ఆల్టో కె10 వద్దు అనుకుంటున్నారా? దానికి ఆల్టర్నేటివ్ గా తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ హ్యాచ్‌బ్యాక్స్ ఇవే!

మారుతి సుజుకి ఆల్టో కె10 ఒకప్పుడు పేదల కారుగా బాగా ప్రాచుర్యం పొందిన బాగా హ్యాచ్‌బ్యాక్. దీని ధర రూ. 4.23 లక్షల నుంచి రూ. 6.21 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 1-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. మైలేజ్ కూడా 24.39 నుండి 33.85 కిలోమీటర్ల వరకు ఉంటుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు చాలా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

నలుగురు లేదా ఐదుగురు ప్రయాణించగల ఈ కారుకు బెస్ట్ ఆల్టర్నేటివ్ గా మరో మూడు కార్లు ఉన్నాయి. వాటి ధర, ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Maruti Alto K10

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid): ఈ కారు ధర రూ. 4.70 లక్షల నుండి రూ. 6.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 21.46 నుండి 22.3 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. కొత్త క్విడ్ హ్యాచ్‌బ్యాక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ఫైరీ రెడ్, మూన్‌లైట్ సిల్వర్, ఐస్ కూల్ వైట్ వంటి వివిధ రంగుల్లో లభిస్తుంది.

ఈ కారులో ఐదుగురు కూర్చోవచ్చు. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కీ లెస్ ఎంట్రీ, మాన్యువల్ ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), టీపీఎమ్ఎస్ (టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్) వంటివి ఉన్నాయి.

Renault Kwid

టాటా టియాగో (Tata Tiago): ఇది కూడా బాగా పేరు పొందిన హ్యాచ్‌బ్యాక్. దీని ధర రూ. 5 లక్షల నుండి రూ. 8.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. 19.43 నుండి 28.06 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో కూడా ఐదుగురు సులభంగా ప్రయాణించవచ్చు.

ఈ టాటా టియాగో ప్రిస్టీన్ వైట్, డేటోనా గ్రే, టొర్నడో బ్లూ, సూపర్‌నోవా కాపర్, ఓసెనా బ్లూ, అరిజోనా బ్లూ వంటి అనేక రంగుల్లో అందుబాటులో ఉంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీ లెస్ ఎంట్రీ & పుష్ స్టార్ట్-స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), రియర్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి.

Tata Tiago

మారుతి సుజుకి ఇగ్నిస్ (Maruti Suzuki Ignis): ఆల్టో కె10కి బదులుగా ఈ హ్యాచ్‌బ్యాక్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 5.85 లక్షల నుండి రూ. 8.12 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 20.89 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

ఈ మారుతి ఇగ్నిస్ కారులో ఐదుగురు ప్రయాణించవచ్చు. ఇది నెక్సా బ్లూ, లూసెంట్ ఆరెంజ్, సిల్కీ సిల్వర్, టర్క్వోయిజ్ బ్లూ & పెర్ల్ ఆర్కిటిక్ వైట్ వంటి అనేక రంగుల్లో లభిస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

Maruti Suzuki Ignis

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, April 20, 2025, 8:43 [IST]
English summary
Boss these 3 cars are best alternatives to affordable maruti alto k10 hatchback price features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+