Auto expo 2025: వావ్.. ఆటో ఎక్స్‌పోలో మినీ కూపర్.. చూడటానికి రెండు కళ్లు చాలవంతే! బుకింగ్స్ కూడా స్టార్ట్
దేశరాజధాని ఢిల్లీలో ఎంతో ఘనంగా జరుగుతున్న భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో బ్రిటిష్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ మినీ (Mini) కొత్తగా మినీ కూపర్ S JCW ప్యాక్ (Mini Cooper S John Cooper Works Pack) ను విడుదల చేసింది. ఇది చూడటానికి ఒక మహరాణిలాగా కనిపిస్తుంది. దీని డిజైన్ సరికొత్తగా ఉంది. దాని ముందు భాగంలో ఉన్నటుంటి హెడ్‌లైట్ సెటప్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆటో ఎక్స్‌పో ఈవెంట్‌లోనే ధర. బుకింగ్ వివరాలను కూడా వెల్లడించింది. మినీ కూపర్ S JCW ప్యాక్ ప్రారంభ ధర రూ..55.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారు బుకింగ్ చేసుకోవచ్చు. కంపెనీ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. దీని డెలివరీలను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తామని మినీ ఇండియా అధికారులు తెలిపారు.
కొత్త కూపర్ S JCW ప్యాక్ ఇప్పటికే ఇండియాలో అమ్మకానికి ఉన్నటువంటి స్టాండర్డ్ కూపర్ Sతో పోలిస్తే మరింత కొత్తగా అప్‌డేట్ అయింది. ఈ కొత్త కారులో శక్తివంతమైన ఇంజిన్, స్పోర్టియర్ ఎక్స్‌టీరియర్ డిజైన్, ఇంటీరియర్ ఫీచర్స్ అన్ని కూడా అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. ఇది స్టాండర్డ్ కూపర్‌లో ఉన్న మాదిరిగానే 2.0-లీటర్, నాలుగు-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది.

ఈ ఇంజిన్ 201 bhp పవర్, 300 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మినీ జాన్ కూపర్ వర్క్స్ టాప్ స్పీడ్ గంటకు 250 కిమీలు. ఇది కేవలం 6.1 సెకన్లలో 0-100 kmph వేగాన్ని చేరుకుంటుంది. స్టాండర్డ్ కూపర్‌తో పోలిస్తే, కొత్త JCW కారు శాలమైన ఎయిర్ వెంటిలేషన్‌తో ముందు బ్లాక్ గ్రిల్‌ను కలిగి ఉంది. LED DRLల సెటప్ పాత మోడల్‌తో పోలిస్తే విభిన్నంగా ఉన్నాయి.
వెనుక సెంట్రల్‌గా పొజిషన్‌లో ఇచ్చిన టెయిల్‌పైప్, రెడ్ యాక్సెంట్‌లు కనిపిస్తాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే అద్బుతంగా ఉంటుంది. లోపల 9.5-అంగుళాల వృత్తాకార ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, రెడ్, బ్లాక్ ఇంటీరియర్ థీమ్ యాంబియంట్ లైటింగ్‌తో మరింత అందంగా కనిపిస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, అధునాతన డాష్‌బోర్డ్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్, లోపల ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

రౌండ్ షేపులో ఉన్నటువంటి ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ సహా లోపలి సదుపాయాలు సాధారణ కూపర్ S మాదిరిగా ఉంటాయి. ఇది మిడ్‌నైట్ బ్లాక్, లెజెండ్ గ్రే అనే కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ప్రత్యేకమైన డోర్ సిల్స్, ఆకట్టుకునే వీల్స్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్‌లు వంటి వాటితో ఈ కారు భారతీయ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.
బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ మినీ ఇక్కడి మార్కెట్లో తమ ఉనికి నిలబట్టడానికి ఈ కొత్త మోడల్‌ను తెచ్చింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మినీ సంస్థ ప్రదర్శించిన ఏకైక కారు మెడల్ మినీ కూపర్ S JCW ప్యాక్ (Mini Cooper S John Cooper Works Pack).బుకింగ్ చేసుకోవాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. లేదా దగ్గరలోని షోరూమ్‌లో సిబ్బందిని సంప్రదించాలి.

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం మా డ్రైవ్‌స్పార్క్ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








