రూ.5 లక్షల కంటే తక్కువ ధరకే 4 కార్లు.. 32 కిలోమీటర్ల పైనే మైలేజ్.. చిన్న బడ్జెట్‌లో బెస్ట్ మోడళ్లు
భారత మార్కెట్‌లో తక్కువ ధరలో, మంచి మైలేజ్ కలిగిన కార్లకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రూ.5 లక్షల కంటే తక్కువ ధర గల హ్యాచ్‌బ్యాక్ మోడల్స్ అత్యంత ప్రజాదరణ పొందినవిగా ఉంటాయి. సరసమైన ధరతోనే నమ్మకమైన పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చులు అందించడంతో వీటికి వినియోగదారుల ఆకర్షణ ఉంది. మొదటి సారి కారు కొనుగోలు చేసేవారికి లేదా రోజువారీ నగర ప్రయాణానికి కారును అవసరపడే వారికి ఈ మోడల్స్ ఉత్తమ ఎంపికగా నిలుస్తాయి. GST తగ్గింపులు, పోటీ ధరలు, మైలేజ్ వీటికి మరింత ఆకర్షణీయతను ఇస్తాయి. నగరాలలోని ట్రాఫిక్, చిన్న రోడ్లు, లిమిటెడ్ పార్కింగ్ పరిస్థితులను కూడా ఈ హ్యాచ్‌బ్యాక్‌లు సులభంగా ఎదుర్కోంటాయి. ఈ కథణంలో తక్కువ ధర, మైలేజ్ పరంగా బెస్ట్ కార్లను అందించడం జరిగింది.
Maruti Suzuki Alto K10: భారత హ్యాచ్‌బ్యాక్ మార్కెట్‌లో ఆల్టో K10 చిన్న సైజ్, తక్కువ ధర కలిగిన వాహనంగా నిలిచింది. దీని ప్రారంభ ధర రూ. 3.7 లక్షలు(ఎక్స్-షోరూమ్), అంటే మొదటి సారి కారు కొనుగోలు చేసేవారికి, మధ్యతరగతి కుటుంబాలకు సులభంగా అందుబాటులో ఉంది. ఈ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. లీటరుకు 24.9 కి.మీ మైలేజీని అందించే ఈ కారు చిన్న కుటుంబాలకు సరైన ఎంపిక.

దీని Cng మోడల్ దాదాపు 33.85 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది కాంపాక్ట్ డిజైన్‌తో, సాంకేతికంగా సౌకర్యవంతమైన ఇంటీరియర్‌తో, నగర రోడ్లలో రద్దీ, తక్కువ పార్కింగ్ స్థలం ఉన్న ప్రాంతాల్లోనూ సులభంగా నావిగేట్ చేయగలదు. చిన్న వాహనం అయినప్పటికీ దూర ప్రయాణాలకు కూడా సులభంగా ఉపయోగించవచ్చు. పనితీరు పరంగా చూసినప్పుడు, ఆల్టో K10 గరిష్టంగా గంటకు 145 కి.మీ వేగం సాధించగలదు.
Maruti Suzuki S-presso: భారత మార్కెట్‌లో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో తన ప్రత్యేక మినీ-SUV రూపం, ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 3.5 లక్షలు (ఎక్స్-షోరూమ్), అంటే కంటే తక్కువ ఆదాయం కలిగిన వారికి కూడా సులభంగా అందుబాటులో ఉంది. ఇది పెట్రోల్‌లో 24-25 kmpl మైలేజీని CNG వేరియంట్‌లో 32.73 km/kg మైలేజీ అందించటం వలన, దీన్ని లాంగ్ డ్రైవ్‌లకు కూడా ఉపయోగించడం సులభం.

కారులో 5 సీట్లు ఉంటాయి. డిజైన్ పరంగా LED హెడ్‌ల్యాంప్స్, LED టెయిల్‌ల్యాంప్స్, 14-అంగుళాల చక్రాలతో ఉంటుంది. ఇది దాదాపు 180 mm గ్రౌండ్ క్లియరెన్స్, 2,380 mm వీల్‌బేస్ వల్ల చిన్న SUVలా లుక్ ఇస్తుంది. చూడటానికి చిన్న కారులా అనిపిస్తుంది. అయినప్పటికి దీనిలో డజన్ల కొద్ది సౌకర్యవంతమైన ఫీచర్స్ ఉన్నాయి. లోపల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ క్లస్టర్, USB కనెక్టివిటీ వంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి.
Renault KWID: రెనాల్ట్ క్విడ్ ప్రత్యేకమైన స్టైలిష్ డిజైన్‌తో ఆకర్షణగా నిలిచింది. దీని ప్రారంభ ధర రూ.4.3 లక్షలు(ఎక్స్-షోరూమ్), మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లో పనిచేస్తుంది. ఇది 68 ps పవర్, 91 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 5 స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ లభిస్తుంది. ఇది దాదాపు 23 కి.మీల వరకు మైలేజ్ ఇస్తోంది.

Tata Tiago: టాటా మోటార్స్‌కు చెందిన టియాగో అత్యున్నత సేఫ్టీ ప్రమాణాలతో పాటు, అందుబాటు ధరలో, పలు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర దాదాపు రూ.4.57 లక్షల (ఎక్స్-షోరూమ్). ఇది పెట్రోల్లో 19 కిలోమీటర్ల మైలేజీని, CNG లో అయితే 28.06 కి.మీ మైలేజీని, ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అయితే దాదాపు పూర్తి ఛార్జ్‌తో 290 కి.మీల వరకు దూసుకెళ్లగలదు.


Click it and Unblock the Notifications








