కాస్త ఆగండి.. ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి.. బడ్జెట్‌లో వరాల జల్లు!

ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసేవారికి కేంద్రం తీపి కబురు చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే బ్యాటరీలు, మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాల తయారీకి బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీలో మినహాయింపుతో ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. యూనియన్‌ బడ్జెట్‌ (Union Budget 2025)లో బేసిక్ కస్టమ్ డ్యూటీ (BCD) మినహాయింపుతో పాటు నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కీలకమైన విడిభాగాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, స్థానిక తయారీ రంగాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ తయారీకి ఊతమిచ్చేలా కస్టమ్స్ మినహాయింపులు ఇచ్చారు. 2024 జూలై బడ్జెట్‌లో దిగుమతి చేసుకునే 25 కీలకమైన ఖనిజాలపై కస్టమ్‌ డ్యూటీని మినహాయించారు. వీటి ద్వారా MSMEలు వాటి ప్రాసెసింగ్‌కి కలిసి వచ్చింది. ఇప్పుడు ఈ జాబితాలో కోబాల్ట్ పౌడర్ దాని వ్యర్థాలు, లిథియం-అయాన్ బ్యాటరీ స్క్రాప్, లెడ్, జింక్ మరో 12 ముఖ్యమైన ఖనిజాలను పూర్తిగా మినహాయించారు.

Budget 2025 EVs Cheaper

పునరుత్పాదక (ReGenerative) ఇంధన పరికరాల కోసం ఉపయోగించే ఈవీ బ్యాటరీ ప్యాక్స్‌, ఇతర పరికరాల తయారీలో ఈ పదార్థాలు చాలా కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా లిథియం-అయాన్ బ్యాటరీల ఉత్పత్తికి అవసరమైన ఈ కీలక భాగాలపై కస్టమ్స్ సుంకాలను మినహాయించడం ద్వారా ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గనుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు మరింత తగ్గనున్నాయి. త్వరలోనే ఇవి అమలు అయ్యే అవకాశం ఉంది.

అంతే కాకుండా ప్రతీ రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలకు విధానపరమైన మద్దతు, రోడ్ మ్యాప్స్‌, పాలన, పర్యవేక్షణ ఫ్రేమ్ వర్క్ అందించడం ద్వారా "మేక్ ఇన్ ఇండియా" నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలను కలుపుకొని ప్రభుత్వం "నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్"ను ఏర్పాటు చేస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో ఆటోరంగం కీలకంగా ఉండనుంది.

Budget 2025 Auto Industry

సోలార్ పీవీ సెల్స్, ఈవీ బ్యాటరీలు, మోటార్లు, కంట్రోలర్లు, ఎలక్ట్రోలైజర్లు, విండ్ టర్బైన్స్‌, హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ పరికరాలు, గ్రిడ్ స్కేల్ బ్యాటరీల వంటివి వీటి కిందకు రానున్నాయి. దీంతో సుంకాన్ని ఎత్తి వేయడం ద్వారా దీర్ఘకాలికంగా భవిష్యత్తులో లిథియం-అయాన్ బ్యాటరీలు వాటి సంబంధిత టెక్నికల్‌ చైన్‌లో భారత్‌ కీలకంగా వ్యవహరించనుంది. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా, ప్రభుత్వం అంతర్గత డిమాండ్స్‌ తీరనున్నాయి.

అంతే కాకుండా కాకుండా భవిష్యత్తులో ఈ కీలకమైన భాగాలను, టెక్నాలజీని ఎగుమతి చేసే అవకాశాలు కూడా లేకపోదు. ఈ వ్యూహాత్మక చర్య భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను చౌకగా చేయడమే కాకుండా, ప్రపంచ వేదికపై భారతదేశంలో పోటీతత్వాన్ని మరింత పెంచనున్నాయి. ముఖ్యంగా స్థిరమైన ఇంధన వనరులను ఉపయోగించడంలో ఇవి తోడ్పాటు అందించనున్నాయి. ఈ రంగాలలో సుస్థిరత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం వల్ల భవిష్యత్తులో ఈవీ రంగం రాటుదేలనుంది.

Budget 2025 Electric Vehicles

ఎలక్ట్రిక్ వాహనాల కోసం లిథియం-అయాన్ బ్యాటరీల తయారీ కోసం విడిభాగాలపై కస్టమ్స్ సుంకాలను మినహాయించడం, కేంద్ర బడ్జెట్ 2025 లో నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్ ఏర్పాటు వల్ల కీలకమైన ఈ ఖనిజాల దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, ఉద్యోగాల కల్పనను పెంచనుంది. ఈ చర్య ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచే అవకాశం ఉంటుంది. దేశం ఈవీ రంగంలో ప్రపంచానికే ఓ రోల్‌ మోడల్‌గా మారే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, February 1, 2025, 17:04 [IST]
English summary
Budget 2025 govt exempts customs on li ion battery big boost for ev industry
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+