాండ్లింగ్‌ను కలిగి ఉంటుందని ఆశించవచ్చు.

Mahindra Bolero

కొత్త తరం మహీంద్రా బొలెరోను అభివృద్ధి చేయడానికి మహీంద్రా ఇంత సమయం తీసుకున్నందున, ప్రస్తుతం ఉన్న పవర్‌ట్రెయిన్‌ల హైబ్రిడ్ వెర్షన్ మార్కెట్‌లోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లపై తాము దృష్టి సారిస్తున్నామని కంపెనీ స్పష్టం చేసింది. ఈ మార్పులు కాంపిటేటివ్ మార్కెట్‌లో తమ మోడల్‌లను అప్‌డేట్‌గా ఉంచడానికి మహీంద్రా చేస్తున్న ప్రయత్నాలను హైలైట్ చేస్తాయి.

కొత్త టెక్నాలజీలను యాడ్ చేయడం ద్వారా, మహీంద్రా పాత కస్టమర్‌లను, కొత్త కస్టమర్‌లను ఆకర్షించాలని టార్గెట్‎గా పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతంలో బొలెరోకు ఉన్న ఆదరణ, థార్ అనే పేరుకు ఉన్న ఫ్యాన్‌బేస్‌ను పరిగణనలోకి తీసుకుని, ఈ కొత్త మోడల్‌కు థార్ స్పోర్ట్స్ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా, లాంచ్ దగ్గర పడుతున్న కొద్దీ మహీంద్రా కొత్త కారు వివరాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, July 21, 2025, 18:45 [IST]
English summary
Boleros advanced features and technology drawing from thar rox
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+